Brahmamudi serial today Episode: కావ్య డిజైన్స్ కొట్టేయాలనుకున్న రాజ్, కావ్య చాంబర్ దగ్గరకు వెళ్లి కావ్య ఇంటికి వెళ్లిపోయిందేమోనని నక్కి నక్కి చూస్తుంటాడు. కావ్య చాంబర్ లోనే ఉంటుంది. చాలా కష్టపడి డిజైన్స్ వేశాం. అవి ఇక్కడ పెట్టడం సేఫ్ కాదేమో మేడం. నాతో పాటు తీసుకెళ్లనా..? అని శృతి అడగ్గానే రాజ్ కోపంగా శృతిని తిట్టుకుంటాడు. వద్దని ఇక్కడే ఉండనని చెప్పి కావ్య, శృతి కలిసి చాంబర్ లోంచి బయటకు వస్తుంటారు. రాజ్ పక్కకు వెళ్లి దాక్కుంటాడు. కావ్య వెళ్లిపోయాక కావ్య చాంబర్ లోకి వెళ్లి డిజైన్స్ చూసి చాలా బాగున్నాయి అని ఫోటో తీసుకుంటాడు. ఇంతలో కావ్య హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానని వెనక్కి చాంబర్ లోకి వస్తుంది.
రాజ్ టేబుల్ కింద దాక్కుంటాడు. చాంబర్ లోకి వచ్చిన కావ్య అనుమానంగా చూస్తుంది. ఏమైంది మేడం అని శృతి అడుగుతుంది. ఇక్కడికి ఎవరో వచ్చారని ఈ డిజైన్స్ ఇందాక నా వైపు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వైపు ఉన్నాయేంటి..? అంటుంది కావ్య. దీంతో శృతి భయంగా అవును మేడం మీరు చెప్తుంది నిజమే.. కొంపదీసి మన ఆఫీసులో దెయ్యాలు ఉన్నాయా…? అంటుంది. కావ్య నీ బొంద మనం వెళ్లాక ఎవరో వచ్చి వెళ్లారు అనుకుంట అంటుంది. కొంపదీసి రాజ్ సార్ వచ్చారా..? అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంది శృతి.
ఆయన ఎందుకు వస్తారు అంటూ ప్రశ్నిస్తుంది కావ్య. ఏమో మేడం ఎవరికి తెలుసు. ఆయన వేసిన డిజైన్స్ కంటే ముందు మీరు వేసిన డిజైన్స్ చూడాలనుకోవచ్చు కదా..? మిమ్మల్ని దెబ్బ కొట్టాలనుకోవచ్చు కదా..? అంటుంది శృతి. దీంతో కావ్య ఆయన ఒక కోపిష్టి, ఆయన ఒక ఈగో పర్సన్. కానీ ఆయన మోసం చేసేంత చెడ్డవారు మాత్రం కాదు. ఆయనకు మాత్రం ఒక క్యారెక్టర్ ఉంది. అంటూ రాజ్ ను ఆకాశానికి ఎత్తుతుంది కావ్య. దీంతో శృతి కన్పీజ్ గా ఆయన ఉన్నప్పుడు తిడతారు. లేప్పుడు ఆయన మీద మాట కూడా పడనివ్వరు అంటుంది. సరేలే పద వెళ్దాం అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. టేబుల్ కింద దాక్కున్న రాజ్ బయటకు వచ్చి మిగతా డిజైన్స్ ఫోటో తీసుకుంటాడు.
ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే.. ధాన్యలక్ష్మీ వస్తుంది. ఆమె రావడం చూసిన ప్రకాష్ చూడు నా భార్య భోజనం చేయడం లేదు ఎవరూ ఆమెను పట్టించుకోవడం లేదు అంటున్నావుగా ఇప్పుడు చూడు భోజనానికి వస్తుంది అని ప్రకాష్ రుద్రాణికి చెప్తాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ కిచెన్ లోకి వెళ్లి తను సెపరేట్ గా చేసుకున్న భోజనం తీసుకుని వస్తుంది. ధాన్యలక్ష్మీ చికెన్ చేసుకోవడంతో స్వప్న అదేంటి శాంత చికెన్ చేసి కూడా నాకు వేయలేదేంటి..? అని అడుగుతుంది. అది నేను చేయలేదమ్మా..? అని శాంత చెప్తుంది. ఎవరు చేస్తేం ఏం తినడానికే కదా.. అని స్వప్న అడగ్గానే ఇందిరాదేవి నీకింకా అర్థం కాలేదా స్వప్న.. ఆవిడ గారు వంటిట్లో వేరు కుంపటి పెట్టింది అంటూ వెటకారంగా చెప్తుంది.
రుద్రాణి కోపంగా ధాన్యలక్ష్మీ బాధ మీ అందరికి అంత వెటకారం అయిపోయిందా..? తను ఎందుకు చేస్తుందో తెలిసి కూడా దాన్ని పరిష్కరించకుండా.. ఇలా దెప్పి పొడవడం పెద్దరికం అనిపించుకోదు అనగానే ధాన్యలక్ష్మీ నా కొడుక్కి అవమానం జరుగుతుంటేనే పట్టించుకోని పెద్దలు ఇప్పుడు పట్టించుకుంటారా..?అంటూ ప్రశ్నిస్తుంది. ఇంతలో ప్రకాష్ నువ్వు అడిగింది బ్రెడ్ ముక్క అనుకుంటున్నావా..? ఆస్థి పంపకం. అది పంచడం అంత ఈజీ అనుకుంటున్నావా..? చూడు ధాన్యం ఒక్క విషయం గుర్తు పెట్టుకో నువ్వు అయినా నేను అయినా.. ఈ ఇంట్లో ఎ ఒక్కరైనా దుగ్గిరాల ఇంట్లో మనిషిగా ఉన్నంత కాలమే మనకు విలువ ఉంటుంది అని హితబోధ చేస్తుంటే.. అన్నయ్య అంతలా మాట్లాడుతుంటే.. నువ్వేం మాట్లాడవేంటి నాన్నా..? ధాన్యలక్ష్మీ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావు అని రుద్రాణి, సీతారామయ్యను అడుగుతుంది. దీంతో సీతారామయ్య నా కోడలు వంట చేసుకునే విషయంలో పాత్రలు ఏమైనా సరిపోకపోతే కొత్తవి నువ్వే తీసుకొచ్చి ఇవ్వు అంటూ భోజనం ముగించి వెళ్లిపోతాడు సీతారామయ్య.
కావ్య డిజైన్స్ అన్ని ఫోటో తీసుకుని వచ్చిన రాజ్ ఇంట్లో బెడ్ రూంలో కూర్చుని కావ్య డిజైన్స్ చాలా బాగా వేసింది. అసలు కళావతికి అంత క్రియేటివిటీ ఎలా వచ్చిందబ్బా.. అయినా నేనే నేర్పించాను కదా..? అందుకుఏ కళావతి డిజైన్స్ కొట్టేయడంలో తప్పు లేదులే అనుకుంటాడు. ఇంతలో రాజ్ ఆత్మ మోసం చేస్తున్నావు అంటూ తిడుతుంది. ఆత్మను తిట్టిన రాజ్ కావ్య వేసిన డిజైన్స్ ను రిక్రియేట్ చేయాలనుకుంటాడు. ఇంతలో సీతారమయ్యా రాజ్ రూంలోకి వెచ్చి ఏం చేస్తున్నావు అని అడిగితే రేపు డిజైన్స్ సబ్మిట్ చేయాలి కదా తాతయ్య అవే ఫైనల్ చేస్తున్నాను అని చెప్పగానే సరేనని సీతారమయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆయన వెళ్లిపోయాక రాజ్ రోజు కావ్యను ఆఫీసుకు తీసుకొచ్చే ఆటో డ్రైవర్ కు ఫోన్ చేసి రేపు కావ్యను అరగంట లేటుగా ఆఫీసుకు తీసుకురమ్మని చెప్తాడు. అలా తీసుకొస్తే మేడం తిడతారని డ్రైవర్ చెప్పగానే కరెక్టు టైంకు తీసుకొస్తే నేను తంతానని రాజ్ బెదిరించడంతో డ్రైవర్ సరే అంటాడు.
కనకం పూజ చేస్తుంది. కావ్య ఆఫీసుకు బయలుదేరుతుంది. మూర్తి దగ్గరకు వెళ్లి ఆశ్చర్యంగా ఏంటి నాన్నా ఇది.. అమ్మ ఏంటి ఇంత పొద్దున్నే పూజలు చేచడం ఏంటి..? అని అడుగుతుంది. కావ్య మాటలు విన్న కనకం దగ్గరకు వచ్చి నువ్వు పందెంలో గెలవాలని పూజ చేశానని హారతి తీసుకో అని ఇచ్చి వెళ్తుంది. హారతి తీసుకున్న కావ్య టైం అవుతుందని వెళ్లిపోతుంది. బయట ఆటోడ్రైవర్ రాజ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని కావ్యను డైవర్ట్ చేయాలనుకుంటుంది. కానీ కావ్య కోపంగా ఆఫీసుకు త్వరగా వెళ్లాలి పద అని ఆటో ఎక్కుతుంది.
హల్ లో అపర్ణ టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతుంది. అది గమనించిన ఇందిరాదేవి ఏంటి అపర్ణ అలా తిరుగుతున్నావు అని అడుగుతుంది. ప్రకాస్ వచ్చి ఇవాళ పందెం రిజల్ట్ తెలిసే రోజు కదమ్మా అందుకే వదిన టెన్షన్ పడుతుంది. అపర్ణ కూడా అదే చెప్తుంది. ఇంతలో రాజ్ ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అయి వస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.