E-Paper
Advertisement

స్మార్ట్ గ్లాసెస్ దుర్వినియోగానికి చెక్.. సీక్రెట్ రికార్డింగ్స్ అడ్డుకునేందుకు.. మెటా సరికొత్త టెక్నాలజీ!

స్మార్ట్ గ్లాసెస్ దుర్వినియోగానికి చెక్.. సీక్రెట్ రికార్డింగ్స్ అడ్డుకునేందుకు.. మెటా సరికొత్త టెక్నాలజీ!
Advertisement

Meta Smart Glasses: ప్రస్తుత డిజిటల్ యుగంలో కెమెరాలతో కూడిన స్మార్ట్ గ్లాసెస్ అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇవి వ్యక్తిగత గోప్యతకు (Privacy) పెద్ద ముప్పుగా మారుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ టెక్ దిగ్గజం ‘మెటా’ (Meta) రూపొందించిన రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్.. ఈ మధ్యకాలంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతకు రక్షణగా మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ గ్లాసెస్ లో అత్యంత కీలకమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను తీసుకువచ్చింది.

ఇంతకీ ఆప్డేట్ ఏంటంటే?

మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా ఎవరైనా ఫోటో తీసినా, వీడియో రికార్డ్ చేసినా ఎదుటివారికి తెలియజేయడానికి ఆ గ్లాసెస్ పై ఒక చిన్న ‘ప్రైవసీ ఎల్‌ఈడీ లైట్’ (Privacy LED Light)ను ఫిక్స్ చేశారు. చుట్టుపక్కల ఉన్నవారికి తాము రికార్డ్ అవుతున్నామనే విషయాన్ని ఈ లైట్ హెచ్చరిస్తుంది. అయితే ఈ ఎల్ఈడీ లైట్ ను ఏమారుస్తున్నట్లు మెటా దృష్టికి వెళ్లింది. దీంతో తాజాగా ఒక అత్యాధునిక అప్డేట్ ను మెటా ప్రవేశపెట్టింది. ఒకవేళ ఈ లైట్‌ను టేపులు లేదా ఇతర వస్తువులతో కప్పి ఉంచితే కెమెరా పని చేయకుండా బ్లాక్ చేసేలా సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆ లైట్ కు ఎలాంటి అడ్డంకి లేకపోతేనే కెమెరా పనిచేసేలా కొత్త సాఫ్ట్ వేర్ అప్డేట్ తీసుకొచ్చింది.

లైట్‌ ధ్వంసం చేస్తున్న కేటుగాళ్లు

Advertisement

స్మార్ట్ గ్లాసెస్ లో ఎల్ఈడీ లైట్ ఫీచర్ తెచ్చినప్పటి నుంచి కొందరు యూజర్లు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇతరులకు తెలియకుండా రహస్యంగా రికార్డ్ చేయడానికి సరికొత్త దారులను వెతుకుతున్నారు. కేవలం టేప్ వేయడమే కాకుండా ఏకంగా ఆ ప్రైవసీ లైట్‌ను ధ్వంసం చేయడం లేదా పూర్తిగా మార్చేయడం వంటి పద్ధతులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఈ గ్లాసెస్‌లోని లైట్‌ను తొలగించి, రికార్డింగ్ సిగ్నల్ బయటకు కనిపించకుండా మోడిఫై చేసే ముఠాలు, అక్రమ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల స్మార్ట్ గ్లాసెస్ దుర్వినియోగం తీవ్రస్థాయికి చేరింది.

లైట్ పోతే కెమెరా బంద్!

ఈ పెరుగుతున్న ముప్పును అరికట్టడానికే మెటా ఈ సరికొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇకపై గ్లాసెస్ లోని ప్రైవసీ లైట్‌ను ఎవరైనా భౌతికంగా ధ్వంసం చేసినా లేదా మార్చడానికి ప్రయత్నించినా (Tampered or Destroyed).. ఆ గ్లాసెస్ లోని కెమెరా సిస్టమ్ పూర్తిగా నిలిచిపోనుంది. ‘ఒకవేళ ఎల్‌ఈడీ లైట్ దెబ్బతిన్నట్లు గ్లాసెస్ గుర్తిస్తే కెమెరా వెంటనే పని చేయడం ఆపేస్తుంది. ప్రపంచంలో ఏ ఇతర కెమెరా కంపెనీ కూడా ఇంతవరకు ఇలాంటి భద్రతా చర్య తీసుకోలేదు. గోప్యతకు పెద్ద పీట వేస్తున్నందుకు గర్వపడుతున్నాం’ అని మెటా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Advertisement

Also Read: ఏసీ వాడుతున్నారా? ఈ ‘3 మినిట్ రూల్’ తెలుసా? లేదంటే కష్టమే!

అక్రమ సర్వీసులపైనా చర్యలు

కేవలం టెక్నాలజీ పరంగానే కాకుండా, వ్యాపార పరంగా కూడా మెటా గట్టి చర్యలకు దిగింది. సోషల్ మీడియాలో, మార్కెట్ ప్లేస్‌లలో స్మార్ట్ గ్లాసెస్‌ను మోడిఫై (మార్పులు) చేస్తామంటూ వచ్చే ప్రకటనలు, పోస్టులను తక్షణమే తొలగిస్తున్నట్లు మెటా తెలిపింది. అంతేకాకుండా ఇలాంటి అక్రమ సర్వీసులను నడుపుతున్న వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు (Legal action) తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలిపింది.

Also Read: మోటో నుంచి కొత్త ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీ.. ఒక్క ఛార్జ్‌తో 3 రోజులు పక్కా!

Related News

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×