EX MD Venkat Reddy: వైపీపీ ప్రభుత్వంలో గనుల దోపిడీ, ఇసుక దందాల్లో కీలకం వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనింగ్ వెంకటరెడ్డి గుట్టు చప్పుడు కాకుండా బెయిల్‌పై విడుదలయ్యారు. వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయనకు విచారణ పూర్తి కాకుండానే బెయిల్ దక్కడం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర అభియోగాలున్న కేసులో ఆయనకు బెయిల్ ఎలా వచ్చింది?.. ఆయన బెయిల్ పిటీషన్‌పై ఏసీబీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అధికార యంత్రాంగంలో ఇంకా వైసీపీ పట్ల స్వామిభక్తి తగ్గలేదా? అన్న వాటిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా జైలు నుంచి విడుదల
వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లూ చేసిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డికి బెయిలు వచ్చేసింది. 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిలు మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. దాతో రాత్రిపూట ఆయన గుట్టుచప్పుడు కాకుండా విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
50 రోజుల్లోనే బయటకొచ్చిన గనుల ఘనుడు
జగన్ ప్రభుత్వంలో గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఏపీఎంఎంసీ నిబంధనలు, ఆపరేషన్స్, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో వెంకటరెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయన్ని సెప్టెంబరు 26న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. 27న ఏసీబీ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండు విధించారు. ఆ తర్వాత రిమాండు పొడిగించారు. అయితే ఈ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన 50 రోజుల్లోనే ఆయన జైలు నుంచి బయటకొచ్చారు.
50 రోజుల్లోనే బయటకొచ్చిన గనుల ఘనుడు
అవినీతి నిరోధక చట్టం, మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. జగన్ ఏలుబడిలో ఇసుక విధానం ముసుగులో 2 వేల566 కోట్ల మేర దోపిడీ జరిగినట్లు తేల్చారు. ఈ కుంభకోణానికి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని గుర్తించారు. వెంకటరెడ్డిని రెండు విడతలుగా కస్టడీకి తీసుకుని ఏసీబీ విచారించింది. ఈ కుంభకోణం వెనక ఉన్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. 2 వేల 600 కోట్ల దోపిడీకి మూలం ఎక్కడుంది? సూత్రధారులెవరు? ఎవరి ఆదేశాల మేరకు ఈ అక్రమాలకు పాల్పడ్డారనేదానిపై ప్రశ్నలు సంధించింది. అయితే వెంకటరెడ్డి విచారణకు ఏ మాత్రం సహకరించలేదు. తనకేమీ తెలియదని, గుర్తులేదని సమాధానమిచ్చారు. ఏ కీలక ప్రశ్నకూ సమాధానమివ్వలేదు. ఆయన నుంచి ముఖ్యమైన సమాచారం రాలేదు. కానీ ఇంతలోనే ఆయన బెయిల్‌పై బయటకొచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: మళ్లీ మొదలు పెట్టారు.. అడ్డంగా బుక్కైన ముద్రగడ పద్మనాభం
రూ 2,566 కోట్ల దోపిడీ జరిగినట్లు తేల్చిన ఏసీబీ
జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సహా పలువురు నాయకులు, అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటి విచారణ విజయవాడలోని ఏసీబీ కోర్టులోనే జరిగింది. అప్పుడు పనిచేసిన అధికారులు, సిబ్బంది ప్రతి చిన్న విషయానికి చాలా హడావిడి చేసేవారు. కోర్టులో ఏయే పిటిషన్లు, మెమోలు దాఖలు చేయబోతున్నారో ముందుగానే లీక్‌లు ఇచ్చేవారు. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో సరైన ఆధారాలు లేకపోయినా చంద్రబాబుకు బెయిల్ లభించడానికి 2 నెలలు పట్టింది. కానీ వెంకటరెడ్డి విషయంలో తీవ్ర అభియోగాలతో పాటు ఆధారాలు ఉన్నా ఏసీబీ సమర్థంగా వ్యవహరించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం వైసీపీ హయాం నాటి అక్రమాలపై వరుసగా కేసులు నమోదు చేస్తుంది. విచారణలో అప్పటి దౌర్జన్యాలు, అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్న అధికారులు అరెస్టులు చేస్తున్నారు. అయితే ఏ కేసులో సరైన విచారణ జరగడం లేదని కూటమి శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ హయాంలో చెలరేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌కు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. వరుసగా కేసులు పెడుతున్నా చెప్పుకోదగ్గ కీలక నేతలు, అధికారుల అరెస్టులు జరగడం లేదు.
ఏసీబీ సమర్థంగా వ్యవహరించ లేదని విమర్శలు
పలు జిల్లాల్లో అధికారులు తాము చెప్పిన మాట వినడం లేదని కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలే చెప్తున్న పరిస్థితి. తాజాగా అరెస్ట్ అయిన గనుల వెంకటరెడ్డికి వెంటనే బెయిల్ వచ్చింది. అది ఏసీబీ అభ్యంతర పెట్టకపోవడంతో కింద కోర్టులోనే ఊరట లభించింది. ఆయన పరారీలో ఉన్నన్ని రోజులు కూడా జైల్లో లేరు. ఆ క్రమంలో అధికార యంత్రాంగంలో ఇంకా పాత వాసనలు పోలేదని, ఇంకా వైసీపీకి విధేయత ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.