E-Paper
Advertisement

రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనేశాడు.. నువ్వు మామూలోడివి కాదు భయ్యా!

రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనేశాడు.. నువ్వు మామూలోడివి కాదు భయ్యా!
Advertisement

Man Buys New Bike Uses Rs 10 Coins: సాధారణంగా లక్ష రూపాయలకుపైగా విలువైన బైక్ కొనాలంటే క్యాష్, చెక్ లేదంటే డిజిటల్ పేమెంట్ చేస్తారు. కానీ, ఓ వ్యక్తి అందరికీ భిన్నంగా ఆలోచించాడు. మొత్తం రూ.1.10 లక్షల విలువైన మోటార్‌ సైకిల్‌ ను కేవలం రూ.10 నాణేలతో కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.  ఈ ఆసక్తికర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కొండే రఘుపతి చాలా రోజులుగా ఒక కొత్త బైక్ కొనాలని అనుకుంటున్నాడు. చివరకు చిట్యాలలోని శ్రీ వినాయక మోటార్స్‌ కు వెళ్లి హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ కొనుగోలు చేయాలనుకున్నాడు. అయితే, బైక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అతడు చేసిన పని షోరూమ్ సిబ్బందినే ఆశ్చర్యపరిచింది.

11 వేల 10 రూపాయాల నాణేలతో కొనుగోలు

మొత్తం రూ.1.10 లక్షల బిల్లును క్యాష్, డిజిటల్ పేమెంట్ ద్వారా కాకుండా, పూర్తిగా రూ.10 నాణేల రూపంలో చెల్లించాడు. అంటే, దాదాపు 11 వేల పది రూపాయల నాణేలను తీసుకొచ్చి షోరూమ్‌ సిబ్బందికి అందజేశాడు. ఇన్ని నాణేలను ఒకేసారి చూసిన సిబ్బంది కూడా కొంతసేపు ఆశ్చర్యపోయారు. నాణేలను లెక్కించడానికి సిబ్బంది చాలాసేపు కష్టపడాల్సి వచ్చింది. అయినప్పటికీ, అవన్నీ చెల్లుబాటు అయ్యే కాయిన్స్ కావడంతో షోరూమ్ యాజమాన్యం ఆ డబ్బులను తీసుకున్నాడు. ఆ తర్వాత డాక్యుమెంటేషన్ పూర్తి చేసి రఘుపతికి కొత్త బైక్‌ ను అందజేశారు.

అన్ని కాయిన్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు?

Advertisement

రఘుపతి ఇంత పెద్ద మొత్తాన్ని నాణేల రూపంలో ఎలా సేకరించాడనే విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొందరు చాలా కాలంగా పొదుపు చేసిన నాణేలేనని చెబుతుండగా, మరికొందరు వ్యాపార లావాదేవీల్లో వచ్చిన నాణేలను దాచుకున్నాడని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష రూపాయలకు పైగా విలువైన బైక్‌ను నాణేలతో కొనుగోలు చేయడం చాలా అరుదైన విషయం కావడంతో నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రఘుపతి ఓర్పును ప్రశంసిస్తుండగా, మరికొందరు ఇన్ని నాణేలను లెక్కించడం షోరూమ్ సిబ్బందికి పెద్ద పరీక్షే అయి ఉంటుందని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

సాధారణంగా పెద్ద మొత్తాల చెల్లింపులు డిజిటల్ రూపంలో జరుగుతున్న ఈ రోజుల్లో, రూ.10 నాణేలతో లక్ష రూపాయలకుపైగా విలువైన బైక్ కొనుగోలు చేయడం నిజంగా ఆసక్తికరమైన ఘటనగా నిలిచింది. ఈ సంఘటన ప్రస్తుతం తెలంగాణలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వైరల్ అవుతోంది.

Read Also: చిన్న డివైజ్.. క్షణాల్లో నార్మల్ సైకిల్ ను ఎలక్ట్రిక్ సైకిల్ గా మార్చుకోవచ్చు!

Related News

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

మారుతి స్విఫ్ట్‌ లో కొత్త టర్బో ఇంజిన్.. కళ్లు చెదిరే పవర్‌ తో మార్కెట్ లోకి ఎంట్రీ!

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

Big Stories

Advertisement
×