Other Mommy OTT: వరల్డ్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ టెర్రిఫైయింగ్ అండ్ సైకలాజికల్ హారర్ జోనర్లలో ‘ది కన్జ్యూరింగ్’, ‘ ‘ది బూగీమ్యాన్’ శైలి సినిమాలు ఎప్పుడూ ఫస్ట్ వరుసలో ఉంటాయి. చిన్న పిల్లల నమ్మకాలను బేస్ చేసుకుని, వెన్నులో వణుకు పుట్టించే ఇలాంటి హాలీవుడ్ హారర్ మూవీలు పగలు చూడాలన్నా భయం వేస్తుంది. ఇప్పుడు హారర్ లవర్స్ ని కలవరపెట్టే ఇలాంటి భయంకరమైన చిత్రం మరొకటి ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సరికొత్త టెర్రిఫైయింగ్ మూవీ పేరు ‘Other Mommy’. మరి ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ సినిమా కథ 8 ఏళ్ల బేలా అనే చిన్నారి చుట్టూ తిరుగుతుంది. బేలా ఇంట్లో ఎప్పుడూ తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ ఒంటరితనం మరియు భయాల మధ్య బేలాకు తన బెడ్‌రూమ్‌లోని అల్మారా నుండి ఒక వింత శక్తి పరిచయమవుతుంది. ఆ శక్తి చూడటానికి అచ్చం బేలా వాళ్ల అమ్మలాగే ఉంటుంది. దాంతో బేలా దానికి ‘అదర్ మమ్మీ’ అని పేరు పెట్టుకుంటుంది. మొదట్లో ఆ శక్తి బేలాతో చాలా ప్రేమగా ఉంటూ, తన అసలు అమ్మ కంటే ఎక్కువే ఆప్యాయత చూపిస్తున్నట్లు నటిస్తుంది.
కానీ రోజులు గడిచేకొద్దీ ‘అదర్ మమ్మీ’ అసలు స్వరూపం బయటపడుతుంది. ఆ శక్తి బేలాను తన సొంత తల్లిదండ్రుల నుండి దూరం చేయాలని చూస్తుంది. అది కేవలం బేలాకు మాత్రమే కనిపిస్తూ, తన నిజమైన అమ్మ స్థానంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇంట్లో వింతైన, భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆ దెయ్యం బేలాను మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పెడుతుంది. చివరికి ఆ దుష్ట శక్తి బేలాను పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది.
ఇక అదర్ మమ్మీ బేలా శరీరాన్ని ఆక్రమించుకోవడానికి బేలా అనుమతి కోరుతుంది. ఒక దశలో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఒంటరితనం తట్టుకోలేక బేలా దానికి ఒప్పుకుంటుంది. చివరికి ఆ దుష్ట శక్తి బేలా శరీరంలోకి ప్రవేశిస్తుందా ? దాని నుంచి బేలా బయట పడుతుందా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడాల్సిందే. రాత్రి పూట ఇంట్లో దెయ్యం కదలికలు, బ్యాక్‌గ్రౌండ్ లో వచ్చే భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్ చూసినప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అసలైన తల్లి ఎవరు, ఆ దెయ్యం రూపం ఏంటి అనేది కనిపెట్టే ప్రాసెస్ లో వచ్చే ట్విస్టులు హడలెత్తిస్తాయి. రాత్రి పూట ఒంటరిగా రూమ్ లో లైట్లు ఆపేసి చూస్తే ప్రాపర్ హారర్ ఎక్స్ పీరియన్స్ గ్యారెంటీ.
ఈ చిత్రంలో జెస్సికా చాస్టెయిన్ బేలా తల్లిగా, ‘Other Mommy’ అనే భయంకరమైన రూపంలో ద్విపాత్రాభినయం చేశారు. బేలా పాత్రలో అరబెల్లా ఒలివియా క్లార్క్, తండ్రి పాత్రలో జే డుప్లాస్ నటించారు. జోష్ మాలెర్మన్ రాసిన ‘Incidents Around the House’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనికి రాబ్ సావేజ్ దర్శకత్వం వహించారు. జేమ్స్ వాన్ నిర్మాతగా వ్యవహరించారు. 2026 అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నిడివి సుమారు 93 నిమిషాలు. నవంబర్ 10 నుంచి Prime Videoలో రెంట్ ఆప్షన్ తో అందుబాటులోకి వచ్చింది.