E-Paper
Advertisement

పాత టియాగో vs కొత్త టియాగో EV.. ఛార్జింగ్ స్పీడ్‌ లో ఇంత తేడానా?

పాత టియాగో vs కొత్త టియాగో EV.. ఛార్జింగ్ స్పీడ్‌ లో ఇంత తేడానా?
Advertisement

టాటా మోటార్స్ ఇటీవల అప్‌ డేటెడ్ 2026 టియాగో ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వెర్షన్‌ లో బ్యాటరీ కెపాసిటీ,  ఎలక్ట్రిక్ మోటార్‌ లో పెద్ద మార్పులు చేయకపోయినా, ఛార్జింగ్ పని తీరును మెరుగుపరచడంపై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా సాఫ్ట్‌ వేర్, బ్యాటరీ మేనేజ్‌ మెంట్ సిస్టమ్‌ లో చేసిన మార్పుల కారణంగా ఛార్జింగ్ టైమ్ మరింతగా తగ్గినట్లు టాటా వెల్లడించింది.

పాత బ్యాటరీ ప్యాక్ అయినప్పటికీ..

Advertisement

కొత్త టియాగో ఈవీలో గతంలో మాదిరిగానే 24kWh బ్యాటరీ ప్యాక్, 320V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ ను కొనసాగించారు. అయితే, బ్యాటరీ పని తీరును మరింత సమర్థవంతంగా మార్చేందుకు పలు టెక్నికల్ అప్ డేట్స్ చేశారు. అప్ డేట్ చేసిన యాక్సిలరేటర్ మ్యాపింగ్, మెరుగైన బ్యాటరీ బ్యాలెన్సింగ్, కచ్చితమైన స్టేట్ ఆఫ్ ఛార్జ్ కౌంట్, మెరుగైన రేంజ్ ను కలిగి ఉంది. ఈ మార్పులతో ఛార్జింగ్ సమయం పాత మోడల్‌ తో పోలిస్తే దాదాపు 40 శాతం వరకు తగ్గింది. టెస్టింగ్ లో భాగంగా 120kW డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ ను ఉపయోగించి బ్యాటరీని ఛార్జ్ చేశారు. ఈ సమయంలో టియాగో ఈవీ సగటున 24kW ఛార్జింగ్ వేగాన్ని మరింత పెంచింది. గరిష్టంగా 32kW వరకు ఛార్జింగ్ స్పీడ్ చేరినట్లు గుర్తించారు. ఇది పాత టియాగో ఈవీతో పోలిస్తే మరింత మెరుగయ్యింది.

30 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్!

తాజా టెస్టింగ్ లో కొత్త టియాగో ఈవీ బ్యాటరీ 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే పట్టింది. పాత టియాగో ఈవీకి సుమారు 45 నిమిషాలు పట్టేది. అంటే దాదాపు 15 నిమిషాల సమయం ఆదా అవుతోంది. అయితే, చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో కనిపించే విధంగానే, బ్యాటరీ ఛార్జ్ పెరిగే కొద్దీ ఛార్జింగ్ వేగం కూడా తగ్గుతుంది. బ్యాటరీ హెల్త్ ను కాపాడేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. టియాగో ఈవీలో కూడా 90 శాతం ఛార్జ్ దాటిన తర్వాత స్పీడ్ క్రమంగా తగ్గింది. బ్యాటరీ 93 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ కావడానికి మరో 21 నిమిషాల సమయం పట్టింది. అంటే, చివరికి కొద్ది  ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పడుతోంది.

Advertisement

పాత టియాగో ఈవీ సగటున 15kW ఛార్జింగ్ వేగాన్ని మాత్రమే అందించేది. గరిష్టంగా సుమారు 19kW వరకు చేరేది. కానీ, కొత్త మోడల్‌ లో ఎక్కువ వేగంతో ఛార్జ్ అవుతోంది. సుదూర ప్రయాణాల్లో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ మరింత ఉపయోగకరంగా మారుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ తో పాటు ఇంట్లో కూడా టియాగో ఈవీని సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. 3.3kW ఏసీ వాల్‌ బాక్స్ ఛార్జర్, 15A ప్లగ్ ద్వారా బ్యాటరీని 10 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 9 గంటలు పడుతుంది. అదే 7.2kW వాల్‌ బాక్స్ ఛార్జర్ ఉపయోగిస్తే ఈ సమయం కేవలం 3.5 గంటలకు తగ్గడం విశేషం.

Read Also: ఫ్యూచర్ కార్ల కోసం మారుతి AI వ్యూహం.. ఇక కొత్త మోడల్స్ తయారీ మరింత వేగవంతం!

Related News

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×