Mahindra SUV Success Story: ఇండియన్ కారు మార్కెట్ లో ఎస్‌యూవీలకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ సెగ్మెంట్ లో మహీంద్రా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. పవర్ ఫుల్ డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, మంచి భద్రతా ప్రమాణాలు, పవర్ ఫుల్ ఇంజిన్లతో మహీంద్రా ఎస్‌యూవీలు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. 2026లో ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునే వారి మహీంద్రా వెహికల్స్ బెస్ట్ ఆప్షన్స్ గా నిలుస్తున్నాయి.
మహీంద్రా చిన్న కుటుంబాల కోసం రూపొందించిన XUV 3XO నుంచి పెద్ద కుటుంబాలు, సుదూర ప్రయాణాలకు అనువైన XUV 7XO, స్కార్పియో N వరకు పలు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆఫ్ రోడింగ్ ను ఇష్టపడే వారి కోసం థార్ రాక్స్ లాంటి ప్రత్యేక మోడళ్లు కూడా ఉన్నాయి. ప్రతి వినియోగదారుడి అవసరానికి సరిపోయే వాహనాలు ఈ బ్రాండ్ లో అందుబాటులో ఉన్నాయి.
ఫీచర్ల పరంగా కూడా మహీంద్రా వాహనాలు మంచి వ్యాల్యూను అందిస్తాయి. XUV 3XO లాంటి ఎంట్రీ లెవల్ మోడల్ లోనే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్ రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి లేటెస్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హైరేంజ్ మోడళ్లలో మరింత ప్రీమియం ఫీచర్లు లభిస్తున్నాయి.
భద్రత విషయంలో కూడా మహీంద్రా స్పెషల్ కేర్ తీసుకుంటుంది. కంపెనీ వాహనాల్లో మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్, ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మోడళ్లలో 360 డిగ్రీ కెమెరా, ADAS లాంటి అధునాతన భద్రతా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని బలమైన బాడీ నిర్మాణాన్ని అందిస్తోంది.
మహీంద్రా వెహికల్స్ భారతీయ రహదారుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారయ్యాయి. సిటీ రోడ్లు, జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంతాల గుంతల రోడ్లు లాంటి అన్ని పరిస్థితుల్లో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా సస్పెన్షన్ వ్యవస్థను ట్యూన్ చేశారు. ముఖ్యంగా స్కార్పియో N, XUV 7XO లాంటి మోడళ్లు ప్రయాణికులకు మంచి కంఫర్ట్ తో పాటు స్టేబుల్ డ్రైవింగ్ అనుభవాన్ని అందించనున్నాయి. కొన్ని మోడళ్లలో 4×4, ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. గతుకుల రోడ్లపై కూడా సులభం ప్రయాణించే అవకాశం ఉంటుంది. థార్ రాక్స్ లాంటి వాహనాలు ఆఫ్ రోడింగ్ అభిమానులకు మరింత అనుకూలంగా ఉంటాయి.
ఇంజిన్ పనితీరు కూడా మహీంద్రా వాహనాల ప్రత్యేకతల్లో ఒకటి. కంపెనీ డీజిల్ ఇంజిన్లు ఇప్పటికే మంచి పేరును సంపాదించుకున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న టర్బో పెట్రోల్ ఇంజిన్లు కూడా శక్తివంతమైన పనితీరును అందిస్తున్నాయి. XUV 3XO, స్కార్పియో N, XUV 7XO లాంటి మోడళ్లు బలమైన పవర్, మంచి టార్క్, సాఫీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తున్నాయి. మొత్తంగా డిఫరెంట్ మోడల్స్ ఆప్షన్, అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం,పవర్ ఫుల్ ఇంజిన్లతో ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునే వారికి మహీంద్రా బెస్ట్ ఆప్షన్ గా మారింది.
Read Also: పాత టియాగో vs కొత్త టియాగో EV.. ఛార్జింగ్ స్పీడ్ లో ఇంత తేడానా?