BigTV English

Amitabh Bachchan Copy Rights : అమితాబ్ అనుమతి లేకుండా ఫోటో ఉపయోగించినా నేరమే..

Amitabh Bachchan Copy Rights : అమితాబ్ అనుమతి లేకుండా ఫోటో ఉపయోగించినా నేరమే..


Amitabh Bachchan Copy Rights : అమితాబ్ బచ్చన్ పేరు, ఫోటో, వాయిస్, లేదా ఆయనకు సంబంధించినది ఏదైనా అమితాబ్ అనుమతి లేనిదే వానిజ్యంలో ఉపయోగించడానికి లేదు. అలా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బిగ్ బి అమితాబ్ పేరును ఉపయోగించుకొని ఎంతో మంది దశాబ్దాలుగా తమ బిజినెస్‌లో ఉపయోగించుకుంటున్నారు. కొందరు అమితాబ్ ఫోటోలతో టీషర్టులు, ఇంకొందరు అమితాబ్ టీస్టాల్, ఇలా అమితాబ్ పేరును వ్యాపారానికి చాలా మంది వాడుకుంటూ ఉన్నారు. అయితే ఇవన్నీ ఇప్పటి నుంచి చట్టవిరుద్దం అవుతాయి. అమితాబ్‌కు సంబంధించిన ఫోటో, వాయిస్, వీడియో లాంటివి ఏవి ఉపయోగించలనుకున్న ఖచ్చితంగా అమితాబ్ అనుమతి తీసుకోవాల్సింది.


అమితాబ్ బచ్చన్ తరపున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. అనేక మంది అమితాబ్ అనుమతి లేకుండా తమ వ్యాణిజ్యంలో అమితాబ్ పేరును ఉపయోగించడం వల్ల ఆయనకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా..చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని న్యాయవాది హరీష్ సాల్వే ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు. అమితాబ్ తరపు వాదనలు విన్న కోర్టు ఐటీ, టెలికామ్ శాఖలకు అమితాబ్‌కు సంబంధించిన కాపీరైట్స్, వ్యక్తిగత హక్కులకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×