E-Paper
Advertisement

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!
Advertisement
AP Drought: ఏపీలో ఒకవైపు కరువు కాటు మరోవైపు పెట్టుబడుల జోరు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కేంద్ర సాయం కోసం ఢిల్లీ బాట పట్టారు సీఎం చంద్రబాబు. 21 జిల్లాల్లో కరువు ప్రకటించిన వేళ విశాఖలో దాదాపు 25 వేల కోట్ల పెట్టుబడులు రావడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికల  వేడి..మరోవైపు వర్షాభావ  పరిస్థితులతో కరువు దాడి జూన్ నుంచి ఆగస్టు వరకు ఏపీలో  సాధారణం కంటే 53.4 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. పంటలు ఎండి రైతులు పరిస్థితి దైన్యంగా మారింది.  ఈ క్రమంలో  26 జిల్లాల్లో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది ప్రభుత్వం.

గోదావరి పుష్కరాలు..  

అన్నదాతలను ఆదుకునేందుకు  ఏపీ ప్రభుత్వం కేంద్ర సాయం కోరింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. గోదావరి పుష్కరాలు, పోలవరం సహా ఏపీలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రధానికి వివరించారు. అంతకు ముందు  ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌. జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సహా పలువురు కేంద్రమంత్రులతో   సమావేశమయ్యారు చంద్రబాబు. కరువు పరిస్థితుల దృష్ట్యా ఏపీకి  ప్రత్యేక ఆర్థిక సాయం, నదుల అనుసంధానం, గోదావరి జలాలను వినియోగం, విశాఖ మెట్రో, బీచ్ కారిడార్ వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు సీఎం చంద్రబాబు.

పెట్టుబడులకు ఒప్పందాలు..

కరువు పరిస్థితుల నుంచి గట్టెక్కడంతో పాటు పెట్టుబడులపై  ప్రత్యేక దృష్టిసారించింది ఏపీ ప్రభుత్వం. IIM విశాఖలో జరిగిన తొలి రీజినల్ కాన్ఫరెన్స్‌లో 31 MoUs ద్వారా 21 వేల 498 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వీటితో దాదాపు 57 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది ప్రభుత్వం. మరో 3 వేల 519 కోట్ల విలువైన 33 ప్రాజెక్టులు  కూడా త్వరలో వస్తాయని ప్రకటించింది.
Tags

Related News

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×