Kamran akmal Warns Tanveer Ahmed: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026) భాగంగా యూఏఈపై వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైభవ్ వయస్సు 15 కాదని ఇరవై ఎప్పుడో దాటేశాడని తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అయితే అతను చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ కౌంటర్ ఇచ్చారు. వైభవ్ వయస్సు గురించి ఇంకోసారి మాట్లాడితే పళ్లు రాలతాయి అని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. వైభవ్ వయస్సు గురించి మనకెందుకు.. ఏమైనా విమర్శలు చేయాలనుకుంటే అతని బ్యాటింగ్ ప్రదర్శనపై చేయాలని చురకలు అందించాడు.
క్రికెట్ లో వయసుతో సంబంధం లేదని… నైపుణ్యం ముఖ్యమని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు. టాలెంట్ ఉన్నవాళ్లు మాత్రమే క్రికెట్ ఆడతారని స్పష్టం చేశాడు. 40 సంవత్సరాలు దాటే వరకు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో కుమ్మేసాడు కదా ? అంటూ ప్రశ్నించాడు. అనవసరంగా వైభవ్ సూర్యవంశీ వయస్సుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అతని వయస్సు నిజంగానే 15 సంవత్సరాలు ఉంటుందని.. ప్రదర్శన మాత్రం 25 సంవత్సరాలు దాటిన వాడిలాగా ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు. దీనిపై ఐసీసీ రంగంలోకి దిగి విచారణ చేయాల్సిన అవసరమే లేదని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ కుండబద్దలు కొట్టి చెప్పాడు.
వైభవ సూర్యవంశీ డబుల్ సెంచరీ చేసిన నేపథ్యంలో కొంత మంది స్ప్రింగులు ఉన్నాయని కూడా ప్రచారం చేస్తున్నారని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఫైర్ అయ్యాడు. క్రికెట్ లో స్ప్రింగులు పెట్టి బ్యాటింగ్ చేసే దమ్ము ఎవరికీ లేదని స్పష్టం చేశాడు. అలా చేస్తే.. కెరీర్ దెబ్బతింటుందని.. అలాంటి సాహసం ఎవరు చేయరని స్పష్టం చేశాడు. వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కాబట్టి అతనికి హ్యాండ్ పవర్ ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. రైట్ హ్యాండ్ కంటే లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్ కొడితే బంతులు స్టేడియంలో పడతాయని వెల్లడించారు. అంతేకానీ అతని బ్యాట్ లో స్ప్రింగులు, ఏఐ చిప్పులు ఏమీ లేవని కుండబద్దలు కొట్టి చెప్పాడు. కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ఇలా వైభవ్ పై కుట్రలు చేస్తున్నారని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ నిప్పులు చెరిగాడు.