E-Paper
Advertisement

మారుతి విక్టోరిస్ కొనేవారికి షాక్.. కొత్త ధరలు వచ్చేశాయ్!

మారుతి విక్టోరిస్ కొనేవారికి షాక్.. కొత్త ధరలు వచ్చేశాయ్!
Advertisement

Maruti Victoris New Prices: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki)  విక్టోరిస్ (Victoris) ధరలను సవరించింది. ఈసారి కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను పెంచకుండా, కొన్ని వేరియంట్ల ధరలను పెంచి, మరికొన్నింటిని తగ్గించింది. ముఖ్యంగా బేస్ వేరియంట్ల ధరలు పెరగగా, వాటి తర్వాత వచ్చే VXi వేరియంట్ల ధరలు తగ్గాయి. ZXi సిరీస్ వేరియంట్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త ధరలు, వేరియంట్ల వారీగా జరిగిన ధరల మార్పులను ఇప్పుడు తెలుసుకుందాం..

LXi వేరియంట్లపై రూ.10,000 ధరల పెంపు

మారుతి విక్టోరిస్ ఎంట్రీ లెవల్ వేరియంట్లైన LXi పెట్రోల్, LXi CNG ధరలను కంపెనీ రూ.10,000 చొప్పున పెంచింది. దీంతో LXi పెట్రోల్ వేరియంట్  ధర రూ.10.60 లక్షలకు చేరింది. LXi CNG ధర రూ.11.65 లక్షలుగా ఉంది. మరోవైపు, VXi వేరియంట్ల కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. VXi పెట్రోల్, VXi CNG వేరియంట్ల ధరలను మారుతి రూ.5,000 చొప్పున తగ్గించింది. దీంతో VXi పెట్రోల్ ధర రూ.11.80 లక్షలు కాగా, VXi CNG ధర రూ.12.85 లక్షలుగా ఉంది.

ZXi వేరియంట్ల ధరల్లో నో ఛేంజెస్

Advertisement

విక్టోరిస్‌లోని ZXi, ZXi (O), ZXi ప్లస్ వేరియంట్ల ధరలను కంపెనీ అలాగే కొనసాగించింది. తాజా ధరల సవరణ తర్వాత ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.10.60 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.20.22 లక్షల వరకు ఉంది.

విక్టోరిస్‌కు కొత్త ఆరం ఎడిషన్

విక్టోరిస్ మార్కెట్లోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మారుతి సుజుకి స్పెషల్ ఆరం ఎడిషన్ (Aurum Edition)ను తీసుకొచ్చింది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల కోసం అందుబాటులో ఉండే యాక్సెసరీ ప్యాక్. దీని ధర రూ.22,990గా నిర్ణయించారు. ఈ ప్యాక్‌ లో స్కిడ్ ప్లేట్లు, వీల్ ఆర్చ్‌ ల మీద కాపర్ కలర్ ఇన్సర్ట్‌ లు, క్రోమ్ యాక్సెంట్స్ ఉంటాయి. వీటితో పాటు 3D క్యాబిన్ మ్యాట్లు, బూట్ మ్యాట్లు, బూట్ సిల్ గార్డ్ లాంటి అడిషనల్ యాక్సెసరీలను అందిస్తున్నారు. వీటి ద్వారా కారు మరింత ప్రీమియం లుక్ తో ఆకట్టుకుంటుంది.

మూడు పవర్‌ ట్రెయిన్ ఆప్షన్లతో విక్టోరిస్

Advertisement

మారుతి విక్టోరిస్ మూడు రకాల ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది 102bhp పవర్, 139Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. ఆటోమేటిక్ వెర్షన్‌లో AWD కూడా ఉంటుంది. ఇక CNG వెర్షన్‌లో ఇదే ఇంజన్ 87bhp పవర్, 122Nm టార్క్‌ను అందిస్తుంది. మూడోది 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్. ఇందులో పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. e-CVT గేర్‌బాక్స్‌ తో వచ్చే ఈ వెర్షన్ మొత్తం 116bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Read Also: ఎంజీ కామెట్ కొనేవారికి షాక్.. మరోసారి పెరిగిన ఎలక్ట్రిక్ కారు ధరలు!

Tags

Related News

ఎంజీ కామెట్ కొనేవారికి షాక్.. మరోసారి పెరిగిన ఎలక్ట్రిక్ కారు ధరలు!

తగ్గిన బరువు.. పెరిగిన రేంజ్.. అల్ట్రావయోలెట్ కొత్త బైక్ వచ్చేసింది!

హోండా తొలి ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. ఇంటీరియర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

భారత్‌లోకి మరో కొత్త కార్ల బ్రాండ్.. JSW మోటార్స్ లోగో విడుదల!

బాబోయ్.. కోటి స్కూటర్లు సేల్.. టీవీఎస్ జూపిటర్ అరుదైన రికార్డు!

310 కి.మీ రేంజ్‌తో కొత్త ఇగ్నిస్ EV.. సుజుకి నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు!

టయోటా ఇన్నోవా హైక్రాస్ కొత్త లుక్‌లో వచ్చేసింది.. ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×