E-Paper
Advertisement

టయోటా ఇన్నోవా హైక్రాస్ కొత్త లుక్‌లో వచ్చేసింది.. ధర ఎంతంటే?

టయోటా ఇన్నోవా హైక్రాస్ కొత్త లుక్‌లో వచ్చేసింది.. ధర ఎంతంటే?
Advertisement

New Innova Hycross Launched: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా (Toyota) తన పాపులర్ MPV ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross)కు కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌ లిఫ్ట్‌ పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. రూ.19.59 లక్షల ప్రారంభ ధరతో పరిచయం చేసింది. 2022 డిసెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ మోడల్‌కు ఫస్ట్ మిడ్‌లైఫ్ అప్‌డేట్ ఇదే కావడం విశేషం. కొత్త లుక్‌తో పాటు మరిన్ని ఫీచర్లు, ఫ్యూయల్ ఎఫిషియెన్సీలోనూ కీలక మార్పులతో ఈ మోడల్ ను తీసుకొచ్చింది.

కొత్త అప్‌ డేట్‌ లో ఆకట్టుకునే విషయం E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ. పెట్రోల్‌తో పాటు 85 శాతం ఇథనాల్ కలిగిన ఇంధన మిశ్రమంతో కూడా పనిచేసేలా హైబ్రిడ్ వెర్షన్‌ను అప్‌డేట్ చేశారు. దీంతో ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏకైక స్ట్రాంగ్ హైబ్రిడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనంగా ఇన్నోవా హైక్రాస్ గుర్తింపు పొందింది.

కొత్త డిజైన్‌తో ఇన్నోవా హైక్రాస్

Advertisement

కొత్త ఇన్నోవా హైక్రాస్ ఫ్రంట్ లో అదిరిపోయే డిజైన్ ఛేంజెస్ కనిపిస్తున్నాయి. ఇందులో కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్, ఆకట్టుకునే DRLలు అందించారు. అంతేకాదు, డైమండ్ షేప్ ఎయిర్ ఇన్‌ లెట్లతో కూడిన కొత్త ఫ్రంట్ గ్రిల్ వెహికల్ కు మరింత అగ్రెసివ్ లుక్ ను అందిస్తున్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ప్లేస్ ను కూడా మార్చారు. సన్నని లోయర్ ఎయిర్ ఇన్‌ టేక్, సిల్వర్ ఫినిషింగ్‌ తో కూడిన ట్రిమ్ ముందు భాగానికి కొత్త లుక్‌ను తీసుకొచ్చాయి. అయితే, సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. పాత మోడల్‌లో ఉన్న పెద్ద డోర్లు, పెద్ద గ్లాస్ ఏరియా, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ కొనసాగుతున్నాయి. వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్స్‌ లో ఛేంజెస్ చేశారు.

పెద్ద టచ్‌ స్క్రీన్.. అదిరిపోయే ఫీచర్లు..

క్యాబిన్‌లో కూడా టయోటా కొన్ని కీలకమైన అప్‌ గ్రేడ్స్ చేసింది. ముఖ్యంగా టాప్ వేరియంట్లలో గతంలో ఉన్న 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ స్థానంలో పెద్ద 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఇందులో వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉన్నాయి. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లలో 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే అందుబాటులో ఉంటుంది. పెట్రోల్ మోడళ్లలో మాత్రం 7 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. పవర్డ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌ మెంట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ ఒట్టోమాన్‌తో కూడిన రెండో వరుస సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి.

పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లు

Advertisement

కొత్త ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్ సెగ్మెంట్ లో G, GX వేరియంట్లు ఉండగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ విభాగంలో GX, VX, ZX వేరియంట్లు ఉన్నాయి.

Read Also: భారత్‌లోకి విన్‌ఫాస్ట్ VF5 ఎలక్ట్రిక్ SUV.. ఒకే ఛార్జ్ తో 370 కి.మీ రేంజ్!

Tags

Related News

సుజుకి యాక్సెస్ 125లో బిగ్ ఛేంజెస్.. ఇక ఆ వేరియంట్ కనిపించదు!

టాటా కార్ల ధరలకు మళ్లీ రెక్కలు.. డిసెంబర్ 1 నుంచి కొత్త రేట్లు!

భారత్‌లోకి విన్‌ఫాస్ట్ VF5 ఎలక్ట్రిక్ SUV.. ఒకే ఛార్జ్ తో 370 కి.మీ రేంజ్!

హ్యుందాయ్ కస్టమర్లకు షాక్.. మరోసారి పెరగనున్న కార్ల ధరలు!

హోండా To టాటా.. డిసెంబర్‌లో విడుదల కానున్న 4 అదిరిపోయే మోడళ్లు!

రూ.2.75 లక్షలకే హోండా 500సీసీ బైక్.. మూడు వేరియంట్లలో విడుదల!

Bajaj Pulsar 125 Neon: మళ్లీ వస్తున్న పాత పల్సర్.. కొత్త బైక్‌లో ఏమున్నాయంటే?

Big Stories

Advertisement
×