E-Paper
Advertisement

నీటితో నడిచే కారు వచ్చేసింది.. ఈవీ దుకాణాలు ఇక బంద్!

నీటితో నడిచే కారు వచ్చేసింది.. ఈవీ దుకాణాలు ఇక బంద్!
Advertisement

Toyota Mirai Hydrogen Car: భారతీయ మార్కెట్ లోకి సరికొత్త కార్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లు అన్నింటినీ చెత్త బుట్టలోకి పంపబోతున్నాయి. ఈ కార్లు నీటితో నడవబోతున్నాయి. ఎలాంటి పొల్యూషన్ లేకుండా ప్రయాణించబోతున్నాయి. భవిష్యత్ రవాణాలో గేమ్ ఛేంజర్ గా మారబోతున్నాయి.

హైడ్రోజన్ కార్లు వచ్చేస్తున్నాయి!

తాజాగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి టయోటా మిరాయ్(Toyota Mirai)  అనే కారును పార్లమెంట్ కు తీసుకొచ్చారు. ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ (FCEV) టెక్నాలజీతో నడుస్తుంది. పూర్తిస్థాయిలో పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సమయంలో కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఒక్కసారి ఇంధనం నింపితే సుమారు 650 కి.మీ పైగా రేంజ్ ఇస్తుంది. కేవలం 5 నిమిషాల్లోనే రీఫ్యూయల్ చేసుకునే సౌలభ్యం ఉండటం ఈ కారు ప్రత్యేకత.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో..

Advertisement

టయోటా మిరాయ్ అనేది ఆధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేకమైన పర్యావరణ అనుకూల కారు. ఇది సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లలా కాకుండా పూర్తిగా హైడ్రోజన్ గ్యాస్‌ను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. అందువల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు.

ఒకసారి హైడ్రోజన్ నింపితే 650 కి.మీ ప్రయాణం

ఈ కారులోని ముఖ్యమైన ఆకర్షణ దాని రేంజ్. ఒకసారి హైడ్రోజన్ నింపితే సుమారు 650 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా, దీని రీఫ్యూయలింగ్ ప్రక్రియ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కేవలం 5 నిమిషాల్లోనే ట్యాంక్‌ ను పూర్తిగా నింపుకోవచ్చు.

ఇంజిన్ గురించి..

Advertisement

టయోటా మిరాయ్ పవర్ విషయానికి వస్తే, 182 హార్స్‌ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 300 Nm టార్క్‌ ను అందిస్తుంది. దీని వల్ల కారు సాఫీగా, స్థిరంగా, వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది ప్రీమియం సెడాన్ సెగ్మెంట్‌లో 5 సీట్లతో అందుబాటులో ఉంటుంది.  కుటుంబ వినియోగానికి కూడా అనుకూలంగా ఉంటుంది.

భారత్ లో టయోటా మిరాయ్‌ ని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలుపెట్టింది. ముఖ్యంగా హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీపై పరీక్షలు, పరిశోధనల కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇది భవిష్యత్తులో క్లీన్ ఫ్యూయెల్ వాహనాలకు మార్గం చూపించే ఒక ముఖ్యమైన అడుగు కాబోతోంది.

అధునాతన భద్రతా ఫీచర్లు

ఈ కారులో అధునాతన భద్రత, టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. టయోటా సేఫ్టీ సెన్స్ 3.0 అనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ సిస్టమ్ డ్రైవింగ్ సమయంలో డ్రైవర్‌కు అసిస్ట్ అలాగే 12.3 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇది నావిగేషన్, ఎంటర్టైన్‌మెంట్ కోసం ఉపయోగపడుతుంది. 14 JBL స్పీకర్లతో ప్రీమియం ఆడియో సిస్టమ్ కూడా ఉంది. ఇది ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ వల్ల కారు హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రత్యేకతలలతో టయోటా మిరాయ్ భవిష్యత్తు మొబిలిటీకి మైల్ స్టోన్ గా మారబోతోంది.

Read Also: జస్ట్ రూ. 21 లక్షల్లోనే టాటా లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు, పోటీ కంపెనీలకు చుక్కలే!

Related News

హైబ్రిడ్ కార్లపై మారుతి సూపర్ ఆఫర్లు.. ఏకంగా రూ. 2.15 లక్షల తగ్గింపు!

550 కి.మీ రేంజ్‌తో టాటా సియెర్రా EV.. మహీంద్రా BE 6కు గట్టి సవాల్!

Hyundai New SUVs: టాటా, మారుతికి హ్యుందాయ్ షాక్.. ఒకేసారి మూడు SUVల ఎంట్రీ!

టాయిలెట్ దగ్గర నిద్ర నుంచి.. వందేభారత్ ప్రయాణం దాకా.. నెట్టింట సోనూసూద్ వీడియో వైరల్!

మహీంద్రా కార్లకు ఎందుకింత డిమాండ్? 5 బలమైన కారణాలు ఇవే!

పాత టియాగో vs కొత్త టియాగో EV.. ఛార్జింగ్ స్పీడ్‌ లో ఇంత తేడానా?

2026 హోండా గోల్డ్ వింగ్ విడుదల.. రూ.44.30 లక్షల ధరతో లగ్జరీ టూరర్ ఎంట్రీ!

ఫ్యూచర్ కార్ల కోసం మారుతి AI వ్యూహం.. ఇక కొత్త మోడల్స్ తయారీ మరింత వేగవంతం!

Big Stories

Advertisement
×