Cm Chandrababu: కష్టం చెప్పుకున్న వెంటనే ఓ కుటుంబానికి సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.2 లక్షల ఆర్థికసాయం అందించారు. ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఓ ఇంటికి వెళ్లారు. అక్కడ వారితో ఇంట్లో కూర్చుని టీ తాగుతున్న సమయంలో మహిళ తన కష్టాన్ని చెప్పుకుంది. తన తమ్ముడు తనను చాలా బాగా చూసుకుంటాడని కానీ అతని కూతురుకు గుండె సమస్య వచ్చిందని చెప్పింది.
దీంతో తన రూ.15వేల ఫించన్ డబ్బులను అమ్మాయి గుండె సమస్య కోసం ఖర్చు చేసినట్టు తెలిపింది. డబ్బులు లేక తన తమ్ముడు అప్పులపాలు అయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. బెంగుళూరులో అమ్మాయికి గుండె ఆపరేషన్ జరిగినట్టు తెలిపింది. గుండె ఆపరేషన్ కు సంబంధించిన ఫైల్స్ ను చంద్రబాబుకు చూపించింది. దీంతో ఫైల్స్ పరిశీలించిన సీఎం వెంటనే తక్షణసాయం అందించి గొప్పమనసు చాటుకున్నారు.
Also read: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన మద్యం ధరలు!
సీఎం వెంటనే డబ్బులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ కుటుంబం ఎమోషనల్ అయింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత సీఎం చంద్రబాబు గతంలో కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. ఇంటికే వెళ్లి ఫించన్లను పంపిణీ చేస్తూ వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ఇక సాధారణంగా నాయకులు వచ్చినప్పుడు ఏదైనా సాయం కోసం అడిగినా, సమస్య చెప్పుకున్నా పరిష్కరించాలంటే అధికారులకు చెప్పాలంటూ వాళ్లకు చెబుతారు.
లేదంటే అప్పుడు సమస్య తీరుస్తాం.. ఇప్పుడు సమస్య తీరుస్తాం.. అంటూ హామీలు ఇచ్చి వెళ్లిపోతుంటారు. ఆ తరవాత సమస్య తీరిందా లేదా? అని చూసే నాదుడు కూడా ఉండరు. కానీ ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇలా అడగగానే అలా సాయం చేయడంతో ఆ కుటుంబం మనసును దోచుకోవడమే కాకుండా ప్రజలందరి మనసునూ దోచుకున్నారు.
సమస్య విన్న వెంటనే స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ కూడా ఇదే విధంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా తమ సమస్య చెబుతూ నారాలోకేష్ ను ట్యాగ్ చేశారంటే వెంటనే ఆయన బదులిస్తూ అధికారులను ట్యాగ్ చేసి వారి సమస్య తీర్చాలంటూ సూచిస్తున్నారు.