E-Paper
Advertisement

హోండా తొలి ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. ఇంటీరియర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

హోండా తొలి ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. ఇంటీరియర్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Advertisement

New Honda Alpha EV: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) ఇండియన్ మార్కెట్లోకి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUVని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. హోండా ఆల్ఫా (Honda Alpha) పేరుతో రానున్న ఈ మిడ్‌ సైజ్ ఎలక్ట్రిక్ SUVని డిసెంబర్ 2న విడుదల చేయనుంది. తాజాగా కంపెనీ ఈ కారు ఇంటీరియర్ డిజైన్ స్కెచ్‌ ను వెల్లడించింది. ఇప్పటి వరకు బయటకు రాని క్యాబిన్ డిజైన్ వివరాలు ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌ తో రానున్న ఈ SUV ధర కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

రెండు స్క్రీన్లు.. కొత్త స్టీరింగ్ వీల్..

హోండా విడుదల చేసిన ఇంటీరియర్ స్కెచ్ ను పరిశీలిస్తే, ఆల్ఫా క్యాబిన్‌లో బ్లాక్, ఆఫ్ వైట్ కలర్ థీమ్‌ కనిపిస్తోంది. డ్యాష్‌బోర్డ్‌ పై యాంబియంట్ లైటింగ్, కొత్త డిజైన్‌ తో కూడిన మూడు స్పోక్స్ స్టీరింగ్ వీల్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో పాటు పూర్తిగా డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఫిజికల్ బటన్లు, టోగుల్ స్విచ్‌లతో కూడిన ఏసీ కంట్రోల్స్‌ ను కూడా ఏర్పాటు అందించారు. సెంటర్ కన్సోల్‌లో USB ఛార్జింగ్ పోర్టులు, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయం ఉండే అవకాశం ఉంది. వెనుక ప్రయాణికుల కోసం రెండు కప్‌ హోల్డర్లతో కూడిన సెంటర్ ఆర్మ్‌ రెస్ట్‌ ను కూడా అందించనున్నారు.

అదిరిపోయే ఎక్స్‌ టీరియర్ డిజైన్

Advertisement

ఆల్ఫా బయటి డిజైన్‌ ను కూడా హోండా స్కెచ్ రూపంలో చూపించింది. ఇందులో కనెక్ట్ అయినట్లుగా కనిపించే LED DRLలు, సన్నని LED హెడ్‌ ల్యాంప్స్, షైనింగ్ హోండా లోగోతో కూడిన స్పెషల్ ఫ్రంట్ డిజైన్ ఉన్నాయి. ముందు భాగం వాలుగా ఉండగా, వెనుక భాగంలో దాదాపు నిలువుగా ఉండే విండ్‌ స్క్రీన్ కనిపిస్తుంది. ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చ్‌ల చుట్టూ బ్లాక్ క్లాడింగ్ SUVకి ష్పెషల్ లుక్ ఇస్తాయి.

75kWh బ్యాటరీ.. 500 కి.మీ రేంజ్..

హోండా ఆల్ఫా పవర్‌ ట్రెయిన్ వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఇందులో 65kWh నుంచి 75kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉండవచ్చని తెలుస్తోంది. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయితే, అధికారిక రేంజ్ వివరాలు విడుదల సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ధర ఎంత ఉంటుందంటే? 

Advertisement

హోండా ఆల్ఫా ధర భారత మార్కెట్లో రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. రాజస్థాన్‌లోని తపుకారా ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్ SUVని తయారు చేయనున్నారు. ఈ కారు మహీంద్రా BE 6, టాటా సియెర్రా EV, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి ఇ విటారా లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: భారత్‌లోకి మరో కొత్త కార్ల బ్రాండ్.. JSW మోటార్స్ లోగో విడుదల!

Tags

Related News

హ్యుందాయ్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఐయోనిక్ P లాంచింగ్ ఎప్పుడంటే?

లీటర్ పెట్రోల్‌ తో 71 కి.మీ ప్రయాణం.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 స్కూటర్లు ఇవే!

తక్కువ బరువు, మంచి రేంజ్‌.. అమ్మాయిల కోసం 6 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

మారుతి విక్టోరిస్ కొనేవారికి షాక్.. కొత్త ధరలు వచ్చేశాయ్!

ఎంజీ కామెట్ కొనేవారికి షాక్.. మరోసారి పెరిగిన ఎలక్ట్రిక్ కారు ధరలు!

తగ్గిన బరువు.. పెరిగిన రేంజ్.. అల్ట్రావయోలెట్ కొత్త బైక్ వచ్చేసింది!

భారత్‌లోకి మరో కొత్త కార్ల బ్రాండ్.. JSW మోటార్స్ లోగో విడుదల!

Big Stories

Advertisement
×