E-Paper
Advertisement

తగ్గిన బరువు.. పెరిగిన రేంజ్.. అల్ట్రావయోలెట్ కొత్త బైక్ వచ్చేసింది!

తగ్గిన బరువు.. పెరిగిన రేంజ్.. అల్ట్రావయోలెట్ కొత్త బైక్ వచ్చేసింది!
Advertisement

Ultraviolette X-47 Venom: ఎలక్ట్రిక్ బైక్‌ల మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్ట్రావయోలెట్ (Ultraviolette) మరో కొత్త మోడల్‌ తో కస్టమర్ల ముందుకొచ్చింది. కంపెనీ ఇటీవల పరిచయం చేసిన X-47 వెనమ్ (X-47 Venom) ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలను దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. కొత్త హై వోల్టేజ్ ప్లాట్‌ఫామ్‌ మీద రూపొందిన ఈ బైక్‌లో గత మోడల్‌తో పోలిస్తే కీలక మార్పులు, అడిషనల్ ఫీచర్లు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 55 షోరూమ్‌లలో డెలివరీలు

అల్ట్రావయోలెట్ గత నెల చివర్లో తన కొత్త VX-100 ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌ మీద వచ్చిన మొదటి బైక్ X-47 వెనమ్. బైక్ ఆవిష్కరణ జరిగిన వెంటనే కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అల్ట్రావయోలెట్‌కు చెందిన 55 షోరూమ్‌లలో డెలివరీలు మొదలయ్యాయి. అయితే, నాలుగు వేరియంట్లను కంపెనీ ఒకేసారి కాకుండా దశలవారీగా అందిస్తోంది. సో, ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లందరికీ ఒకే టైమ్ లో డెలివరీలు పొందే అవకాశం లేదు. స్టార్టింగ్ లో బుక్ చేసుకున్న వారికి త్వరలో బైక్‌లు అందనున్నాయి.

తగ్గిన బరువు.. పెరిగిన రేంజ్..   

Advertisement

కొత్త X-47 వెనమ్‌ లో కీలక మార్పు 100V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్. ఈ కొత్త టెక్నాలజీ కారణంగా బైక్ బరువు గత మోడల్‌తో పోలిస్తే 17 కేజీల వరకు తగ్గింది. అంతేకాకుండా, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే అదనంగా 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను అందిస్తోంది. ఫీచర్ల విషయానికి, వస్తే ఇందులో 7 ఇంచుల TFT డిస్‌ప్లేను అందించారు. దీనితో పాటు క్రూయిజ్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. తక్కువ బరువు, ఎక్కువ రేంజ్, కొత్త టెక్నాలజీతో ఈ బైక్‌ను మరింత ఆకట్టుకునేలా తయారు చేశారు.

ధరలు ఎలా ఉన్నాయంటే?   

అల్ట్రావయోలెట్ X-47 వెనమ్ ప్రారంభ ధర రూ.2.65 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ రీకాన్+ (Recon+) వేరియంట్ ధర సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుంది. అయితే, ఈ ధరలు మొదటి 5,000 మంది కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తాయి. ఆ తర్వాత అన్ని వేరియంట్ల ధరలు గరిష్ఠంగా రూ.35,000 వరకు పెరిగే అవకాశం ఉంది. పాత X-47 క్రాస్‌ ఓవర్ ప్లేస్ లో వచ్చిన వెనమ్ మోడల్ ఎక్కువ రేంజ్, తక్కువ బరువు, కొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారికి మరో క్రేజీ ఆప్షన్ గా మారనుంది.

Advertisement

Read Also: బాబోయ్.. కోటి స్కూటర్లు సేల్.. టీవీఎస్ జూపిటర్ అరుదైన రికార్డు!

Tags

Related News

హోండా తొలి ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. ఇంటీరియర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

భారత్‌లోకి మరో కొత్త కార్ల బ్రాండ్.. JSW మోటార్స్ లోగో విడుదల!

బాబోయ్.. కోటి స్కూటర్లు సేల్.. టీవీఎస్ జూపిటర్ అరుదైన రికార్డు!

310 కి.మీ రేంజ్‌తో కొత్త ఇగ్నిస్ EV.. సుజుకి నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు!

టయోటా ఇన్నోవా హైక్రాస్ కొత్త లుక్‌లో వచ్చేసింది.. ధర ఎంతంటే?

సుజుకి యాక్సెస్ 125లో బిగ్ ఛేంజెస్.. ఇక ఆ వేరియంట్ కనిపించదు!

టాటా కార్ల ధరలకు మళ్లీ రెక్కలు.. డిసెంబర్ 1 నుంచి కొత్త రేట్లు!

Big Stories

Advertisement
×