BigTV English

Jagan shock to Duvvada: ఫ్యామిలీ మేటర్‌లో పార్టీని లాగినందుకు.. దువ్వాడకు షాకిచ్చిన జగన్

Jagan shock to Duvvada: ఫ్యామిలీ మేటర్‌లో పార్టీని లాగినందుకు..  దువ్వాడకు షాకిచ్చిన జగన్

Jagan shock to Duvvada Srinivas(AP political news): వైసీపీ ఎమ్మెల్సీ, టెక్కలి ఇన్‌ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్‌కు ఝలక్ ఇచ్చారు జగన్. ఫ్యామిలీ వ్యవహారాల్లోకి పార్టీని లాగేందుకు ఆయనను దూరంగా పెట్టింది. అంతేకాదు టెక్కలి ఇన్‌ఛార్జ్‌గా పేరాడ తిలక్‌ను నియమించడం చకచకా జరిగిపోయింది.


ఫ్యామిలీ సమస్యల్లో ఇరుక్కుని గిలగిల కొట్టుకుంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఊహించని షాక్ ఇచ్చింది వైసీపీ. పీకల్లోతు కష్టాల్లో పడిన ఆయనకు పార్టీ నుంచి ఉపశమనం కలగలేదు. పైగా ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. ఆయనను టెక్కలి ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించింది.

దువ్వాడ ప్లేస్‌లో కొత్త ఇన్ ఛార్జ్‌ని నియమించింది. ఒకప్పుడు కళింగ కమ్యూనిటీకి కేరాఫ్‌ టెక్కలి నియోజకవర్గం. దువ్వాడ స్థానంలో కళింగ కమ్యూనిటీకి చెందిన పేరాడ తిలక్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీంతో దువ్వాడ శ్రీనివాస్ పనైపయిందని అంటున్నారు. దువ్వాడ రాజకీయాలకు చెక్ పడిందన్నది ఆ పార్టీ నేతల మాట.


ALSO READ: ప్రాణాలతో చెలగాటమా ? రెడ్ కేటగిరీ ఇండస్ట్రీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్..

నార్మల్‌గా వైసీపీ టెక్కలి ఇన్‌ఛార్జ్ పోస్టుకు మొదటి నుంచి కన్నేశాడు పేరాడ తిలక్. గతంలో ఆయనకు కళింగ కమ్యూనిటీ ఛైర్మన్‌గా నియమించింది.  దీంతో టీడీపీ అచ్చెన్నాయుడుకు దువ్వాడ సరైన వ్యక్తని భావించింది పార్టీ. ఫ్యామిలీ సమస్యల వల్లే అక్కడ వైసీపీ ఓడిపోవడానికి కారణమని వైసీపీ వేగులు అధిష్టానానికి అంతర్గత రిపోర్టు ఇచ్చారు.

దువ్వాడకు చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తున్న తరుణంలో ఆయన ఫ్యామిలీ మేటర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యవహారంలోకి ఏకంగా పార్టీ హైకమాండ్‌ని లాగడంతో అదును కోసం వెయిట్ చేసిన జగన్, దువ్వాడను దూరంగా పెట్టారు.

తాజా పరిణామంతో షాకయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. రేపో మాపో అధినేత జగన్‌ను కలవాలని భావిస్తున్నారు. ఇందుకోసం అపాయింట్మెంట్  కోరినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయాడు పేరాడ తిలక్. ఆ తర్వాత ఆ నియోజకవర్గంపై దృష్టి సారించాడు. మొన్నటి ఎన్నికల్లో టెక్కలి సీటు కోసం ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అనుకోకుండా ఇప్పుడు తిలక్‌ను ఇన్‌ఛార్జ్ పదవి వరించింది.

Related News

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Amaravati News: వైసీసీ గుట్టు బయటపెట్టిన మంత్రి లోకేష్, ఖర్చు మామూలుగా లేదు, రంగంలోకి సిట్

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

Big Stories

×