E-Paper
Advertisement

550 కి.మీ రేంజ్‌తో టాటా సియెర్రా EV.. మహీంద్రా BE 6కు గట్టి సవాల్!

550 కి.మీ రేంజ్‌తో టాటా సియెర్రా EV.. మహీంద్రా BE 6కు గట్టి సవాల్!
Advertisement

Tata Sierra EV Launch on June 30: ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ SUV అయిన సియెర్రా EVని మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సియెర్రా.. పేరు ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో తిరిగి రానుంది. ఈ కొత్త SUVని జూన్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది.

ఒకే ఛార్జ్ తో 550 కి.మీ రేంజ్

టాటా సియెర్రా EV ప్రత్యేకత దాని రేంజ్. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 550 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి ఈ-విటారా లాంటి మోడళ్లకు నేరుగా పోటీ ఇవ్వనుంది. కంపెనీ గతంలో పంచ్, నెక్సాన్ మోడళ్ల విషయంలో అనుసరించిన విధానాన్ని దీన్ని కూడా అమలు చేసే అవకాశం ఉంది. అంటే, సియెర్రా మోడల్‌ ను పెట్రోల్, ఎలక్ట్రిక్ రెండు వెర్షన్లలో అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలని భావిస్తోంది.

Advertisement

డిజైన్ పరంగా కొత్త సియెర్రా EVలో పాత సియెర్రా మోడల్‌ కు సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలను కొనసాగించే అవకాశం ఉంది. అయితే, వాటికి ఆధునిక EV స్టైల్‌ ను యాడ్ చేయనున్నారు. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, కనెక్టెడ్ LED లైటింగ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కొత్త తరహా అల్లాయ్ వీల్స్ తో రానుంది. పాత సియెర్రా ప్రత్యేక గుర్తింపుగా ఉన్న రియర్ గ్లాస్ డిజైన్‌ ను కూడా కొత్త మోడల్‌ లో కొనసాగించవచ్చని అంచనా. పాత సియెర్రా అభిమానులకు ఈ SUV మరింత దగ్గరవుతుంది.

ఇంటీరియర్, ఫీచర్ల గురించి..

టాటా ఇప్పటి వరకు అందించిన అత్యంత ప్రీమియం క్యాబిన్‌లలో ఒకటిగా ఉండొచ్చని తెలుస్తోంది. డాష్‌ బోర్డ్‌ పై మూడు స్క్రీన్ల సెటప్ ఉండే అవకాశం ఉంది. దీనివల్ల క్యాబిన్‌ కు ఫ్యూచరిస్టిక్ లుక్ లభిస్తుంది. పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ సీట్ అడ్జెస్ట్ మెంట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియం ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. అంతేకాదు, ADAS లాంటి అధునాతన భద్రతా వ్యవస్థలను కూడా అందించే అవకాశం ఉంది.

Advertisement

అటు ఈ SUV టాటా Acti.ev ప్లాట్‌ ఫారమ్‌ పై నిర్మించబడే అవకాశం ఉంది. హారియర్ EVలో ఉపయోగించే బ్యాటరీ టెక్నాలజీని ఇందులో కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. దీంతో 500 నుంచి 550 కిలోమీటర్ల మధ్య రేంజ్ లభించవచ్చని భావిస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనుంది. అలాగే రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లను కూడా కంపెనీ పరిచయం చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మహీంద్రా BE 6కి గట్టి పోటీ తప్పదా?

ప్రస్తుతం మహీంద్రా BE 6 ఎలక్ట్రిక్ SUV మార్కెట్లో మంచి గుర్తింపు పొందుతోంది. అయితే, సియెర్రా EV తన ప్రత్యేక డిజైన్, సరికొత్త ఫీచర్లు, అధిక రేంజ్‌ తో గట్టి పోటీ ఇవ్వగలదని భావిస్తున్నారు. ధర అందుబాటులో ఉంటే, ఈ SUV మార్కెట్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఆటో ఇండస్ట్రీని ఫోకస్ అంతా ఇప్పుడు టాటా సియెర్రా EV మీద ఉంది. మరికొద్ది రోజుల్లో పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.

Read Also: టాటా, మారుతికి హ్యుందాయ్ షాక్.. ఒకేసారి మూడు SUVల ఎంట్రీ!

Related News

బైక్‌పై వెళ్తూ పాటలు వింటున్నారా? అయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ గోవిందా!

హ్యుందాయ్‌కు బిగ్ షాక్.. ఏప్రిల్-జూన్‌లో కుప్పకూలిన లాభాలు.. ఎగుమతులు సైతం డౌన్!

కారు పార్కింగ్ తిప్పలకు చెక్.. రూ.2,000 లోపే టాప్-5 రివర్స్ కెమెరాలు!

కొత్త ఈ-స్కూటర్ కావాలా? మార్కెట్‌ను షేక్ ఆడించే మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

నీటిలోనూ దూసుకెళ్లే.. బెస్ట్ ‘హై గ్రౌండ్ క్లియరెన్స్’ కార్లు.. వర్షాకాలం అస్సలు తగ్గేదేలే!

ఇంధన ధరలతో విసిగిపోయారా? మైలేజ్‌తో కేక పుట్టిస్తున్న.. ఈ CNG కార్లు మీకోసమే!

New Car Buying Tips: కారు కొనాలనుకుంటున్నారా? ముందుగా ఈ 5 విషయాలు చెక్ చేయండి!

ఫెస్టివల్ సీజన్‌ లో మారుతి మాస్టర్ ప్లాన్.. బాలెనో, ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×