బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

3 నిమిషాల్లో 250 కి.మీ రేంజ్.. భారత్‌ లోకి అడుగు పెట్టబోతున్న చౌకైన EV కారు!

3 నిమిషాల్లో 250 కి.మీ రేంజ్.. భారత్‌ లోకి అడుగు పెట్టబోతున్న చౌకైన EV కారు!

Blinq Mobility: భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరో క్రేజీ ఈవీ ఎంట్రీ ఇవ్వబోతోంది. గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్టప్ బ్లింక్ మొబిలిటీ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది. ఈ కారు మార్కెట్లోకి వస్తే దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. అయితే, ఈ వెహికల్ ధర చౌకగా ఉండటంతో పాటు, కేవలం మూడు నిమిషాల లోపే 250 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే రేంజ్‌ ను పొందే అవకాశం ఉంటుంది.

ఛార్జింగ్ సమస్యకు అదిరిపోయే పరిష్కారం

సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఛార్జింగ్ సమయం. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి గంటల సమయం పడుతుంది. కానీ, బ్లింక్ తీసుకొస్తున్న ఈ కారులో ఆ సమస్యకు భిన్నమైన పరిష్కారాన్ని అందిస్తున్నారు. ఛార్జింగ్‌ కు బదులుగా బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.  ఈ విధానంలో ఖాళీ అయిన బ్యాటరీని తీసేసి, పూర్తిగా ఛార్జ్ చేసిన మరో బ్యాటరీని అమర్చుతారు. ప్రస్తుతం ఇలాంటి టెక్నాలజీ కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో కనిపిస్తున్నప్పటికీ, కార్లలో ఇది చాలా స్పెషల్ గా కనిపించే అవకాశం ఉంటుంది.

కార్ 001 పేరుతో టెస్టింగ్

బ్లింక్ ప్రస్తుతం కార్ 001 పేరుతో ఈ వెహికల్ ను పరీక్షిస్తోంది. కంపెనీ విడుదల చేసిన వీడియోలో బ్యాటరీ ఛేంజింగ్ కు సంబంధించిన ప్రక్రియను చూపించింది. బ్యాటరీ లెవెల్ తగ్గినప్పుడు కారు డ్రైవర్‌ కు సమీపంలోని స్వాపింగ్ స్టేషన్‌ కు వెళ్లాలని సూచిస్తుంది. అక్కడ ప్రత్యేకంగా రూపొందించిన సెంటర్ లో వెహికల్ ను ఓ ర్యాంప్‌ మీద పార్క్ చేస్తారు.

కారులో ఉన్న స్పెషల్  స్వాప్ మోడ్ ను యాక్టివేట్ చేసిన తర్వాత మొత్తం ప్రక్రియ ఆటోమేటిక్‌ గా ప్రారంభమవుతుంది. మొదట కారును స్టేబుల్ గా ఉంచేందుకు వీల్స్ ను లాక్ చేస్తారు. ఆ తర్వాత వెహికల్  కింద ఉన్న బ్యాటరీ ప్యాక్‌ ను జాగ్రత్తగా బయటకు తీస్తారు. దాని స్థానంలో పూర్తిగా ఛార్జ్ చేసిన కొత్త బ్యాటరీని అమర్చి, అన్ని కనెక్షన్లు సరి చూస్తారు. సేఫ్టీ చెకింగ్స్ పూర్తయ్యాక కారు మళ్లీ ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 2 నిమిషాల 48 సెకన్లలో పూర్తవుతుంది. కొత్త బ్యాటరీతో కారు సుమారు 252 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఈ టెక్నాలజీ విజయవంతమైతే ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. అలాగే రేంజ్ అయిపోతుందేమో అన్న ఆందోళన కూడా తగ్గుతుంది. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువ సంఖ్యలో స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఈ విధానం మరింత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఈ వ్యవస్థ పూర్తిగా విజయవంతం కావాలంటే దేశ వ్యాప్తంగా స్వాపింగ్ స్టేషన్ల నెట్‌ వర్క్‌ ను విస్తరించాల్సి ఉంటుంది. అది కొంత సమయం తీసుకునే ప్రక్రియ. ప్రస్తుతం ఈ కారు గురుగ్రామ్‌ లో రోడ్ టెస్టింగ్ లో ఉంది. త్వరలోనే మార్కెట్ లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

Read Also: ఈ కారు హెడ్‌ లైట్లు సినిమా చూపించేస్తాయ్.. వామ్మో.. ఇదేం టెక్నాలజీ భయ్యా!

Related News

ఈ కారు హెడ్‌ లైట్లు సినిమా చూపించేస్తాయ్.. వామ్మో.. ఇదేం టెక్నాలజీ భయ్యా!

హైవే సైన్ బోర్డులు గ్రీన్ కలర్‌లోనే ఉంటాయి.. ఎందుకో తెలుసా?

E85- E100 Fuels: E85, E100 ఫ్యూయల్.. వాహనదారులకు కచ్చితంగా ఈ విషయాలు తెలియాల్సిందే!

15 గంటల ప్రయాణం ఇక 3 గంటల్లో.. హైదరాబాద్-ముంబై బుల్లెట్ రైలు రూట్ ఫిక్స్!

బాలెనో To అమేజ్.. రూ.10 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే!

స్కోడా కార్లపై భారీ ఆఫర్లు.. స్లావియాపై ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపు!

కియా కేరెన్స్, క్లావిస్‌ కు బంపర్ రెస్పాన్స్.. 3 లక్షల సేల్స్ మార్క్ క్రాస్!

×