BigTV English
Advertisement

Duvvada Srinivas: పాపం దువ్వాడ.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఫ్యూచర్ ఏంటి ?

Duvvada Srinivas: పాపం దువ్వాడ.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఫ్యూచర్ ఏంటి ?

Duvvada Srinivas: ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్ అంశంపై వైసీపీ అధిష్టానం స్పందించింది. ఆయన్ను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించింది. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌కు బాధ్యతలను జగన్ అప్పగించారు. ఓవైపు ఫ్యామిలీ గొడవలు.. మరోవైపు అధిష్టానం నుంచి వేటు వార్తలతో సతమతం అవుతున్న దువ్వాడ.. ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారనే అంశం ఉత్కంఠగా మారింది. ఏక్ నిరంజన్‌గా మారిన శ్రీనివాస్.. ఎలా ముందుకు వెళ్తారనే అంశం.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.


దువ్వాడ శ్రీనివాస్‌.. ఒకప్పుడు ఆ పేరు అంత ప్రాచూర్యం కాదు. రెండు సార్లు టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్నా.. ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కొందరికి మాత్రమే తెలిసి దువ్వాడ.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పెళ్లిళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారారు. ప్రతి టీవీ చర్చల్లోనూ పవన్‌పై విరుచుపడి ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్టాబ్లిస్ అయ్యారు. ఇటీవల కుటుంబ కలహాలతో రచ్చకెక్కిన శ్రీనివాస్‌పై పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఓ వైపు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌.. మరోవైపు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న దువ్వాడను.. పార్టీ నిర్ణయం మరింత కుంగదీసిందనేది రాజకీయవర్గాల టాక్‌.

భార్యతో కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నా.. దువ్వాడ రాజకీయంగా నెట్టుకొస్తూ వచ్చారు. తన భర్తకు టిక్కెట్ ఇవ్వవద్దని.. ఆ స్థానంలో తాను పోటీ చేస్తానంటూ వాణి.. ఏకంగా జగన్ వద్దే చెప్పారు. అప్పట్లో వారితో మాట్లాడి పరిస్థితిని జగన్ అందుపులోకి తెచ్చారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఓ ఇంటి విషయంలో వాణి.. భర్తపై తీవ్ర ఆరోపణలు చేశారు. దివ్వెల మాధురి అనే మహిళతో ఆయన.. సన్నిహితంగా మెలుగుతున్నారంటూ బాంబు పేల్చారు. అంతే కాదు.. కుమార్తెతో కలసి తమకు రావాల్సిన వాటా ఇప్పించాలంటూ పోరాటం చేశారు. దీంతో ఒక్కసారిగా దువ్వాడ ఫ్యామిలీ రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆయన సన్నిహితులే చర్చించుకుంటున్నారు.


Also Read: ఫ్యామిలీ మేటర్‌లో పార్టీని లాగినందుకు.. దువ్వాడకు షాకిచ్చిన జగన్

వైసీపీ మహిళా నేతగా ఉన్న దివ్వెల మాధురి కూడా వాణి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. తమ మధ్య స్నేహపూర్వక సంబంధమేనంటూ సమాధానం ఇచ్చారు. అక్కడ నుంచి జరిగిన ప్రతి అంశం.. వివాదస్పదంగా మారి.. అటు శ్రీనివాస్‌తో పాటు ఇటు మాధురి కుటుంబంపైనా తీవ్ర ప్రభావం చూపింది. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అయిన మాధురి.. ఓ సందర్భంల్లో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు. జాతీయ రహదారిపై తన కారును వేగంగా నడుపుతూ.. రోడ్డుపక్కన ఆగి ఉన్న మరో కారును ఢీకొన్నారు. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడినా.. ఆ అంశం మాత్రం సంచలనంగా మారింది.

మరోవైపు.. తనకు డబ్బులు ముఖ్యం కాదని దువ్వాడ స్నేహమే కావాలంటూ మాధురి చేసిన వ్యాఖ్యలు మరింత హీట్‌ పెంచాయి. అవసరమైతే దువ్వాడ ఇంటి కోసం తాను ఖర్చు చేసిన రెండు కోట్లూ వదులుకుంటానని.. ఈ సమస్యను ఇంతటితో ఆపేయాలని మాధురి.. మీడియా సమక్షంగా చెప్పారు. దువ్వాడ వాణి మాత్రం.. కొన్ని కండీషన్లును భర్త ముందు పెట్టగా ఆయన వాటిలో కొన్నింటికి అంగీకారం తెలిపారు. రెండుమూడు అంశాల్లో మాత్రం శ్రీనివాస్‌.. నో అన్నారనే వార్తలు వినిపించాయి.

Also Read: దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో ఊహించని ట్విస్ట్.. అందరం కలిసి ఉందామని వాణి ప్రతిపాదన

నాడు దువ్వాడ శ్రీనివాస్ అంశంపై వైసీపీ అధిష్టానం ఎలాంటి జోక్యం చేసుకోలేదు. అటు ఆయన్ను సపోర్ట్ చేయటం గానీ.. దీనిపై సమాధానం చెప్పాలని కానీ అడగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో దువ్వాడ అంశం ఆయన వ్యక్తిగతమని వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన ప్రభావం పార్టీపై ఉండదని వ్యాఖ్యానించారు. దానిపై కూటమి నేతలు కూడా స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూటమి పార్టీల నుంచి డిమాండ్లు వినిపించాయి. అయినా స్పందించని జగన్‌.. తాజాగా పార్టీలో ప్రక్షాళన పేరుతో కొన్ని మార్పుచేర్పులు చేశారు. అందులో భాగంగా టెక్కలి నియోజకవర్గ బాధ్యతల నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను తప్పించి.. ఆ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించింది. ఊహించన విధంగా శ్రీనివాస్‌కు మరోషాక్ తగిలిందనేది రాజకీయవర్గాల టాక్‌.

ఓ వైపు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌.. మరోవైపు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న దువ్వాడ భవితవ్యం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఉత్కంఠగా మారింది. ఒక్కసారిగా అన్ని కష్టాలూ రావటంతో తమ నేత ఇబ్బందుల్లో పడ్డారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

India VS Pakistan: పవర్‌ఫుల్‌గా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్! యుద్ధం ఖాయమేనా?

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో.. కాంగ్రెస్ త్రిముఖ వ్యూహం

Big Stories

×