Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు హద్దులు దాటుతున్నా.. వ్యక్తిగతంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ చేస్తున్న కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ లో గొడవలు, కొట్లాడుకోవడం మరింత ఎక్కువ అయ్యాయి అంటూ కొంతమంది సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా బిగ్ బాస్ సీజన్ 10.. అప్పుడే 11వ వారం చివరి దశకు చేరుకుంది. ఈ మేరకు విడుదల చేసిన లేటెస్ట్ ప్రోమోలో త్రిగుణ్ అన్న ధూత అని ప్రతి ఒక్కరూ అనాల్సిందే అంటూ త్రిగుణ్ పెట్టిన కండిషన్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా 74వ రోజుకు సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో.. ముఖేష్ టీం కిచెన్ లో వంట చేస్తుండగా.. నీతూ మాస్టర్ లైటర్ తీసుకెళ్లిపోయారు. అయితే నైట్ సమయంలో లైటర్ తీసుకెళ్లిపోయిన త్రిగుణ్ టీం శివ, ముఖేష్ టీం దగ్గరికి వచ్చి లైటర్ అక్కడే పెడుతున్నాం అని చెప్పాడు. తినాల్సిన టైంలో ఇవ్వలేదు.ఇప్పుడు ఇస్తే ఏం ప్రయోజనం అంటూ రాంప్రసాద్ మండిపడ్డారు. వేరే టీం కి మీరు ఫుడ్ లేకుండా చేశారు. ఇది చాలా పెద్ద మిస్టేక్..స్మాల్ మిస్టేక్ కాదు అంటూ శివ పై ఫైర్ అయ్యారు రాంప్రసాద్. అయితే శివ మా డిక్టేటర్ త్రిగుణ్ చెప్పినట్టు మేము చేశాం అంటూ తెలిపారు.
రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పుడు మా డిక్టేటర్ ముఖేష్ ఏం చెబుతున్నారంటే మాకు లైటర్ అవసరం లేదు అని చెబుతున్నారు” అంటూ ఖరాకండిగా చెప్పేశారు. అయితే బెడ్రూంలో ఉన్న కొన్ని వస్తువులను నరేష్ దొంగతనం చేసే ప్రయత్నం చేశారు. అంతలోనే త్రిగుణ్ టీమ్ ముఖేష్ టీమ్ రామకృష్ణ ను పట్టుకొని బంధించారు. మేము తిరిగి ఇచ్చేస్తామని నరేష్ అడిగినా.. సరే బర్నర్లన్నీ తీసేసారు ముందు అవి ఇవ్వండి తర్వాత చూస్తాను అని త్రిగుణ్ చెప్పాడు. అంతటితో ఆగకుండా అడిగుంటే అన్ని ఇచ్చేసేవాళ్ళం.. కానీ దొంగతనం చేశారు. కాబట్టి వాళ్లొచ్చి అన్ని మాట్లాడి “త్రిగుణ్ అన్న దూత” అని స్లోగన్ ప్రతి ఒక్కరు చెబితేనే అన్నీ ఇస్తాను అంటూ కండిషన్ పెట్టాడు డిక్టేటర్ త్రిగుణ్.
also read:పాప పుట్టాకే దాని విలువ తెలిసింది.. కన్నీళ్లు పెట్టుకున్న నటరాజ్ మాస్టర్!
ఈరోజు బెడ్ యాక్సిస్ ఇస్తే వంట సామాన్లు అన్ని అక్కడ పెట్టేస్తామని రాంప్రసాద్.. త్రిగుణ్ వద్ద రిక్వెస్ట్ చేశాడు. కానీ త్రిగుణ్ మాత్రం.. ఏంటి త్రిగుణ్ అన్న దూత అంటే బయట నవ్వుతారా ? మీరంతా ఈ స్లోగన్ చెప్పే వరకు ఏవి ఇవ్వను అంటూ కామెంట్ చేశాడు. ఇదే విషయాన్ని రాంప్రసాద్ వచ్చి ముఖేష్ కి చెప్పగా.. పోతే పోనీ బయటే పడుకుందాం.. అదేంటి త్రిగుణ అన్న దూత అని ఎందుకు చెప్పాలి మనం అంటూ కామెంట్ చేశారు మొత్తానికైతే త్రిగుణ్ vs ముఖేష్ పోరులో నెగ్గేదెవరో చూడాలి.