E-Paper
Advertisement

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా! ఈనెలాఖరులోగా ఇంటింటి సర్వే! వచ్చే నెల నుంచి పేదలందరికీ రూ.5లక్షల బీమా వర్తింపు!

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా! ఈనెలాఖరులోగా ఇంటింటి సర్వే! వచ్చే నెల నుంచి పేదలందరికీ రూ.5లక్షల బీమా వర్తింపు!
Advertisement

రైతు బీమా ఆగిపోయింది. ఈ ఏడాది ఆగస్టు 14న చెల్లించాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఆ పథకం ఇప్పుడు తెలంగాణలో లేనట్టే. దాదాపుగా ఆరేండ్లుగా కొనసాగుతున్న ఈ పథకం నిలిచిపోయినట్టే. కానీ,ఈ పథకం ప్లేస్‌లో రైతులతో పాటు పేద వర్గాలందరికీ ఇదే తరహా బీమా వర్తించేలా కొత్త పథకాన్ని తీసుకొస్తున్నది సర్కార్‌. ఈ పథకం పేరే.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం.

ఈనెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 20 నుంచి 30 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నది సర్కార్‌. రేషన్‌ కార్డున్న ప్రతీ కుటుంబానికి ఈ పథకం వర్తించేలా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి, అతని సంపాదన మీదే ఆ కుటుంబం కొనసాగుతున్న నేపథ్యాన్ని తీసుకుని ఆ వ్యక్తికి ఇందిరమ్మ కుటుంబ బీమాను వర్తింపజేస్తారు. అతను మరణిస్తే రూ. 5లక్షల బీమా మొత్తాన్ని నామినీగా ఉన్నభార్యకు అందిస్తారు.

Advertisement

రైతులతో పాటు రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ బీమా వర్తింపజేసుకునేలా ఇంటింటి సర్వేను నిర్వహించ తలపెట్టింది సర్కార్‌. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలో రేషన్‌ కార్డు కలిగి ఉన్న 1.15 కోట్ల మంది పేద, మధ్యతరగతి వర్గాలకు ఈ బీమా వర్తిస్తుంది.

రైతు బీమా పథకం కింద ఈ ఏడాది ఆగస్టు 13 లోపు ఎవరైనా రైతులు చనిపోయి ఉంటే.. వారికి పాత క్లెయిమ్స్‌ క్లియర్ చేస్తారు. ఐదు లక్షల బీమా సొమ్మును అందిస్తారు. ఆ తరువాత జరిగే మరణాలకు మాత్రం ఈ బీమా వర్తించదు. ఇకపై పట్టాలెక్కనున్న ఇందిరమ్మ కుటుంబ బీమానే రైతులతో పాటు, పేదలందరికీ  వర్తించనుంది.  రైతులు కూడా ఇంటింటి సర్వేలో పాల్గొని తమ వివరాలను ఇవ్వాలని, దరఖాస్తుల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సర్కార్‌ సూచిస్తోంది.

Advertisement

రేషన్‌కార్డుదారులందరికీ ఈ పథకం వర్తింపజేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. వాస్తవానికి, పేదలకు చాలా మందికి బీమా సౌకర్యం లేదు. కొందరు బీమా పథకాలను మొదలు పెట్టినా.. ప్రీమియంలు సకాలంలో చెల్లించకపోవడంతో అవి ల్యాప్స్‌ అవుతుంటాయి. దీంతో దీని ఉపయోగం లేకుండా పోతుంది. ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఆర్థికంగా మరింత చితికిపోతున్నది. అప్పుల పాలవుతున్నది. పిల్లల చదవులపైనా ఈ మరణ భారం పడుతున్నది.

ఈ పథకం అమలు తరువాత .. కొంతలో కొంత ఆర్థిక వెసులు బాటు వారికి కలగనుంది. ఇంటి పెద్ద లేని లోటు నుంచి కోలుకునే వరకైనా ఆర్థిక దన్నుగా ఈ బీమా మొత్తం సహాయకారిగా ఉంటుందని సర్కార్ భావిస్తోంది. గతంలో రైతులకు ఇదే విధంగా మేలు జరిగింది. రైతు బీమా పథకానికి మంచి పేరు వచ్చింది. ఇదే తరహా బీమా ఇప్పుడు రైతులతో పాటు పేద, మధ్యతరగతి వర్గాలందరికీ దక్కే అవకాశం ఉండటంతో బీమా ఆ కుటుంబాల్లో ధీమాను పెంచుతుందనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

బీఆరెస్‌ పార్టీ క్రియాశీల సభ్యత్వం చేసిన వారికి రూ.2 లక్షల బీమా అందించింది గతంలో.  కానీ అది కొందరికే మేలు జరిగేది. అందరికీ బీమా ఇవ్వాలనే ఆలోచన అప్పుడు కేసీఆర్ చేయలేదు. రైతు కేంద్రంగానే తన పాలన కొనసాగుతుందనే విధంగా ఆయన పథకాలు కొనసాగాయి. అందులో భాగంగానే రైతు బీమా వచ్చింది. ఇప్పుడు దీన్ని మార్చి రేవంత్‌ సర్కార్‌ తన పాలనలో ఇందిరమ్మ కుటుంబ బీమాగా మార్చి తనదైన మార్కును వేసుకునే ప్రయత్నం చేస్తున్నారనుకోవాలి.

Tags

Related News

తాపీమేస్త్రీ టు స్కామ్ మాస్టర్‌మైండ్.. రూ. 670 కోట్లు ఎలా కొల్లగొట్టాడో తెలుసా?

పోయిన చోట వెతుక్కోవడం.. ఫేమస్‌ అయిన పేరునే ఎంచుకోవడం! రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నూతన ఒరవడి!

పెంచి ఇవ్వకున్నా.. పింఛన్లు పెంచారు! కొత్తగా 4,50 లక్షల మందికి పింఛన్లు..! రూ. 110కోట్ల అదనపు భారం!

ఏపీ స్థానిక పోరులో కూటమి హవా.. కానీ ఆ ఓక్క జిల్లాలో టీడీపీకి సీన్ రివర్స్?

కాంగ్రెస్ సర్కార్‌ పై బీఆర్‌ఎస్ భారీ స్కెచ్.. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

రాహుల్‌ గాంధీ.. రైజింగ్‌ స్టార్‌గా ఎదుగుతున్నారా?

స్థానిక నేతలకు బీఆర్ఎస్ ప్రత్యేక బాధ్యతలు.. మారనన్న పొలిటికల్ సీన్?

Big Stories

Advertisement
×