E-Paper
Advertisement

అనుకున్నది సాధించాలి! అప్పటిదాకా అధికారంలో ఉండాలి! మూసీ పునర్జీవం ప్రారంభోత్సవానికి నన్నూ పిలవండి!

అనుకున్నది సాధించాలి! అప్పటిదాకా అధికారంలో ఉండాలి! మూసీ పునర్జీవం ప్రారంభోత్సవానికి నన్నూ పిలవండి!
Advertisement

కింగ్‌ నాగార్జున.. చాలా తక్కువగా మాట్లాడుతారు. ముఖ స్తుతి ఉండదు. సుత్తి అసలే లేని ప్రసంగం. ముక్కు సూటిగా, ఉన్నదున్నట్టుగా మాట్లాడటం నాగ్‌ నైజం. అవి సినీ వేదికలైనా మరెక్కడైనా. కోపం వస్తే తమాయించుకోరు. నచ్చితే ప్రాణం ఇస్తారు. ఆయన నిజ జీవితాన్ని దగ్గరగా చూసిన వారెవరికైనా ఈ విషయం తెలుసు.

తాజాగా ఆయన మాదాపూర్‌లోని తమ్మడి కుంట చెరువు పునరుద్దరణ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. వేదిక మీద సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేదాకా తెలియదు.. ‘ఆ కుంటకు సంబంధించిన రెండు ఎకరాల భూమిని తను వదులుకున్నార’ని. గతంలో ఎన్ కన్వెన్షన్‌ విషయంలో కూడా నిజాన్ని కాస్త లేటుగా తెలుసుకున్నా పెద్ద మనసు చేసుకుని తన కబ్జాలో ఉన్న  ఆ జాగాను  చెరువు శిఖం భూమికే వదిలేసి పెద్ద మనస్సును చాటుకున్నారు నాగ్.

Advertisement

ఈ తమ్మిడి కుంట చెరువు పునరుద్దరణ సందర్బంగా ఆయన చాలా తక్కువగానే మాట్లాడినా కీలకమైన అంశాలను టచ్ చేశారు. తన మనస్సులోని మాటలను కొన్ని డైరెక్టుగా, మరికొన్ని నర్మగర్బంగా  చెప్పుకున్నారు. తన మదిలోని భావాలను, అభిప్రాయాలను వెల్లడించారు.  ఎక్కడా నటన లేదు. అంతా ఖుల్లంఖుల్లాగా మనసు నిండుగా నాగ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి.

మొదట తాను రంగానాథ్ విషయంలో నెగెటివ్‌గా  ఆలోచించానని, ఆయనను కలిసిన తరువాత, ఆ మాట్లాడిన తీరు, తనను కన్విన్స్ చేసిన విధానం.. తనను ఎంతో సంతృప్తి పరిచిందని చెప్పారు. ‘ప్రకృతి కోసం, నీటి వనరుల అభివృద్ధి కోసం ఇంత కూడా మనం చేయలేమా? అని వెంటనే నిర్ణయం తీసుసేకున్నా!’ అని చెప్పారే తప్ప.. తన జాగాను ఎంత వదలుకున్నది ఆయన ఆ వేదికగా చెప్పాలనుకోలేదు. గుప్తదానంగానే దాన్ని భావించి ఉంటారు.

Advertisement

తను ఎన్నోసార్లు విదేశాల్లో అందమైన కొలనులను చూసినప్పుడల్లా హైదరాబాద్‌లోని పరిస్థితులను చూసి మనస్సు చివుక్కుమనేదట. మన దగ్గర ఎందుకు ఇలా ఉండవు? అని. కానీ తమ్మిడికుంట సాక్షాత్కారం తరువాత ఆ కోరిక తీరిందని తన సంతృప్తిని వ్యక్తం చేశారాయన. ఇలాగే మరో రెండు వేల చెరువులను కూడా పునరద్దరించాలని, కొంత నెగిటివిటీ వెంటాడుతుందని, అయినా లక్ష్య సాధనలో ముందుకే వెళ్లాలని నాగ్‌ సీఎంకు సూచించారు.

ఆ తరువాత ఆయన మూసీ విషయాన్ని కూడా ప్రస్తావించారు. మూసీ పునర్జీవం కూడా చాలా మంచి కార్యక్రమమని కొనియాడిన ఆయన… ‘ఆ డిజైన్లు చూశాను… ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ పనులు పూర్తి కావాలి. అవి పూర్తయ్యేలా సీఎంకు బలం చేకూరాలి. తన సంకల్పాన్ని ఆయన సంపూర్ణం చేసుకోవాల’ని అన్నారు. నర్మగర్బంగా తను మళ్లీ సీఎం కావాలని, ఆ పనులు పూర్తయ్యేలా చూడాలనే ఆకాంక్ష ఆయన మాటల్లో కనిపించింది.

‘మూసీ పునర్జీవం ప్రారంభోత్సవానికి నన్ను కూడా పిలవండి..!’ అని ఆప్యాయంగా అడిగారు. ‘మనం ప్రకృతిని కాపాడటానికి మించి సంపాదించేదేమీ లేదు.. భావి తరాలకు మనమచ్చేది కూడా ఇదే. ఇక్కడే శాశ్వతంగా ఉండేందుకు రాలేదు ఎవరు?’ అని వేదాంత దోరణిలో మాట్లాడి అందరినీ కదిలించారు నాగార్జున.

Tags

Related News

భారీ బహిరంగ సభల నిర్వహణ చేతగాక చేతులెత్తేసేలా! కేసీఆర్‌లా ప్రజెంట్ చేద్దామనుకున్నా సహకరించని నేతలు.. ! నిర్మల్‌ సభపై కేటీఆర్ అంసతృప్తి!

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా! ఈనెలాఖరులోగా ఇంటింటి సర్వే! వచ్చే నెల నుంచి పేదలందరికీ రూ.5లక్షల బీమా వర్తింపు!

తాపీమేస్త్రీ టు స్కామ్ మాస్టర్‌మైండ్.. రూ. 670 కోట్లు ఎలా కొల్లగొట్టాడో తెలుసా?

పోయిన చోట వెతుక్కోవడం.. ఫేమస్‌ అయిన పేరునే ఎంచుకోవడం! రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నూతన ఒరవడి!

పెంచి ఇవ్వకున్నా.. పింఛన్లు పెంచారు! కొత్తగా 4,50 లక్షల మందికి పింఛన్లు..! రూ. 110కోట్ల అదనపు భారం!

ఏపీ స్థానిక పోరులో కూటమి హవా.. కానీ ఆ ఓక్క జిల్లాలో టీడీపీకి సీన్ రివర్స్?

కాంగ్రెస్ సర్కార్‌ పై బీఆర్‌ఎస్ భారీ స్కెచ్.. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Big Stories

Advertisement
×