E-Paper
Advertisement

లిథియం ఐరన్ ఫాస్ఫేట్ vs నికెల్ మాంగనీస్ కోబాల్ట్.. ఈవీకి ఏ బ్యాటరీ బెస్ట్?

లిథియం ఐరన్ ఫాస్ఫేట్ vs నికెల్ మాంగనీస్ కోబాల్ట్.. ఈవీకి ఏ బ్యాటరీ బెస్ట్?
Advertisement

LFP vs NMC Battery Explained: ఎలక్ట్రిక్ బైక్ లేదంటే ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే  రేంజ్ ఎంత వస్తుంది? ధర ఎంత? అనేది మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవద్దు. EV పనితీరు, భద్రత, బ్యాటరీ లైఫ్ టైమ్ లాంటి ముఖ్యమైన అంశాలు ఎక్కువగా అందులో ఉపయోగించిన బ్యాటరీ టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా రెండు ప్రధాన బ్యాటరీ రకాలు ఉన్నాయి. వాటిలో LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) ఒకటి కాగా, NMC (నికెల్ మాంగనీస్ కోబాల్ట్) మరొకటి. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను తెలుసుకుంటే మీ అవసరాలకు సరిపోయే EVని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

రేంజ్ గురించి..

NMC బ్యాటరీలు ఒకే పరిమాణంలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని ఉపయోగించిన వాహనాలు సాధారణంగా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. LFP బ్యాటరీలు కొద్దిగా తక్కువ శక్తిని నిల్వ చేసినా, రోజువారీ ప్రయాణాలకు అవసరమైన రేంజ్‌ ను అందిస్తాయి. ఛార్జింగ్ విషయానికి వస్తే, రెండు బ్యాటరీలు కూడా ఫాస్ట్ ఛార్జింగ్‌ కు సపోర్టు చేస్తాయి. అయితే, తయారీ కంపెనీ ఉపయోగించిన బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఛార్జర్ సామర్థ్యం లాంటి అంశాలు కూడా ఛార్జింగ్ వేగాన్ని ప్రభావితం చేస్తాయి.

బ్యాటరీ లైఫ్ టైమ్..

Advertisement

బ్యాటరీ లైఫ్ టైమ్ పరంగా చూస్తే LFP ముందుంటుంది. ఈ బ్యాటరీలు ఎక్కువ ఛార్జింగ్ సైకిల్స్ ను తట్టుకుని చాలా సంవత్సరాల పాటు పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి. రోజూ వెహికల్ ఉపయోగించే వారికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. NMC బ్యాటరీలు కూడా మంచి పనితీరును అందించినప్పటికీ, LFPతో పోలిస్తే లైఫ్ టైమ్ కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

భద్రత గురించి..

భద్రత పరంగా LFP బ్యాటరీలు మరింత  రిలయబుల్ గా గుర్తింపు పొందాయి. ఎక్కువ ఉష్ణోగ్రతల దగ్గర కూడా ఇవి స్థిరంగా పనిచేస్తాయి. థర్మల్ రన్‌ అవే ప్రమాదం కూడా చాలా తక్కువగా ఉంటుంది. NMC బ్యాటరీల్లో అధిక శక్తి నిల్వ ఉండటంతో సరైన కూలింగ్ వ్యవస్థ అవసరం. లేటెస్ట్ EVల్లో దీనికి తగిన భద్రతా సాంకేతికతలను కంపెనీలు అందిస్తున్నప్పటికీ, LFP నేచురల్ గానే మరింత సేఫ్ గా భావిస్తారు. వాతావరణ పరిస్థితుల ప్రభావం కూడా బ్యాటరీ పనితీరుపై ఉంటుంది. చల్లని ప్రాంతాల్లో NMC బ్యాటరీలు సాధారణంగా మంచి పనితీరును చూపుతాయి. LFP బ్యాటరీల్లో చలికాలంలో పనితీరు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయితే వేడి వాతావరణంలో LFP బ్యాటరీలు చక్కగా పనిచేయడంలో ముందుంటాయి. భారత్ లాంటి వేడి వాతావరణం ఉన్న దేశాల్లోనూ అనుకూలంగా ఉంటాయి.

ధర ఎంత అంటే?

Advertisement

LFP బ్యాటరీలు సాధారణంగా తక్కువ ఖర్చుతో తయారవుతాయి. అందువల్ల ఈ బ్యాటరీలతో వచ్చే EVల ధర కూడా కొంత వరకు అందుబాటులో ఉంటుంది. NMC బ్యాటరీల్లో ఉపయోగించే ముడి పదార్థాల ఖర్చు ఎక్కువగా ఉండటంతో వాటి ధర కూడా అధికంగా ఉంటాయి.

Read Also: పెట్రోల్ అవసరం లేదు.. నీటితో నడిచే స్కూటర్ వచ్చేసింది!

Related News

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

Big Stories

Advertisement
×