E-Paper
Advertisement

BYDకి భారీ షాక్.. Ti7 SUV అమ్మకాలపై కోర్టు నిషేధం! JLR ఎందుకు కేసు వేసిందంటే?

BYDకి భారీ షాక్.. Ti7 SUV అమ్మకాలపై కోర్టు నిషేధం! JLR ఎందుకు కేసు వేసిందంటే?
Advertisement

BYD Ti7 SUV Ban: చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ BYDకి యూరప్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తన కొత్త SUV Ti7 డిజైన్‌ను కాపీ చేసిందంటూ  లగ్జరీ కార్ల సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) చేసిన ఆరోపణలపై డచ్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. యూరోపియన్ యూనియన్ (EU)లో BYD Ti7 SUV అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, హంగరీలోని కొత్త ప్లాంట్‌లో ఈ SUV తయారీని కూడా నిలిపివేయాలని తీర్పు చెప్పింది.

డిఫెండర్ డిజైన్‌ను కాపీ చేసిందని ఆరోపణలు

నెదర్లాండ్స్‌ లోని హేగ్ జిల్లా కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. BYD Ti7 SUVలో JLRకు చెందిన డిఫెండర్ డిజైన్‌లోని స్పెషల్ ఫీచర్లు కనిపిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. రెండు SUVలను పరిశీలిస్తే కొన్ని పోలికలు స్పష్టంగా కనిస్తున్నాయని వెల్లడించింది. బాక్సీ డిజైన్, ఫ్లాట్ రూఫ్, డిజైన్,  వీల్ ఆర్చ్‌ లు, వెనుక భాగంలోని టెయిల్‌గేట్ స్టైలింగ్ ఒకే విధంగా ఉన్నాయని JLR వాదించింది.

BYD కొత్త ప్లాంట్‌పైనా ఎఫెక్ట్

Advertisement

ఈ వివాదం కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాలేదు. హంగరీలో ఏర్పాటు చేస్తున్న కొత్త ప్లాంట్‌లో Ti7 SUV తయారీని కూడా కోర్టు నిలిపివేసింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్లాంట్‌లో భారీ స్థాయిలో ఉత్పత్తి చేపట్టాలని BYD భావించింది. అయితే, ఈ నిషేధం యూరోపియన్ యూనియన్ పరిధిలోనే వర్తిస్తుంది. తీర్పు వెలువడిన వారం తర్వాత నిషేధం అమల్లోకి రానుంది. బ్రిటన్‌లోని BYD సెగ్మెంట్ పై ఈ కోర్టుకు అధికారం లేదని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు.

కోర్టు తీర్పుపై BYD అసంతృప్తి

ఈ తీర్పుపై JLR స్పందిస్తూ.. తమ మేధో సంపత్తి హక్కులను(Intellectual Property Rights) కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు BYD మాత్రం కోర్టు నిర్ణయం పట్ల  విభేదించింది. Ti7 పూర్తిగా తమ సొంత డిజైన్‌తో రూపొందించిన SUV అని, JLR హక్కులను ఉల్లంఘించలేదని వెల్లడించింది. ఈ తీర్పును సవాలు చేసేందుకు అన్ని చట్టపరమైన చర్యలతో ముందుకు వెళ్తామని చెప్పింది.

JLRకు ఇది రెండో విజయం

Advertisement

డిఫెండర్ డిజైన్ వివాదంలో JLRకు ఇది రెండో విజయంగా చెప్పుకోవచ్చు. గతంలో 2019లో రేంజ్ రోవర్ ఎవోక్ డిజైన్‌ను కాపీ చేసిందని చైనాకు చెందిన జియాంగ్లింగ్ మోటార్ కార్పొరేషన్‌పై JLR కేసు గెలిచింది. ఇదిలా ఉంటే, BYD Ti7ను ఈ ఏడాది జూలైలో బ్రిటన్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర 47,995 పౌండ్లు (సుమారు రూ.60 లక్షలు). అదే సమయంలో డిఫెండర్ కంటే దాదాపు 20,000 పౌండ్లు తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇప్పుడు డిజైన్ వివాదం కారణంగా యూరప్‌లో Ti7 భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Read Also:  టాటా నెక్సాన్, పంచ్ EVలకు పోటీగా విస్ట్ ఫాస్ట్ VF5.. మూడింటిలో ఏ కారు బెస్ట్ అంటే?

Tags

Related News

రోజూ ఆఫీస్ వెళ్లేందుకు మంచి స్కూటీ కొనాలనుకుంటున్నారా? మంచి మైలేజీ ఇచ్చే బెస్ట్ మోడల్స్ ఇవే

టాటా నెక్సాన్, పంచ్ EVలకు పోటీగా విస్ట్ ఫాస్ట్ VF5.. మూడింటిలో ఏ కారు బెస్ట్ అంటే?

టాటా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలు.. నెక్సాన్, కునోతో భారీ ప్లాన్!

భారత్‌లో BYD కార్ల హవా.. ఏడాదిలోనే సేల్స్ డబుల్!

ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌ లిఫ్ట్ వచ్చేస్తోంది.. ఈసారి ఏకంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్‌తో..

రేంజ్ రోవర్ తలదన్నే లుక్.. హోండా అవన్సియర్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఫ్రాంక్స్.. బాలెనోను వెనక్కి నెట్టి మరీ సరికొత్త రికార్డు!

Big Stories

Advertisement
×