E-Paper
Advertisement

ఏపీ స్థానిక పోరులో కూటమి హవా.. కానీ ఆ ఓక్క జిల్లాలో టీడీపీకి సీన్ రివర్స్?

ఏపీ స్థానిక పోరులో కూటమి హవా.. కానీ ఆ ఓక్క జిల్లాలో టీడీపీకి సీన్ రివర్స్?
Advertisement

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే ఎప్పటికప్పుడు మారే సమీకరణాలు అని అర్థః. ఇక్కడ ఎన్నికల ఫలితాలు కేవలం గెలుపోటములను మాత్రమే కాదు… పార్టీల బలాబలాలను కూడా బయటపెడతాయి. తాజాగా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపాయి. ఒకవైపు అధికారంలో ఉన్న టీడీపీ నేతృత్వంలోని కూటమి… మరోవైపు ప్రతిపక్ష వైసీపీ. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరిగిన ఈ రాజకీయ పోరులో ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు? వైసీపీ ఎక్కడ తన ఉనికిని ఎలా చాటుకుంది? కూటమి ఎక్కడ ఆధిపత్యం ప్రదర్శించింది? అసలు గత ఎన్నికలతో పోలిస్తే.. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పర్ఫామెన్స్ ఎలా ఉంది?

మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలు..

ముందుగా జెడ్పీటీసీ ఎన్నికల దగ్గరకు వద్దాం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వీటిలో 77 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 582 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ కూటమి 499 స్థానాలను గెలుచుకుంది. ఇందులో టీడీపీ 406, జనసేన 73, బీజేపీ 20 స్థానాలు సాధించాయి. ఇక వైసీపీ విషయానికి వస్తే… 76 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఒక్కసారి 2021 ఎన్నికల ఫలితాలను గుర్తు చేసుకుందాం. 2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష టీడీపీ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏకంగా 76 స్థానాలను గెలుచుకుంది. అంటే అప్పటి టీడీపీ సాధించిన స్థానాల కంటే ఇప్పుడు వైసీపీ సాధించిన స్థానాలు దాదాపు 12.7 రెట్లు ఎక్కువ. ఇది కేవలం నెంబర్ గేమ్ మాత్రమే కాదు.. రెండు వేర్వేరు రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు సాధించిన ఫలితాల మధ్య ఉన్న తేడా.

వైసీపీ 7 స్థానాలు..

Advertisement

ఇక ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన అంశం అల్లూరి సీతారామరాజు జిల్లా. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఆధిక్యం సాధించినప్పటికీ, ఈ జిల్లాలో వైసీపీ తన పట్టును చాటుకుంది. మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ 7 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ 3 స్థానాలు, సీపీఎం ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ ఫలితాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక పొలిటికల్ వేవ్ ఉన్నప్పుడు.. కొన్ని ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులు, అభ్యర్థుల ప్రభావం, ప్రాంతీయ సమస్యలు ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయో అల్లూరి జిల్లా ఫలితాలు చూపిస్తున్నాయి. అంటే రాష్ట్ర స్థాయి ఫలితాలకు, ప్రాంతీయ స్థాయి ఫలితాలకు మధ్య తేడాలు ఉండే అవకాశం ఉంటుందని ఈ ఫలితాలు చెబుతున్నాయి.

Also Read: రాహుల్ పర్యటనను అడ్డుకుంటే.. ఢిల్లీ నుంచి వచ్చే బీజేపీ నేతలను అడ్డుకుంటాం: వీహెచ్ వార్నింగ్!

బీజేపీ 117 స్థానాల్లో విజయం

Advertisement

ఇప్పుడు మరింత ఆసక్తికరమైన ఎంపీటీసీ ఎన్నికల లెక్కలు చూద్దాం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9 వేల 818 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వీటిలో 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఫలితాల్లో కూటమి 5,861 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 4,806, జనసేన 938, బీజేపీ 117 స్థానాల్లో విజయం సాధించాయి. మరోవైపు వైసీపీ 1,711 స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో కంపేర్ చేసి చూద్దాం. 2021లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష టీడీపీ 929 స్థానాలను గెలుచుకుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ 1,728 స్థానాలను గెలుచుకుంది. అంటే 2021లో టీడీపీ సాధించిన స్థానాలతో పోలిస్తే ఇప్పుడు వైసీపీ సాధించిన స్థానాలు దాదాపు డబుల్ అనే చెప్పాలి.

ఎంపీటీసీ ఎన్నికల్లో..

2021లో అధికారంలో ఉన్న వైసీపీ 5 వేల 992 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా, 2026లో అధికారంలో ఉన్న కూటమి 5 వేల 861 స్థానాలను గెలుచుకుంది. ఇవి వేర్వేరు కాలాల్లోని అధికార పార్టీల ఫలితాలు. మొత్తంగా ఈ ఎన్నికలు రెండు విషయాలను చెబుతున్నాయి. ఒకటి… రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. రెండు… 2021లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సాధించిన స్థానాలతో పోలిస్తే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. అంటే విపక్షంలో ఉన్నా అప్పటి టీడీపీతో పోలిస్తే.. వైసీపీ కొంచెం స్ట్రాంగ్‌గా ఉందనే చెప్పాలి.

2021లో అధికారం..

2021లో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొన్న టీడీపీకి వచ్చిన జెడ్పీటీసీ స్థానాలు ఎన్నో తెలుసా? కేవలం 6. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ గెలుచుకున్న స్థానాలు ఎన్నో తెలుసా? ఏకంగా 76. అంటే దాదాపు 13 రెట్లు ఎక్కువ. అసలు లెక్కేంటో చూద్దాం.

Also Read: ఒక్కో పాట ఒక్కో సెన్సేషన్.. సింగర్ కనకవ్వ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !

2021లో టీడీపీ..

ఏపీ వ్యాప్తంగా 659 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరగ్గా, 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో టీడీపీ నేతృత్వంలోని కూటమి 499 స్థానాలు గెలుచుకోగా, వైసీపీ 76 స్థానాలను దక్కించుకుంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. అదే టైమ్‌లో 2021లో టీడీపీ గెలిచిన ఆరు స్థానాలతో పోలిస్తే వైసీపీ స్థానాల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఆసక్తికరమైన లెక్కలే. 2021లో ప్రతిపక్ష టీడీపీ 929 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ సాధించిన స్థానాలు 1,728. అంటే దాదాపు డబుల్.

2021తో పోలిస్తే..

ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం వైసీపీ ప్రత్యేకంగా తన ప్రభావాన్ని చూపించింది. మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాల్లో 7 స్థానాలను గెలుచుకుంది. మొత్తానికి 2026 స్థానిక ఎన్నికల్లో కూటమి రాష్ట్రవ్యాప్త ఆధిక్యం ఒకవైపు 2021తో పోలిస్తే ప్రతిపక్ష వైసీపీ సాధించిన స్థానాలు ఎక్కువగా ఉందనే విషయం మరోవైపు. సో.. వైసీపీ బలంగా లేదన్నది ఎంత నిజమో.. అధికారపక్షం అనుకున్నంత బలహీనంగా లేదన్నది కూడా అంతే నిజం.

Tags

Related News

కాంగ్రెస్ సర్కార్‌ పై బీఆర్‌ఎస్ భారీ స్కెచ్.. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

రాహుల్‌ గాంధీ.. రైజింగ్‌ స్టార్‌గా ఎదుగుతున్నారా?

స్థానిక నేతలకు బీఆర్ఎస్ ప్రత్యేక బాధ్యతలు.. మారనన్న పొలిటికల్ సీన్?

ఢిల్లీని మింగేస్తున్న అదృశ్య మృత్యువు.. గాలి పీల్చినా విషమే.. అసలు ఏమైంది?

పల్లె పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్.. రూ. 3,189 కోట్లతో తెలంగాణలో ‘డిజిటల్ విప్లవం’!

జీహెచ్‌ఎంసీ అడ్వర్టైజ్‌మెంట్‌లో కోట్ల కుంభకోణం.. పట్టించుకోని అధికారులు!

ఎవరీ వైఎస్ అనిల్ రెడ్డి? దేశవ్యాప్తంగా ఆయన పేరే ఎందుకు మారుమోగుతోంది?

Big Stories

Advertisement
×