Best scooters for office workers| రోజూ ఆఫీస్‌కు వెళ్లాలన్నా, ఇంటి పనులపై బయట తిరగాలన్నా స్కూటర్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలతో పాటు వాహనాల ధరలు కూడా కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. అందుకే కొత్త స్కూటర్ కొనాలనుకునేవారు మంచి మైలేజీ, తక్కువ ధర, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రాఫిక్‌లో సులభంగా నడపగలగడం, వస్తువులు పెట్టుకునేందుకు తగిన స్థలం ఉండటం కూడా ముఖ్యమే.
మీరు కూడా రోజువారీ ప్రయాణాల కోసం బడ్జెట్లో మంచి స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే హోండా నుంచి యమహా వరకు మంచి మైలేజీ, ఉపయోగకరమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఈ 5 మోడల్స్ గురించి తెలుసుకోండి.
ప్రారంభ ధర: సుమారు రూ.77,000,
మైలేజీ: 59 kmpl వరకు
హోండా యాక్టివా భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడే స్కూటర్లలో ఒకటి. దీని సింపుల్ డిజైన్, సులభమైన హ్యాండ్లింగ్ రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడతాయి. 2026 మార్కెట్ వివరాల ప్రకారం.. దీని ప్రారంభ ధర సుమారు రూ.77,000. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 59 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని అరాయ్ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా- ARAI) అంచనా.
ధర: సుమారు రూ.83,000 – 86,000
మైలేజీ: 47 kmpl
సుజుకి యాక్సెస్ 125 మంచి పర్ఫామెన్స్తో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇందులో 124cc ఇంజిన్ ఉంటుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లడంతో పాటు అప్పుడప్పుడు దూర ప్రయాణాలు చేసేవారికి ఇది ఉపయోగపడుతుంది. దీని ధర వేరియంట్, నగరాన్ని బట్టి మారుతుంది.
ప్రారంభ ధర: రూ.75,625
మైలేజీ: 61.2 kmpl
టీవీఎస్ జూపిటర్ 110 రోజువారీ ప్రయాణాలకు మరో మంచి ఆప్షన్. ఇందులో 113.3cc ఇంజిన్ ఉంటుంది. ఇది 7.91 bhp పవర్, 9.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 33 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే 5.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అందించారు. అరాయ్ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా – ARAI) ప్రకారం ఇది 61.2 kmpl మైలేజీ ఇస్తుంది.
ప్రారంభ ధర: రూ.79,880
మైలేజీ: 71.33 kmpl
మైలేజీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు యమహా రే ZR 125 Fi హైబ్రిడ్ చెక్ చేయండి. ఇందులో 125cc ఇంజిన్‌తో పాటు మైల్డ్ హైబ్రిడ్ స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టమ్ ఉంటుంది. ఇది 8.2 PS పవర్, 10.3 Nm టార్క్ అందిస్తుంది. దీని మైలేజీ 71.33 kmpl.
ప్రారంభ ధర: రూ.82,465
మైలేజీ: 68.75 kmpl
హీరో డెస్టిని 125 కూడా డైలీ ప్రయాణాలకు ఉపయోగపడే స్కూటర్. ఇందులో 124.6cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9 bhp పవర్, 10.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 19 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ సదుపాయం ఉంది. ARAI ప్రకారం దీని మైలేజీ 68.75 kmpl.
Also Read: ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?
పెట్రోల్ స్కూటర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా పరిశీలించవచ్చు. వీటితో పెట్రోల్ ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే కొనుగోలు చేసే ముందు ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఛార్జింగ్ సదుపాయం ఉందో లేదో చూసుకోవాలి. దీంతో పాటు బ్యాటరీ క్వాలిటీ, ఖరీదు, వారంటీ విషయాలు చెక్ చేయడం తప్పనిసరి.
మీ బడ్జెట్, రోజువారీ ప్రయాణ దూరం, మైలేజీ అవసరాలను బట్టి స్కూటర్ ఎంచుకోవాలి. ARAI (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) మైలేజీకి, వాస్తవ రహదారులపై వచ్చే మైలేజీకి తేడా ఉండవచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ఆన్‌రోడ్ ధరలు తెలుసుకోండి. వీలైతే టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చిన మోడల్ ఎంచుకోండి.
Also Read: మారుతి బ్రెజ్జా vs నిస్సాన్ మాగ్నైట్.. కాంపాక్ట్ SUVలో ఏది బెటర్?