E-Paper
Advertisement

సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?

సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?
Advertisement

Colors Swathi: కలర్స్ షో ద్వారా యాంకర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి.. ఈ షోతో కలర్స్ స్వాతిగా పేరు దక్కించుకున్న స్వాతి రెడ్డి..’అష్టాచమ్మా’ సినిమాతో హీరోయిన్ గా అవతరించింది. తనదైన చమత్కారం, స్పష్టమైన మాటలతో అందరినీ ఆకట్టుకునే ఈ తెలుగమ్మాయి.. గతంలో వివాహం, రిలేషన్షిప్ గురించి బోల్డ్ కామెంట్లు చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకొని విమర్శలకు చోటు ఇచ్చింది. అయితే ఆ పెళ్లి మూనాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. మళ్ళీ ఇప్పుడు మరో పెళ్లి చేసుకొని సడన్ ట్విస్ట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ . చడీచప్పుడు లేకుండా తన భర్తతో హోమం చేస్తున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సడన్గా మళ్లీ పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి..

మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన కలర్స్ స్వాతి..’ మంత్ ఆఫ్ మధు’ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ డైరెక్టర్ తోనే ఆమె ఏడు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. స్వాతి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తన పెళ్లి ఫోటోలను పంచుకుంటూ “Hitched “అంటూ మంత్ ఆఫ్ మధు డైరెక్టర్ శ్రీకాంత్ నాగోటిని ట్యాగ్ చేసింది. అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఒక్కసారిగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సాదాసీదాగా ఈ వివాహం జరిగినట్లు ఫోటోలు చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి అయితే సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

వికాస్ వాసుతో విడాకులు..

Advertisement

స్వాతి విషయానికి వస్తే.. గతంలో 2018లో కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈమె.. కొంతకాలం విదేశాల్లో కుటుంబ జీవితానికే ప్రాముఖ్యత ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ నటిగా రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ఈమె.. మంత్ ఆఫ్ మధు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సమయంలోనే తన తన భర్త నుంచి విభేదాలు వచ్చాయని, విడిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దీనిపై స్వాతి స్పందించలేదు. ఇకపోతే ఇప్పటివరకు తన మొదటి వివాహం, విడాకులపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ సడన్ గా రెండో పెళ్లి చేసుకోవడం అందరికీ షాకింగ్ గా మారింది.

పెళ్లి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడం మేలు..

ఇదిలా ఉండగా తన తొలి వివాహానికంటే ముందే పెళ్లి విషయంలో బోల్డ్ కామెంట్లు చేసి స్వాతి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తన కెరియర్ తొలినాళ్లలో “పెళ్లి కంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. ఈరోజుల్లో ఒక మనిషిని నమ్మి, పెళ్లి చేసుకుని, జీవితాంతం కలిసి ఉండడం చాలా కష్టం. ఎవరికీ ఓపిక లేదు. అందుకే ఎవరినో పెళ్లి చేసుకుని, ప్రతిరోజు మానసిక ప్రశాంతతను కోల్పోవడం కంటే హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం బెటర్. అది ఎప్పుడు ఎలాంటి కండిషన్లు లేకుండా నమ్మకంగా మనల్ని ప్రేమిస్తుంది” అంటూ తెలిపింది. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత వికాస్ వాసుని ప్రేమించి, పెళ్లి చేసుకొని విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

also read: అమీర్ ఖాన్ మూడో పెళ్లిలో గౌరీ మెడలో మెరిసిన నిజామీ పఠానీ హార్.. ఖరీదు ఎంతంటే?

 

Related News

మల్లె పూల పల్లకి వెనుక ఇంత కథ ఉందా?

‘ఇరుముడి’ థియేటర్లపై ఎగ్జిబిటర్ల ఆవేదన.. న్యాయమేనా?

చిరంజీవి డేట్ పై త్రివిక్రమ్ కన్ను!

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ నక్షత్ర.. హీరోయిన్ గా తొలి ఛాన్స్?

నాని ‘ ప్యారడైజ్ ‘ కు ఆ టైం ఉండదా? ఇదేం ట్విస్ట్ మావా..

‘వారణాసి’ మూవీకి అలాంటి లేవట.. అసలు జక్కన్న ప్లానేంటబ్బా..?

బేబీ నక్షత్ర జీవితంలో ఇంత విషాదమా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

రవితేజ ‘ఇరుముడి’ వివాదం.. ఆ ఒక్కటే డైరెక్టర్ మిస్టేకా..?

Big Stories

Advertisement
×