E-Paper
Advertisement

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం
Advertisement

Botsas Family: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స అంటే ఒక బ్రాండ్. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్‌సీపీ వరకు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో బొత్స సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు. ఆయన కుటుంబం నుంచి ఝాన్సీ లక్ష్మి, అప్పలనరసయ్య, అప్పలనాయుడు లాంటి వాళ్లు కూడా రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టారు. ఇప్పటివరకు సీనియర్లతో కనిపించిన బొత్స పొలిటికల్ ఫ్యామిలీ ఇప్పుడు సెకండ్ జనరేషన్‌తో కొత్త ఫేజ్‌లోకి అడుగుపెడుతోంది.

చీపురుపల్లిపై ఫోకస్..

ఇప్పటికే బొత్స అనూషకు భీమిలి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది పార్టీ. ఇటీవలే ఆమె బాధ్యతలు స్వీకరించి కార్యకర్తలు, స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే ఇక తెరవెనుక వ్యూహాలు కాదు. డైరెక్ట్‌గా పొలిటికల్ ఫీల్డ్‌లోనే అనూష యాక్టివ్ అయినట్లుగా తేలిపోయింది. మరోవైపు బొత్స కుటుంబం నుంచి మరో యంగ్ ఫేస్ బొత్స సందీప్ కూడా విజయనగరం రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారన్న చర్చ నడుస్తోంది. తండ్రి సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిపై ఫోకస్ పెట్టడంతో సీనియర్‌కు తోడుగా జూనియర్ కూడా గ్రౌండ్‌లోకి వస్తున్నారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజలతో మమేకం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ఇదే ఇప్పుడు బొత్స నెక్స్ట్ జనరేషన్ పొలిటికల్ ఫార్ములాగా కనిపిస్తోంది.

Advertisement

Also read: ట్రంప్‌కు బంగారు విగ్రహం.. కానీ, బట్టల్లేకుండా.. ఏందయ్యా ఇది?

2029 టార్గెట్..

అయితే రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ ఇవ్వడం ఒక ఎపిసోడ్ అయితే ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోవడం మరో అసలు పరీక్ష. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీలో రాజకీయంగా మారుతున్న సమీకరణాల మధ్య బొత్స కుటుంబం కూడా తమ క్యాడర్‌ను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. సీనియర్ అనుభవం యువతరం అడుగులు.. బొత్స కుటుంబానికి ఇది పొలిటికల్ జనరేషన్ షిఫ్ట్. భీమిలిలో కుమార్తె అనూష బాధ్యతలు విజయనగరంలో కుమారుడు సందీప్ యాక్టివ్ పాలిటిక్స్.. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ 2029 టార్గెట్.. ఈ ఎంట్రీలు ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలే తేల్చనున్నాయి.

Advertisement

Also read: సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

Tags

Related News

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×