Hyundai Car Price Hike 2026: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, హ్యుందాయ్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్. సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా మరోసారి ధరల పెంపునకు రెడీ అయ్యింది. డిసెంబర్ 1, 2026 నుంచి తన కార్ల పోర్ట్ ఫోలియోలోని ఎంపిక చేసిన మోడళ్లు, వేరియంట్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈసారి గరిష్టంగా రూ.8,000 వరకు ధరలు పెరగనున్నాయి. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 1, 2026 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, కంపెనీ అమ్ముతున్న అన్ని కార్ల ధరలు పెరగడం లేదు. ఎంపిక చేసిన మోడళ్లు, కొన్ని వేరియంట్లకు మాత్రమే ఈ పెంపు వర్తించనుంది. గరిష్టంగా రూ.8,000 వరకు ధరలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించినప్పటికీ, ఏ మోడల్‌పై ఎంత పెంపు ఉంటుందనే పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. కారు కొనుగోలు చేయాలనుకునేవారు తమకు నచ్చిన మోడల్ కు సంబంధించిన కొత్త ధరలను డీలర్ల దగ్గర తెలుసుకోవడం మంచిది.
హ్యుందాయ్ సంస్థ ఈ ఏడాది ధరలను పెంచడం ఇది నాలుగోసారి. పెరుగుతున్న తయారీ ఖర్చులు, ముడిసరుకుల ధరలు, ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు కార్ల కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పలు కార్ల తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు ధరలను సవరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ కూడా తన కార్ల ధరలను మరోసారి పెంచాలని నిర్ణయించింది. అయితే, ఈసారి గరిష్ట పెంపు రూ.8,000కే పరిమితం కావడం కొంత అనుకూల అంశంగా చెప్పుకోవచ్చు.
హ్యుందాయ్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో పలు సెగ్మెంట్లలో కార్లను విక్రయిస్తోంది. గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఐ20, ఎక్స్ టర్, వెన్యూ, వెర్నా, క్రెటా, అల్కజార్, టక్సన్ లాంటి మోడళ్లు కంపెనీ పోర్ట్ ఫోలియోలో ఉన్నాయి. అయితే, వీటిలో ఏయే మోడళ్లు, వేరియంట్లకు ధరల పెంపు వర్తిస్తుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Also: కొనుగోలుదారులకు మారుతి షాక్.. మళ్లీ పెరిగిన కార్ల ధరలు!