BigTV English
Advertisement

Student Fraud Hotel: దేశముదుర్లు.. 5 స్టార్ హోటళ్లలో పట్టపగలు దోపిడి.. టికెట్ లేకుండా విమాన ప్రయాణం

Student Fraud Hotel: దేశముదుర్లు.. 5 స్టార్ హోటళ్లలో పట్టపగలు దోపిడి.. టికెట్ లేకుండా విమాన ప్రయాణం

Student Fraud Hotel| డబ్బుల సంపాదించడానికి తప్పుడు మార్గాల్లో తెలివితేటలు ఉపయోగించడంలో ఈ కాలంలో ఒకరిని మించిన వారు మరొకరు కనిపిస్తున్నారు. తాజాగా ఒక విద్యార్థి తన కాలేజీ ఫీజు చెల్లించడానికి తన వద్ద డబ్బులు లేక మోసాలు చేయడం మొదలు పెట్టాడు. ఆ తరువాత అతనికి అదే అలవాటుగా మారిపోయింది. అతను అందరూ చూస్తుండగానే పట్టపగలు నిలువునా దోపిడీలు చేసేవాడు. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ లోకి వెళ్లి అక్కడి యజమాన్యాన్ని బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. అలా దాదాపు 63 హోటళ్లలో ఒకే ఐడియాతో లక్షలు దోచుకున్నాడు.


సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. చైనా దేశంలోని జేజియాంగ్ రాష్ట్రాంలో తాయిజౌ ప్రాంతానికి చెందిన జియాంగ్ అనే 21 ఏళ్ల యువకుడు కాలేజీలో చదువుకుంటన్నాడు. అయితే సెప్టెంబర్ 2023లో అతని వద్ద కాలేజీ ఫీజు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతనికి మోసం చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన వచ్చింది. జియాంగ్ వెంటనే తన బ్యాగులో కొన్ని బట్టు సర్దుకొని ఒక 5 స్టార్ హోటల్ కు వెళ్లాడు. అక్కడ ఒక గది అద్దెకు తీసుకొని కొన్ని గంటలపాటు ఉన్నాడు. ఆ తరువాత సాయంత్రం హోటల్ యజమాన్యానికి పిలిచి తన గది అపరిశుభ్రంగా ఉందని చూపించాడు. ఆ గదిలో చనిపోయిన బొద్దింకలు, వాడేసిన కండోమ్‌లు, రూమ్ నిండా అక్కడక్కడా వెంట్రకలు ఉన్నట్లు చూపించాడు.

Also Read:  69 ఏళ్ల నకిలీ ఐపిఎస్ ఆఫీసర్.. అమిత్ షా సలహాదారుడిగా చలామణి.. ఎలా చేశాడంటే


దీంతో ఆ హోటల్ మేనేజర్ అతనికి “సారి సార్ వెంటనే క్లీన్ చేయించి ఇస్తాం” అని చెప్పినా జియాంగ్ వినలేదు. అతను తన మొబైల్ ఫోన్ తీసి మొత్తం కాక్‌రోచ్‌లు, వాడేసిన కండోమ్‌లు ఉండేదంతా వీడియో తీశాడు. ఈ వీడియోని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని.. మీ హోటల్ వల్ల కస్టమర్లకు ఆరోగ్య సమస్యలు వస్తాయని రివ్యూలు ఇస్తానని బెదిరించాడు. దీంతో హెటల్ మేనేజర్ వెంటనే జియాంగ్ తో కాళ్లబేరానికి వచ్చాడు. తమ హోటల్ పరువు పోతుందని అలా చేయవద్దని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జియాంగ్ తనకు భారీ మొత్తంలో డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఆ హోటల్ మేనేజర్ వెంటనే వెళ్లి జియాంగ్ అడిగినంత డబ్బుల తెచ్చి ఇచ్చాడు. జియాంగ్ సంతోషంగా ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు.

ఈ ఐడియా బాగుందని జియాంగ్ అనిపించింది. దీంతో వెంటనే నగరంలోని అన్ని హోటల్స్ పై ఒకటి తరువాత మరొకటి ఇలానే విరుచుకుపడ్డాడు. ప్రతి హోటల్ కు వెళ్లడం అక్కడ తన వెంట తీసుకొని వచ్చిన చనిపోయిన బొద్దింకలు, వెంట్రకలు, కండోమ్ లు పడేసి హోటల్ శుభ్రంగా లేదని హోటల్ యజమాన్యంపై కేసు వేస్తానని బెదిరించేవాడు. అలా దాదాపు 63 హోటల్స్ లో దోపిడీ చేశాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఒకే రోజు నాలుగు హోటల్స్ కు వెళ్లేవాడు. కానీ ఇటీవల ఒక హోటల్ లో వెళ్లినప్పుడు అక్కడి మేనేజర్ కు జియాంగ్ పై అనుమానం వచ్చింది. అందుకే వెంటనే సిసిటివి వీడియోలో చూడగా.. జియాంగ్ ఇదంతా కావాలని చేసినట్లు కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు పిలిచి జియాంగ్ ను బ్లాక్ మెయిల్ చేసినందుకు అరెస్టు చేయించాడు.

ఇలాంటిదే మరో కేసు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. అక్కడ ఒక యువతి న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నెడి ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్రాన్స్ దేశంలోని పారిస్ నగరానికి వెళ్లడానికి ఒక విమానంలోకి బోర్డింగ్ పాస్ లేకుండానే ప్రవేశించింది. అంటే ఆమె టికెట్ లేకుండా ఎయిర్ పోర్ట్ లోపలికి వచి.. సెక్యూరిటీ చెకింగ్ ని కూడా దాటేసింది. చివరికి విమానంలోకి ప్రవేశించడానికి ముందు అవసరమయ్యే బోర్డింగ్ పాస్ కూడా లేకుండానే లోపలికి వెళ్లిపోయింది.

అయితే లోపలికి వెళ్లిపోయాక విమానం అంతా సీట్లు ఫుల్ అయ్యాయి. దీంతో ఆమె కూర్చోవడానికి స్థలం లేకుండా పోయింది. ఇదంతా లోపల ఒక ఎయిర్ హోస్టెస్ గమనించింది. ఆమె ఎందుకు ఒక చోట కూర్చోవడం లేదో ఆ ఎయిర్ హోస్టెస్ కు అర్థంకాలేదు. బహుశా ఆమె తన సీటు నెంబర్ మరిచిపోయిందేమోనని వెళ్లి అడిగింది. కానీ ఆ యువతి తన దొంగతనం దొరికిపోతుందేమో అనే భయంతో ఏమీ చెప్పకుండా దూరంగా వెళ్లిపోయింది. కాసేపటి తరువాత చూస్తే.. ఆ యువతి విమానంలో కనిపించలేదు. దీంతో అన్ని సీట్లు వెతికినా అన్నీ ఫుల్ గానే ఉన్నాయి. దీంతో ఆ ఎయిర్ హోస్టెస్ కు అనుమానం వచ్చి తోటి సిబ్బందితో చెప్పింది. అప్పుడు అందరూ కలిసి ఆమెకోసం విమానంలో వెతికారు.. చివరికి విమానంలోని చివరగా ఉన్న టాయిలెట్ లోపల ఆమె దాక్కని లాక్ చేసుకొని ఉన్నట్లు తెలిసింది.

ఈ కారణంగా విమానం ల్యాండింగ్ కాగానే పైలట్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పిలిచాడు. పోలీసులు విమానం లోపలికి వచ్చి ఆమెను అరెస్టు చేశారు.

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×