E-Paper
Advertisement

హోండా To టాటా.. డిసెంబర్‌లో విడుదల కానున్న 4 అదిరిపోయే మోడళ్లు!

హోండా To టాటా.. డిసెంబర్‌లో విడుదల కానున్న 4 అదిరిపోయే మోడళ్లు!
Advertisement

December 2026 Car Launches: ఇండియన్ కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కార్ల తయారీ సంస్థలు కూడా కొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2026లో భారత మార్కెట్లోకి పలు కొత్త ఎలక్ట్రిక్ కార్లు పరిచయం కానున్నాయి. హోండా, జేఎస్‌డబ్ల్యూ, హ్యుందాయ్, టాటా లాంటి సంస్థలు తమ కొత్త మోడళ్లతో కొనుగోలుదారులను ఆకట్టుకోబోతున్నాయి. ఇంతకీ ఆ కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

హోండా నుంచి కొత్త ఎలక్ట్రిక్ SUV

హోండా డిసెంబర్ 2న కొత్త ఎలక్ట్రిక్ SUVని పరిచయం చేయనుంది. ఆల్ఫా 0 కాన్సెప్ట్ ఆధారంగా ఈ మిడ్‌ సైజ్ SUVని రూపొందిస్తున్నారు. ఇందులో 65–75 kWh కెపాసిటీ కలిగిన LFP బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉండవచ్చని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.20 లక్షలుగా ఉండనుంది. అయితే, ఈ కారు 2027 ప్రారంభంలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ ఫస్ట్ SUV

Advertisement

భారత కారు మార్కెట్ లోకి అడుగుపెడుతున్న జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ డిసెంబర్ 3 లేదంటే 4 తేదీల్లో తన బ్రాండ్‌ను పరిచయం చేయనుంది. ఈ కార్యక్రమంలో తన తొలి SUVని కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ మోడల్‌ను   జేఎస్‌డబ్ల్యూ కాంబాట్‌ గా పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ లేదంటే కొత్త ఎనర్జీ టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.30 లక్షల నుంచి రూ.45 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. ఈ మోడల్ డిసెంబర్ చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ SUVని కొత్త లుక్ లో తీసుకురాబోతోంది. డిసెంబర్ 15న ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీతో ఈ కారు రానుందని భావిస్తున్నారు. దీని ధర సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.

టాటా సఫారీ ఎలక్ట్రిక్ వెర్షన్

Advertisement

టాటా మోటార్స్ కొత్త సఫారీ EV రాబోతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సఫారీ SUVకి ఎలక్ట్రిక్ వెర్షన్ లో ఈ మోడల్ రానుంది. డిసెంబర్ 24 లేదంటే 25 తేదీల్లో ఈ కారు విడుదల కానుంది. దీని ధర రూ.25 లక్షల నుంచి రూ.32 లక్షల మధ్య ఉండొచ్చని సమాచారం. పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉండనుంది.జ

ఈవీ మార్కెట్లో గట్టి పోటీ

డిసెంబర్‌లో ఈ నాలుగు మోడళ్లు విడుదలైతే, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది. ముఖ్యంగా రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల ధరల సెగ్మెంట్ లో వినియోగదారులకు కొత్త ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.

Read Also: కొనుగోలుదారులకు మారుతి షాక్.. మళ్లీ పెరిగిన కార్ల ధరలు!

Tags

Related News

రూ.2.75 లక్షలకే హోండా 500సీసీ బైక్.. మూడు వేరియంట్లలో విడుదల!

Bajaj Pulsar 125 Neon: మళ్లీ వస్తున్న పాత పల్సర్.. కొత్త బైక్‌లో ఏమున్నాయంటే?

Maruti Suzuki: కొనుగోలుదారులకు మారుతి షాక్.. మళ్లీ పెరిగిన కార్ల ధరలు!

ఒకే రోజులో రెండుసార్లు ట్రాఫిక్ చలాన్ పడుతుందా? వాహనదారులు ఈ రూల్స్ తెలుసుకోండి

క్యూట్ లుక్‌ తో కొత్త ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలిస్తే షాకవ్వల్సిందే!

విన్‌ఫాస్ట్ నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంచింగ్ ఎప్పుడంటే?

టాటా To హోండా.. డిసెంబర్‌ లో రాబోతున్న 5 అదిరిపోయే కార్లు ఇవే!

Big Stories

Advertisement
×