E-Paper
Advertisement

టాటా సియెర్రా ఈవీ vs MG విండ్సర్ ఈవీ.. రెండింటిలో ఏ SUV బెస్ట్ అంటే..?

టాటా సియెర్రా ఈవీ vs MG విండ్సర్ ఈవీ.. రెండింటిలో ఏ SUV బెస్ట్ అంటే..?
Advertisement

Tata Sierra EV vs MG Windsor EV: టాటా మోటార్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సియెర్రా EVను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ఇప్పటికే మార్కెట్లో మంచి ఆదరణ దక్కించుకున్నMG విండ్సర్ EVకి గట్టి పోటీ ఇస్తోంది. డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ, రేంజ్, ధర లాంటి అంశాల్లో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సైజ్ లో ఏది బెస్ట్?

కొలతల పరంగా టాటా సియెర్రా EV కాస్త ముందుంది. MG విండ్సర్ EV కంటే పొడవుగా, ఎత్తుగా, ఎక్కువ వీల్‌ బేస్‌ తో వస్తుంది. వెడల్పులో మాత్రం విండ్సర్ EV కేవలం 9 మిల్లీమీటర్లు ఎక్కువగా ఉంటుంది. సియెర్రా EVలో ఎక్కువ వీల్‌ బేస్ ఉండటంతో క్యాబిన్‌ లో ప్రయాణికులకు మరింత లెగ్‌ రూమ్, మంచి స్పేస్ ఉంటుంది.

కలర్ ఆప్షన్లు

Advertisement

టాటా సియెర్రా EV మొత్తం ఏడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. MG విండ్సర్ EV ఆరు కలర్ ఆప్షన్లతో వస్తుంది. రెండు వాహనాల్లోనూ సింగిల్ టోన్ కలర్స్ మాత్రమే ఉన్నాయి. డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ ప్రస్తుతం ఏ మోడల్‌ లోనూ అందుబాటులో లేదు.

ఫీచర్లలో ఏది బెస్ట్?   

రెండు మోడల్స్ లో LED హెడ్‌ ల్యాంప్స్, LED DRLs, పెద్ద టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌ బ్యాగ్స్, లెవెల్-2 ADAS లాంటి అత్యాధునిక సదుపాయాలు రెండు కార్లలోనూ ఉన్నాయి. అయితే, టాటా సియెర్రా EVలో కొన్ని ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కో-ప్యాసింజర్ కోసం ప్రత్యేక ఎంటర్‌ టైన్‌ మెంట్ స్క్రీన్, గ్లోవ్‌ బాక్స్ కూలింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 12 స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్ లాంటి సదుపాయాలు ఉన్నాయి. అటు MG విండ్సర్ EVలో 15.6 అంగుళాల పెద్ద టచ్‌ స్క్రీన్, 135 డిగ్రీల వరకు వెనక్కి వంగే రియర్ సీట్లు, 256 రంగుల యాంబియంట్ లైటింగ్, పవర్డ్ టెయిల్‌ గేట్ లాంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

బ్యాటరీ, పవర్, రేంజ్

Advertisement

టాటా సియెర్రా EV రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 63kWh, 75kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. వీటి ద్వారా వరుసగా 565 కిలోమీటర్లు, 665 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది. అంతేకాకుండా  ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్  కూడా అందుబాటులో ఉంది. MG విండ్సర్ EVలో 38kWh, 52.9kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. వీటి రేంజ్ వరుసగా 332 కిలోమీటర్లు, 449 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ మోడల్‌ లో ఫ్రంట్ వీల్ డ్రైవ్   మాత్రమే అందుబాటులో ఉంటుంది. పవర్, టార్క్, రేంజ్ లో సియెర్రా EV స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తుంది.

ధరల్లో తేడా..

ధరల విషయానికి వస్తే.. MG విండ్సర్ EV అందుబాటు ధరలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.14.10 లక్షల నుంచి ప్రారంభమై రూ.18.60 లక్షల వరకు ఉంటుంది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఎంపికతో కొనుగోలు చేస్తే ప్రారంభ ధర రూ.9.99 లక్షలకు కూడా లభిస్తుంది.  టాటా సియెర్రా EV ధర మాత్రం రూ.18.79 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్‌కు రూ.25.99 లక్షల వరకు ఉంటుంది. అంటే సియెర్రా EV ధర విండ్సర్ కంటే ఎక్కువే.

Read Also: నానో 2.0 రిలీజ్‌ కు కౌంట్‌డౌన్.. టీజర్‌ తోనే దుమ్మురేపిన టాటా!

Related News

జూలైలో హ్యాచ్‌బ్యాక్‌ల దూకుడు.. వాగన్ ఆర్ టాప్, మారుతి హవా!

227 కిమీ రేంజ్‌ తో యూధా EPOD-భారత్.. ఈ ఆటో ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

స్కోడా ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ.. భారత్‌కు రానున్న 3 గ్లోబల్ మోడల్స్ ఇవే!

కవాసకి W230 vs యమహా XSR155.. ఈ రెండు రెట్రో బైక్‌లలో ఏది బెస్ట్?

నీళ్లు లేకుండా కారు వాష్.. ఈ ఐడియా ఏదో భలే ఉందే!

మళ్లీ మార్కెట్లోకి అడుగు పెట్టిన స్పైకర్.. అదిరిపోయే సూపర్‌ కార్‌ తో రీఎంట్రీ!

ఆటోమొబైల్ రంగంలో రికార్డ్.. రూ.383 కోట్లకు అమ్ముడైన టాప్ బ్రాండ్ ఈవీ కారు.. ఎవరు కొన్నారో తెలుసా?

జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ 85 యూనిట్లు మాత్రమే!

Big Stories

Advertisement
×