BigTV English

Shraddha Murder Case Update : అఫ్తాబ్ పాలీగ్రాఫ్ టెస్ట్‌లో విస్తుపోయే విషయాలు..

Shraddha Murder Case Update : అఫ్తాబ్ పాలీగ్రాఫ్ టెస్ట్‌లో విస్తుపోయే విషయాలు..

Shraddha Murder Case Update : శ్రద్ధా హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. శ్రద్ధాను దారుణంగా హత్య చేసిన అప్తాబ్‌కు పోలీసులు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో.. పోలీసులను సైతం షాక్‌కు గురిచేసే ఎన్నో సంఘటనలు బయటపడ్డాయి. నిరాటంకంగా సుమారు 8 గంటలపాటు పోలీసులు అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. హంతకుడు చెప్పిన వివరాలను బట్టి పక్కా ప్లాన్‌తోనే శ్రద్ధాను హత్య చేసినట్లు తెలుస్తోంది.


శ్రద్ధాను చంపి, ముక్కలుగా నరికి 18 రోజుల పాటు సూట్‌కేసులో శ్రద్ధా శరీర భాగాలను వేసుకొని ఛత్రపూర్ అడవుల్లో చల్లాడు. అయితే ఇదంతా పక్కా ప్లాన్‌తోనే అఫ్తాబ్ చేసినట్లు పోలీసులు బలంగా చెబుతున్నారు. 15 రోజుల విచారణ అనంతరం అఫ్తాబ్ అసలు స్వరూపాన్ని అర్ధం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్వెస్టిగేషన్‌లో తాను చిక్కకుండా అనేక జాగ్రత్తలు పడినట్లు గుర్తించారు. శ్రద్ధా భాగాలను అడవుల్లో విసిరడానికి వెళ్లినప్పుడు తన వెంట ఫోన్ తీసుకోకుండా ఇంట్లోనే పెట్టి వెళ్లేవాడని.. అలా సిగ్నల్స్ ఇన్వెస్టిగేషన్‌లో దొరక్కుండా జాగ్రత్తపడినట్లు కనుగ్గొన్నారు.

శ్రద్ధను పక్కా ప్లాన్‌తోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం హత్య చేయడానికి ఛత్రపూర్ అడవులకు సమీపంగా రెంట్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రద్ధా అఫ్తాబ్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నప్పుడు బద్రీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారానే ఛత్రపూర్ అడవులకు సమీపంలో కావాలని అఫ్తాబ్ రెంట్ తీసుకున్నట్లు భావిస్తున్నారు. అంతా పక్కా ప్లాన్‌తో క్రూరత్వానికి పాల్పడ్డ అఫ్థాబ్.. కోర్టు ముందు మాత్రం తాను క్షణికావేశంలో మాత్రమే హత్య చేసినట్లు కోర్టు ముందు చెప్పాడు. అఫ్తాబ్ తనను ముక్కులుగా చంపుతానని బెదిరించినట్లు శ్రద్ధా వాకర్ 2020లోనే పోలీసులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.


Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×