E-Paper
Advertisement

జీహెచ్ఎంసీలో జీఐఎస్ సర్వేకు బ్రేక్.. ఆ రూ. 22 కోట్లు ఏమైనట్టు?

జీహెచ్ఎంసీలో జీఐఎస్ సర్వేకు బ్రేక్.. ఆ రూ. 22 కోట్లు ఏమైనట్టు?
Advertisement

GHMC GIS: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీలో దుబారా, ఇష్టారాజ్యంగా చెల్లింపులు కొనసాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లులు చెల్లించిన పనులకు డబుల్ బిల్లులు చెల్లించి బల్దియా ఖజానాకు రూ. 136 కోట్ల కన్నం వేసిన అధికారులు తాజాగా ప్రాపర్టీలకు జియోగ్రాఫికల్ సర్వే అంటూ మరో అక్రమానికి తెర తీశారన్న వాదనలున్నాయి. జీహెచ్ఎంసీలోకి కోర్ అర్బన్ రీజియన్ పరిదిలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి ముందు జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాపర్టీల నుంచి ట్యాక్స్ ను పెంచుకునేందుకు నియోజియో సంస్థ ద్వారా నిర్వహించిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) సర్వే మూలన పడింది.

కమర్షియల్ ప్రాపర్టీలకు..

సుమారు రెండు దశాబ్దాల క్రితం కేవలం కమర్షియల్ ప్రాపర్టీలకు మాత్రమే ట్యాక్స్ ను పెంచిన జీహెచ్ఎంసీ ఆ తర్వాత రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు ఏ మాత్రం ట్యాక్స్ పెంచలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో అప్పటి వరకున్న సుమారు 19.50 లక్షల ఆస్తులకు ఈ సర్వేను ప్రారంభించారు. వీటిలో సుమారు 2.47 ఆస్తులు కమర్షియల్ ఆస్తులు కాగా, మిగిలిన ఆస్తులన్నీ రెసిడెన్షియల్ ఉన్నాయి. సుమారు 18 నెలల వ్యవధిలో ఈ సర్వే పూర్తి చేయాలని దాదాపు రూ. 22 కోట్లతో నియోజియో సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సర్వే మొదలైన కొత్తలో రకరకాలుగా ప్రజల్లో అపోహాలు వచ్చినా, వాటిన్నంటిని జీహెచ్ఎంసీ అధికారులు వివరణ ఇస్తూ సర్వేను ముందుకు తీసుకెళ్లారు.

18 నెలల గడువు..

Advertisement

మూడేళ్ల క్రితం 2023 జూలై మాసంలో మొదలైన ఈ సర్వే పూర్తి చేసేందుకు నియోజియో సంస్థకు 18 నెలల గడువు విధించినా, ఇప్పటివరకు ఎన్ని ఆస్తులకు సర్వే పూర్తయిందన్న విషయంపై అధికారులు మౌనం వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అన్ని రకాల సేవలను మరింత వేగవంతంగా అందించటంతో పాటు మొత్తం సిటీని స్కాన్ చేసి వివరాలను సేకరించేందుకు చేపట్టిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) సుమారు 40 శాతం వరకు కంప్లీట్ అయినట్లు చెప్పకున్న అధికారులు ఆ తర్వాత సర్వే విషయాన్ని ప్రస్తావించేందుకు కూడా ఇష్టపడటం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా అధికారులు వేగవంతంగా స్పందించి నేరుగా వెళ్లి సేవలు అందించే వీలు కలుగుతుందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు వంటివి కబ్జాలకు గురికాకుండా నిఘా ఉంటుందని కూడా తెలిపారు.

సర్వే నుంచి తప్పుకున్న నియోజియో…రూ.22 కోట్ల ఏమైనట్టు?

రెండేళ్ల క్రితం నియోజియో సంస్థ ద్వారా ప్రారంభించిన ఈ సర్వేను మొత్తం నగరంలోని 19లక్షల 50 వేల ఆస్తులకు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 18 నెలల్లో ఈ సర్వేను పూర్తి చేయాలన్న ఒప్పందం కూడా కుదుర్చుకున్న జీహెచ్ఎంసీ ఇందుకు రూ.22 కోట్లను వెచ్చించనుంది. సర్వే మొదలైన మొదటి 10 నెలల్లో సుమారు 9 లక్షల ఆస్తులకు సర్వే పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ డాకెట్లలోని సమాచారం ప్రకారం మొత్తం 19లక్షల 50 వేల ఆస్తులకు ఈ సర్వేను నిర్వహించాల్సి ఉండగా, సుమారు 40 శాతం ఆస్తులకు సర్వే పూర్తయిన తర్వాత నియోజియో సంస్థ అర్థాంతరంగా సర్వే నుంచి తప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సర్వే ఎంత వరకు నిర్వహించింది? సర్వే కోసం చెల్లించిన రూ. 22 కోట్లు మొత్తం చెల్లించారా? లేక చేసిన సర్వేకు సంబంధించిన వ్యయాన్ని చెల్లించారా? అన్న విషయంపై అధికారులకు క్లారిటీ లేదు.

Advertisement

Also read: జబర్దస్త్ ఆర్టిస్టుల కారుకు యాక్సిడెంట్.. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే!

ఇష్టారాజ్యంగా ప్రాపర్టీల వినియోగం

జీహెచ్ఎంసీ మూడు ముక్కలుగా పునర్విభజన చెందక ముందున్న జీహెచ్ఎంసీ పరిధిలో అధికారుల వద్దనున్న లెక్కల ప్రకారం మొత్తం 19.50 ఆస్తులుండగా, అందులో కేవలం 2.47 లక్షల ఆస్తులు మాత్రమే కమర్షియల్ గా వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను గమనిస్తే దాదాపు సగం వరకు అంటే సుమారు 9 లక్షల ఆస్తుల్లో కమర్షియల్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. మూడు ముక్కలుగా విభించిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెన్స్ నెంబర్లు (పీటీఐఎన్ )లు సుమారు 11 లక్షలకు తగ్గాయి.

సర్వేకు ఎందుకు బ్రేక్..

వీటిలో విలీన ప్రాంతాల్లోని ప్రాపర్టీ పై సర్వే నిర్వహిస్తే రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని నిర్మించిన భవనాల్లో కమర్షియల్ కార్యకలాపాలు బయట పడుతాయని, వాటిని కూడా కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకువస్తే జీహెచ్ఎంసీకి అదనంగా పన్ను వసూలయ్యే అవకాశమున్నా, ఆ దిశగా సర్వే నిర్వహించాల్సిన అధికారులు సర్వేకు ఎందుకు బ్రేక్ వేశారన్నది చర్చనీయాంశంగా మారింది. చాలా నివాసాల్లో కింద కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగుతుండగా, పై అంతస్తుల్లో ఆఫీసులు, వంటి ఇతరాత్ర కమర్షియల్ వినియోగం జరుగుతున్నట్లు అధికారులు కూడా సర్వే జరుగుతున్న సమయంలో గుర్తించారు.

రూ. 130 కోట్ల వరకు..

కొన్ని ఆస్తులకు సంబంధించిన ట్యాక్స్ ను రీ అసెస్ మెంట్ చేయగా, జీహెచ్ఎంసీ సుమారు రూ. 130 కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ పెరిగింది. చాలా సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్మాణ అనుమతుల ప్రకారం నిర్మితమైన భవనాలపై ఇటీవలే నిర్మించిన అదనపు అంతస్తులు, రెసిడెన్షియల్ వినియోగంలో ఉండి, ఇపుడు కమర్షియల్ యూసేజీలో ఉన్న భవనాలను గుర్తించి, వాటిని ట్యాక్స్ అసెస్ మెంట్ పరిధిలోకి తీసుకురావటంతో కూడా ట్యాక్స్ పెరిగిందని చెప్పవచ్చు.

పాత భవనాల్లో..

ఈ సర్వేతో చాలా ప్రాంతాల్లోని భవనాల్లోని అదనపు అంతస్తులు కూడా గుర్తించి, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించటం లేదన్న విషయాన్నిగుర్తించి, అలాంటి భవనాలను కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకువచ్చారు. పాత భవనాల్లో చేపట్టిన అనధికార, అదనపు అంతస్తులను ఈ సర్వే ఆధారంగా ట్యాక్స్ పరిధిలోకి తీసుకువచ్చారు. చాలా కాలంగా ట్యాక్స్ సిబ్బంది గుర్తించని ఇలాంటి అక్రమ, అదనపు నిర్మాణాలను సర్వేతో గుర్తించి ట్యాక్స్ పరిధిలోకి తీసుకువస్తూ నిర్వహించిన ఈ సర్వే ను అధికారులు అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారన్నది అంతు చిక్కకుండా ఉంది.

Also Read: పోలీస్ వరుడి కట్నం కక్కుర్తి.. బ్రెజ్జా కారు లేదని పెళ్లి క్యాన్సిల్.. మండపం నుంచి యూటర్న్!

Tags

Related News

దేశవ్యాప్తంగా బీజేపీ ‘సేవా దూత్’ ప్రచారం.. చేయబోయే కార్యక్రమాలివే?

నిజామాబాద్‌లో నితిన్‌ నబీన్‌ పాదయాత్ర రద్దు! బండి సంజయ్‌ ప్రకటించిన తేదీనే అర్వింద్‌ కూడా! ‘బండి’కే ఓటేసిన అధిష్టానం..!

కాంగ్రెస్‌ పెంచిన పింఛన్లపై విమర్శలు! పాతవి తొలగించి కొత్తవి ఇచ్చారని ప్రచారం..! కేసీఆర్‌ వస్తే 4వేలు ఇచ్చేవారని కామెంట్స్‌..!

పెనం మీద నుంచి పొయ్యిలోకి నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌! నేతల తీరుతో అధిష్టానానికి తలవంపులు..! మాజీ మంత్రి కామెంట్స్‌తో తీవ్ర చర్చ

జెన్‌జీని తక్కువ అంచనా వేశా! జంతర్‌ మంతర్‌ తరువాత వారి శక్తిని కళ్లారా చూసినా..! నేతలెవరూ వారితో పెట్టుకోవద్దని తెలుసుకున్నా!

నా పాలనకు వందకు 60 మార్కులు.. రెండేళ్లలో మరిన్ని మార్కులు సాధిస్తానని నమ్మకం ఉంది..! సంక్షేమ పథకాలపై చర్చోపచర్చలు!

మాటకు మాట.. సీఎం సభ తరువాత ఆ ఇద్దరూ స్పందిస్తున్న వైనం..! కలిసి తిప్పికొట్టే వ్యూహంతో ముందుకు..!

Big Stories

Advertisement
×