BigTV English

Analysis on Blood Groups: చుక్క నెత్తురు.. చరిత్రంతా చెప్పేస్తోంది..!

Analysis on Blood Groups: చుక్క నెత్తురు.. చరిత్రంతా చెప్పేస్తోంది..!

Analysis on Blood Groups: సాధారణంగా మనిషి స్వభావాన్ని.. అతని నేపథ్యాన్ని బట్టి, చదువును బట్టి, అలవాట్లను బట్టి అంచనా వేస్తుంటారు. కానీ.. జపాన్ శాస్త్రవేత్తలు మాత్రం బ్లడ్ గ్రూపును బట్టి తేల్చేపారేస్తున్నారు. 60 ఏళ్ల కిందటే వారు ఈ దిశగా పరిశోధనలు చేయటం మొదలుపెట్టారంటే నమ్మలేము. ఇంట్లో పనిమనిషి ఉద్యోగం నుంచి.. ఆఫీసులో ఉద్యోగం కోసం వచ్చిన వాడి వరకూ.. అందరినీ మొహమాటం లేకుండా బ్లడ్ గ్రూప్ వివరం ఇక్కడ అడుగుతుంటారట. సదరు బ్లడ్ గ్రూపును బట్టి వారి స్వభావాన్ని అంచనావేశాకే తుదినిర్ణయం తీసుకుంటారు. ఇంతకీ ఏ బ్లడ్ గ్రూపు వారు ఎలా ఉంటారనే దానిపై వారి అభిప్రాయాలేమిటో మనమూ తెలుసుకుందాం.


A: ఈ బ్లడ్ గ్రూపు వారు ( A పాజిటివ్, A నెగెటివ్) సున్నిత మనస్కులుగా ఉంటారు. వీరికి హింస, దౌర్జన్యాలు వంటివి నచ్చదు. ‘సర్దుకుపోతే పోలా..’ అనుకుంటారు. అవతలివారు కాస్త.. పట్టీపట్టనట్లుగా ఉన్నా.. వీరే కలగజేసుకుని మాట్లాడి.. వారితో స్నేహం చేయటంతో బాటు సాయమూ అందిస్తారు. ఇతర బ్లడ్ గ్రూప్‌ల వారికంటే వీరికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువే. వీరికి నాయకత్వ లక్షణాలూ ఎక్కువే. కానీ.. తీవ్రమైన ఒత్తిడిలో, సంక్షోభంలో వీరు ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మాత్రం వీళ్ల వల్ల కానే కాదట.

B: ఈ గ్రూపు వారు (B పాజిటివ్, B నెగెటివ్) తామే అన్నింటా నాయకులం అన్నట్లుగా ప్రవర్తిస్తారట. అయితే.. వీళ్లు ఒత్తిళ్లను, ఆందోళనలను ఎదుర్కొనే శక్తితో బాటు మంచి రోగ నిరోధక శక్తినీ కలిగి ఉంటారు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ఉన్నట్లు కనిపించినా.. వీరు ఇతరుల సహాయం లేకుండా ఏ నిర్ణయమూ తీసుకోలేరు.


AB: ఈ గ్రూపు వారు( AB పాజిటివ్, AB నెగెటివ్) చాలా ఫ్యాషనబుల్‌గా, ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఉంటారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని బాగా కోరుకుంటారు. వీరికి దైవం, ఆధ్యాత్మికత అంటే కూడా చాలా గురి. వీరు చిన్నచిన్న సమస్యలకు తొణకరు.. బెణకరు. ఎంత పెద్ద సమస్య ఉన్నా.. వీరిని నిరుత్సాహం ఆవరించదు. మొత్తం ప్రపంచ జనాభాలో కేవలం 2% నుంచి 5% మాత్రమే ఉన్న ఈ AB బ్లడ్ గ్రూప్ వారు కీలక నిర్ణయాలనూ కూల్‌గా తీసుకుంటారు.

O: ఈ గ్రూపు వారు (O పాజిటివ్,O నెగెటివ్) వీలున్నంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. తమ నాయకత్వ లక్షణాలతో అందరి విశ్వాసాన్ని గెలుచుకుంటారు. వీరు చూసేందుకు సాధారణంగా ఉన్నా.. వీరికి ధైర్యం, తెగింపు చాలా ఎక్కువ. వీరికి స్వతంత్రంగా ఆలోచించే శక్తి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఎక్కువ. అత్యంత అవసరమైతే తప్ప.. నిర్ణయాల విషయంలో వీరు ఎవరినీ సంప్రదించేందుకు ఇష్టపడరు. ఒత్తిళ్లను, ఆందోళనను తట్టుకునే శక్తి వీరికి చాలా ఎక్కువ. అలాగే వీరు మంచి ఆరోగ్యవంతులుగానూ ఉంటారు.

ఎవరు ఎవరికి మిత్రులు?
పై నాలుగు గ్రూపుల్లో A బ్లడ్ గ్రూప్ వారు A, AB బ్లడ్ గ్రూప్ వారితో సన్నిహితంగా ఉంటారట. అలాగే.. B బ్లడ్ గ్రూప్ వారు B, AB బ్లడ్ గ్రూపుల వారితో స్నేహానికి ఇష్టపడతారట. అలాగే.. AB బ్లడ్ గ్రూప్ వారు AB, B, A, O బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు. O బ్లడ్ గ్రూప్ వారు O, AB బ్లడ్ గ్రూపుల వారితో కలిసి నడిచేందుకు ఇష్టపడతారట.

మరి.. ఈ జపాన్ వారి పరిశోధన నిజమో కాదో మీ బ్లడ్ గ్రూపును బట్టి వారు చెబుతున్న విషయాల్లో ఎంత నిజముందో.. మీ బ్లడ్ గ్రూపును బట్టి మీరే నిర్ణయించుకోండి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×