BigTV English

Kakinada Rice Smuggling: నాదెళ్ల సీజ్ చేసిన బియ్యం పోర్ట్‌కి ఎలా వచ్చాయి? కాకినాడ మాఫియాకు లీడర్ అతనే!

Kakinada Rice Smuggling: నాదెళ్ల సీజ్ చేసిన బియ్యం పోర్ట్‌కి ఎలా వచ్చాయి? కాకినాడ మాఫియాకు లీడర్ అతనే!

Kakinada Rice Smuggling:పేదల ఇంట్లో ఉండాల్సిన రేషన్ బియ్యం.. కాకినాడ పోర్టులో కనిపిస్తోంది. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్‌కు పోర్టు అడ్డాగా మారడం.. ఇప్పుడు కలకలం రేపుతోంది. రోజుకు వేల టన్నుల బియ్యం.. అడ్డదారిలో దేశం దాటుతోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ అక్రమ బియ్యం దందా వెనుక బడా కంపెనీలున్నాయా? అసలు.. కాకినాడ పోర్టులో ఏం జరుగుతోంది?


రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కు అడ్డాగా కాకినాడ పోర్టు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదంతా కొత్తేమో గానీ.. కాకినాడ పోర్టులో ఇది నిత్యం జరిగే దందానే. కొన్నేళ్లుగా అక్కడి నుంచి భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఈ రైస్ మాఫియా వెనుక.. పెద్ద నెట్ వర్కే నడుస్తోంది. దాంతో.. కాకినాడ పోర్టు బియ్యం స్మగ్లింగ్‌కు అడ్డాగా మారింది. హోప్‌ ఐలాండ్‌ను అడ్డం పెట్టుకుని బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. ఒక రోజులో ఇక్కడి నుంచి 11 వందల లారీల బియ్యం అక్రమంగా తరలిపోతోందంటే.. స్మగ్లింగ్ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ బియ్యం లారీలను తనిఖీ చేసేందుకు కేవలం 11 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే స్వయంగా చెప్పారు. అంటే.. రేషన్ బియ్యం తరలిపోతుంటే.. ఆపేవారే లేరనే విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ లెక్కన.. బియ్యం మాఫియా ఎంత పెద్ద నెట్ వర్క్ నడుపుతుందో తెలుస్తోంది.


రేషన్ బియ్యం మాఫియాలో 16 కంపెనీలు!

వాస్తవానికి.. పోర్టు ఉన్నది ఎగుమతుల కోసమే గానీ.. స్మగ్లింగ్ కోసం కాదు. కానీ.. బియ్యం మాఫియాలో 16 కంపెనీలు పాలుపంచుకుంటున్నాయ్. ఇందులో.. కింగ్ పిన్ కంపెనీల పాత్ర కీలకంగా ఉందనే ప్రచారం కూడా ఉంది. దీనిని బట్టి.. ఈ రైస్ స్మగ్లింగ్ మాఫియా ఎంతలా వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కిలో రేషన్ బియ్యాన్ని.. 43 రూపాయలకు కొనుగోలు చేసి నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేస్తుంటే.. ఈ బియ్యం మాఫియా ఆఫ్రికా దేశాల్లో అదే బియ్యాన్ని కిలోకు 70 రూపాయలకు పైనే విక్రయిస్తోంది. పీడీఎస్ రైస్.. సముద్రం దాటి వెళ్లిపోయేందుకు తీరప్రాంతంలో మారీటైమ్ పోలీసింగ్ బలహీనంగా ఉండటం మరో కారణమనే వాదనలు కూడా ఉన్నాయ్. అందువల్లే.. రేషన్ బియ్యం యథేచ్ఛగా ఎగుమతి అవుతోందంటున్నారు.

పవన్ టూర్‌తో బయటపడ్డ పోర్టులోని లోపాలు

కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనతో.. మరోసారి ఈ రైస్ స్మగ్లింగ్ దందా హాట్ టాపిక్‌గా మారింది. యాంకరేజీ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో.. 640 టన్నుల బియ్యంతో పాటు.. అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జ్ ఐవీ 0073లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ గుర్తించారు. మొత్తంగా.. ఈ బియ్యం విలువ 6 కోట్ల 64 లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం అడ్డదారిలో కాకినాడ పోర్టు ద్వారా తరలిపోతోందని కలెక్టర్‌కు పక్కా సమాచారం వచ్చింది. వెంటనే.. ఆయన బార్జ్‌లు నిలిపే ప్రాంతం నుంచి పోలీస్, పోర్ట్, మెరైన్, రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారుల బృందంతో కలిసి.. సముద్రంలో ప్రయాణించి స్టెల్లా ఎల్ నౌక దగ్గరకు చేరుకున్నారు. దానిలో.. 38 వేల టన్నుల బియ్యం లోడ్ కాగా.. అందులో 640 టన్నులు పీడీఎస్ బియ్యంగా గుర్తించారు.

రైస్ మాఫియా నెట్‌వర్క్‌ని పెకిలించేందుకు చర్యలు

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై.. కొన్నాళ్లుగా ఏపీలో తనిఖీలు జరుగుతున్నాయ్. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. రెండు నెలల కిందట జరిపిన తనిఖీల్లో సీజ్ చేసిన బియ్యాన్ని.. ఇటీవలే బ్యాంక్ గ్యారెంటీతో విడుదల చేశారు. ఇప్పుడు పట్టుబడ్డ బియ్యం నిల్వలు అప్పటివేనా? లేక.. లెక్కల్లోకి రాని వేరే నిల్వలా? అనేది.. తేలాల్సి ఉంది. నౌకలో ఉన్న 640 టన్నుల బియ్యానికి సంబంధించి.. 22 ఎగుమతి కంపెనీల రశీదులున్నట్లు తెలుస్తోంది. బార్జ్ ఐవీ 0073 నౌకలో ఉన్న 1064 టన్నుల బియ్యం.. మరో రెండు కంపెనీలకు చెందినదిగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా లక్షల్లో జరుగుతున్నది కాదు. దీని వెనుక వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. దీని వెనుక.. పెద్ద వాళ్లున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే.. ఈ ఎగుమతులు సక్రమంగా జరిగితే రాష్ట్ర ఖజానాకు ఎంతో డబ్బు వచ్చి చేరేది. మరోవైపు.. రేషన్‌ బియ్యం నిల్వలపై ప్రతి జిల్లాలో తనిఖీలు చేస్తున్నారు.

వేల కోట్లలో బియ్యం అక్రమ రవాణా దందా

నిజానికి.. రేషన్ రైస్ మాఫియా.. ప్రజల దగ్గర్నుంచి కిలోకు 10 రూపాయలు చెల్లించి బియ్యం కొంటుంది. దానిని.. డబుల్ రేటుకు మరొకరికి విక్రయిస్తారు. అలా.. చేతులు మారుతూ వచ్చిన బియ్యం వయా కాకినాడ పోర్టు మీదుగా పశ్చిమ ఆఫ్రికా దేశాలకు తరలిపోతోంది. అక్కడ.. కిలో రేషన్ బియ్యాన్ని 70 రూపాయలకు పైనే విక్రయిస్తున్నారంటే.. ఈ అక్రమ దందా ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు.. వేల టన్నుల్లో బియ్యం సముద్రం మీదుగా స్మగ్లింగ్ అవుతోందంటే.. పోర్టులో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా.. తీరప్రాంతంలో ఏమాత్రం భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది.. దేశ భద్రతకే తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. కాకినాడ పోర్టు నుంచి చాలా సులువుగా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు.. భవిష్యత్తులో పేలుడు సామాగ్రి, మత్తు పదార్థాలు దిగుమతి కావనే గ్యారంటీ ఏంటనే.. ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Also Read: గొప్ప‌మ‌న‌సు చాటుకున్న సీఎం చంద్ర‌బాబు.. క‌ష్టం చెప్పుకున్న 2 నిమిషాల్లోనే రూ.2 ల‌క్ష‌ల సాయం

కాకినాడ పోర్టు గుండా వేల టన్నుల రేషన్ బియ్యం.. అక్రమంగా తరలిపోతోందనే విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా.. అక్కడ పనిచేసే అధికారులకి! అన్నీ తెలిసి కూడా.. అధికారులు ఎందుకు ఈ రైస్ స్మగ్లింగ్‌ని అడ్డుకోవడం లేదనేదే.. ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషయంలోనూ.. అధికారులు స్పందించిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. కంటికి కనిపిస్తున్న దానిని మించి.. పోర్టులో ఏదో జరుగుతోందనే డౌట్స్ కూడా వస్తున్నాయ్.

రేషన్ స్మగ్లింగ్ వయా కాకినాడ పోర్ట్

అధికారంలోకి రాకముందే.. కాకినాడ పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై.. పవన్ కల్యాణ్ గళమెత్తారు. ఇప్పుడు.. డిప్యూటీ సీఎం అయ్యాక.. ఈ విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్నారు. తమ పార్టీకి చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో.. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో.. రేషన్ మాఫియా, వారికి సహకరిస్తున్న అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. పవన్ గనక కాకినాడ పోర్టుకు వస్తే విషయం పెద్దది అవుతుందని భావించిన అధికారులు.. తనని రానివ్వకుండా ఎన్నో విధాలుగా ప్రయత్నించారని ఆయనే స్వయంగా చెప్పారు. దాంతో.. ఓ డిప్యూటీ సీఎంనే అడ్డుకునే స్థాయిలో అధికారులు, రేషన్ మాఫియా ఉందనే చర్చ సాగుతోంది.

పది వేల మంది ఉపాధి పోతుందన్న అధికారులు

కాకినాడ పోర్టుకు పవన్ వస్తే 10 వేల మంది ఉపాధి పోతుందని అధికారులు చెప్పడం చూస్తుంటే.. అక్కడ ఏ స్థాయిలో అక్రమ దందా జరుగుతోందో.. ఊహించుకోవచ్చు. ఎన్ని రకాలుగా పవన్ కల్యాణ్‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. చివరికి ఆయన రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. దాంతో.. కాకినాడ పోర్టులోని లోపాలన్నీ బయటపడ్డాయి. షిప్‌ని కూడా సీజ్ చేయాలని పవన్ ఆదేశించారు.

అక్రమదందా అధికారులకు తెలిసే జరుగుతోంది..!

ఒక్క అధికారి దగ్గర కూడా సమాధానం లేదు. అంటే.. ఈ దందా అంతా వాళ్లకు తెలిసే జరుగుతోంది. అంతేకాదు.. రోజుకు వెయ్యి లారీలు వచ్చే పోర్టుకు.. కేవలం 16 మందితో భద్రత కల్పించడం కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. పోర్టుకు వెళ్తున్న లోడ్‌ని చెక్ చేసే యంత్రాంగం కూడా అక్కడ లేదంటున్నారు. ఈ పరిస్థితులపై.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానన్నారు పవన్ కల్యాణ్. బియ్యం స్మగ్లింగ్ మాఫియా నెట్‌వర్క్‌ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ పోర్టులో సెక్యూరిటీ ఇంత వీక్‌గా ఉంటే.. భవిష్యత్‌లో ఆర్డీఎక్స్, ఆయుధాలు, డ్రగ్స్ కూడా దిగుమతి అయ్యే అవకాశం ఉందన్నారు. అసలే.. రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కి కేంద్రంగా ఉందని.. ఇప్పటికే కాకినాడ పోర్టు నుంచి ఎంత డ్రగ్స్ ఎగుమతి, దిగుమతి అయ్యాయో తెలియదన్నారు.

రెండు మూడు నెలల్లో బియ్యం అక్రమ రవాణాకు చెక్

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై పవన్ చర్యలు సరైనవేనని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. 2, 3 నెలల్లోనే.. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడతామని.. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ సుధీర్ కూడా చెబుతున్నారు. మరోవైపు.. ఎగుమతులు ఆపితే కాకినాడ పోర్టులో కార్మికుల ఉపాధి దెబ్బతింటుందనే చర్చ జరుగుతోంది. అందువల్ల.. కింది స్థాయిలో జరిగే రేషన్ మాఫియాను అరికడితే.. పీడీఎస్ బియ్యం కాకినాడ పోర్టు దాకా రావంటున్నారు కార్మిక సంఘాల నాయకులు. ఇప్పుడు చర్యలు చేపడితే.. వేలాది మంది కార్మికులు నష్టపోతారని చెబుతున్నారు. నిజానికి.. ప్రతి నెలా రేషన్ బియ్యం తెచ్చుకొని తినే కుటుంబాల సంఖ్య చాలా తక్కువ శాతంలో ఉంటుంది. ఇంకొందరు రేషన్ షాపుల నుంచి తెచ్చుకున్నా.. వాటిని కిలోకు 10 రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు. రేషన్‌లో బియ్యం తెచ్చుకునే ఇష్టం లేని వాళ్లంతా.. రేషన్ డీలర్ల దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నారు. దాంతో.. వాళ్లు వద్దనుకున్న బియ్యం ఇలా అక్రమ రవాణా చేస్తున్నారు.

కొన్ని నెలల్లో 51 వేల టన్నుల రేషన్ బియ్యం సీజ్

అలా.. టన్నుల్లో కలెక్ట్ చేసిన బియ్యాన్ని.. ఇలా పోర్టుల ద్వారా దేశం దాటించేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అక్రమంగా తరలిస్తున్న 51 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారంటే.. ఏ స్థాయిలో బియ్యం స్మగ్లింగ్ దందా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.ఈ రేషన్ బియ్యం స్మగ్లింగ్‌ని అరికట్టాలంటే.. రెండే రెండు మార్గాలున్నాయ్. ఒకటి.. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం. రెండోది.. రేషన్ బియ్యం వద్దనుకున్న వాళ్లకు బియ్యానికి బదులుగా డబ్బులు పంపిణీ చేయడం. ఈ రెండూ చేస్తేనే.. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా దందాకు చెక్ పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రేషన్ బియ్యాన్ని కిలోకు రూ.40 వెచ్చించి కొంటున్న ప్రభుత్వం

ఎందుకంటే.. రేషన్‌ ద్వారా వచ్చే బియ్యం నాణ్యత లేకపోవడం వల్లే.. ప్రజలు వాటిని అమ్ముకుంటున్నారనే చర్చ ఉంది. అందువల్ల.. వాటి స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేస్తే జనం వాటిని అమ్మేందుకు ఇష్టపడరు. అలాకాని పక్షంలో.. ఎలాగూ రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం కిలోకు 40 రూపాయలకు పైనే వెచ్చించి కొంటోంది. ఆ డబ్బులనే పేదలకు పంచితే వాళ్లకు నచ్చిన బియ్యాన్ని కొనుక్కుంటారు. ఇప్పటికే.. కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. అప్పుడే రేషన్ షాపుల దగ్గరే ఈ స్మగ్లింగ్‌కు చెక్ పడుతుంది. లేనిపక్షంలో.. రేషన్ బియ్యం ఇలా పోర్టుల దాకా చేరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×