Maruti Car Discounts July 2026: ఈ నెలలో కొత్త కారు కొనాలని భావిస్తున్న వారికి మారుతి సుజుకి క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. ఎరీనా షోరూమ్ లలో విక్రయించే పలు కార్లపై కంపెనీ రూ.90,000 వరకు డిస్కౌంట్లు, ఎక్స్ చేంజ్ బోనస్ లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, ఇతర ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. టాక్సీ మోడళ్లపై కూడా రూ.70,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇంతకీ ఏ మోడల్ మీద ఎంత తగ్గింపు అనేది ఇప్పుడు చూద్దాం..
మారుతి ఎస్-ప్రెస్సోపై ఈ నెలలో రూ.37,500 వరకు బెనిఫిట్ అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్, అలాగే కొన్ని ప్రత్యేక కస్టమర్ల కోసం అదనపు ఆఫర్లు ఉన్నాయి.
మారుతి ఆల్టో K10పై గరిష్టంగా రూ.52,500 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. టూర్ H1 టాక్సీ వెర్షన్ పై రూ.50,000 వరకు బెనిఫిట్ లభిస్తోంది. బడ్జెట్ కారు కొనాలనుకునే వారికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
మారుతి సెలెరియోపై రూ.37,500 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే ఎక్కువ మంది కొనుగోలు చేసే వాగన్ ఆర్‌పై గరిష్టంగా రూ.52,500 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. టూర్ H3 టాక్సీ వెర్షన్ పై అయితే రూ.70,000 వరకు బెనిఫిట్ లభిస్తోంది.
మారుతి ఈకోపై రూ.37,500 వరకు డిస్కౌంట్ ప్రకటించారు. దీని టాక్సీ వెర్షన్ టూర్ Vపై రూ.50,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాపార అవసరాల కోసం వాహనం కొనాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.
ప్రముఖ హ్యాచ్ బ్యాక్ అయిన మారుతి స్విఫ్ట్ పై గరిష్టంగా రూ.45,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే, కొత్త డిజైర్ సెడాన్ పై ఈ నెలలో ఎలాంటి క్యాష్ డిస్కౌంట్, ప్రత్యేక ఆఫర్ లేదు. కానీ, డిజైర్ టాక్సీ వెర్షన్ టూర్ Sపై ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్ లభిస్తోంది.
కాంపాక్ట్ SUV విభాగంలో ఉన్న మారుతి బ్రెజ్జాపై గరిష్టంగా రూ.55,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్, కొంత మంది ప్రత్యేక కస్టమర్లకు అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి. త్వరలో బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఈ డిస్కౌంట్లు ప్రకటించినట్లు భావిస్తున్నారు.
ఈ నెలలో అత్యధిక బెనిఫిట్ మారుతి విక్టోరిస్‌పై లభిస్తోంది. ఈ మోడల్‌పై గరిష్టంగా రూ.90,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఇందులో ఎక్స్చేంజ్, స్క్రాపేజ్ బోనస్‌తో పాటు లాయల్టీ బోనస్ లాంటి ఆఫర్లు కూడా ఉన్నాయి.
Read Also: 400+ కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే లుక్.. కియా సైరోస్ EV వచ్చేస్తోంది!