Zimbabwe vs India, 3rd T20I: టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య ప్రస్తుతం T20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల కిందట ప్రారంభమైన ఈ టి 20 సిరీస్ లో మొత్తం మూడు మ్యాచ్లు జరిగాయి. ఇందులో మూడింటిలో గెలిచిన టీమిండియా.. జింబాబ్వే జట్టును వైట్ వాష్ చేసింది. ఇవాళ హారారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మ్యాచ్ లోను టీమిండియా విక్టరీ సాధించి… 3-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ సేనకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్ల చేతిలో టీమిండియా రెండు టీ20 సిరీస్ లను కోల్పోయింది. దీంతో శ్రేయస్ అయ్యర్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగగా.. జింబాబ్వే సిరీస్ విజయంతో ఆ ట్రోలింగ్ కు కాస్త బ్రేక్ పడనుంది.
Also Read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్
టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మూడవ టి20 జరిగింది. ఇందులో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 20 ఓవర్లు ఆడిన టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో మరోసారి విఫలమైన జింబాబ్వే.. మూడవ టి20 లోనూ ఓడిపోయింది. టీమిండియా విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని.. చేదించే క్రమంలో 7 వికెట్లు నష్టపోయిన జింబాబ్వే, 157 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 35 పరుగుల తేడాతో ఇండియా చేతిలో ఓడిపోయింది.
ఇక ఈ మ్యాచ్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ అదరగొట్టిన సంగతి తెలిసిందే. 49 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్య వంశీ… నాలుగు సిక్సర్లతో పాటు 8 బౌండరీలు సాధించాడు. 165 స్ట్రైక్ రేట్ సాధించి… జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ తరుణంలో జింబాబ్వే తో జరిగిన టి20 సిరీస్ నేపథ్యంలో… వైభవ్ రెండు అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. అతి చిన్న వయసులో ఒకే సిరీస్ లో రెండు అర్థ సెంచరీలు చేసిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.
టీమిండియా తో జరిగిన మూడు టి20 సిరీస్ కంటే ముందు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియాను హేళన చేస్తూ మాట్లాడారు. వాళ్ల చేతిలో వైట్ వాష్ అయింది.. తమ చేతిలో కూడా టీమిండియా చిత్తుగా ఓడుతుందని హెచ్చరించారు. తమ జట్టుపై ఈజీగా గెలవాలని టీమిండియా భావిస్తుందని.. కానీ మేమే విజృంభించి సిరీస్ కైవసం చేసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో జింబాబ్వే కచ్చితంగా గెలుస్తుందని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ అభిమానులు భయపడిపోయారు. ఈ నేపథ్యంలో సిరీస్ ముగిసే సమయానికి జింబాబ్వే వైట్ వాష్ అయింది. ఇంకేముంది సికందర్ రాజాను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అంతన్నావ్ ఇంతన్నావు కదా? ఇప్పుడు ఏమైందని దారుణంగా ఆడుకుంటున్నారు.
Also Read: 6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్, టీమిండియా విజయం