BigTV English

BJP Leaders Astrology: బీజేపీ కొత్త ఎజెండా..! పార్టీ నేతల జ్యోతిష్యం చెప్పబడును..?

BJP Leaders Astrology: బీజేపీ కొత్త ఎజెండా..! పార్టీ నేతల జ్యోతిష్యం చెప్పబడును..?

BJP Leaders Astrology: బీజేపీలో జ్యోతిష్యులు పెరిగిపోయారా? చిట్ చాట్‌ల పేరుతో నేతలు జ్యోతిష్యం చెబుతున్నారా? లేక ఎవరైనా జ్యోతిష్యులే స్క్రిప్ట్ అందిస్తున్నారా? నెల, తేదీ, సమయంతో సహా చెప్పి నేతలు డెడ్‌లైన్ పెడుతున్నారంటే ఖచ్చితంగా తిథులు, నక్షత్రాలు, వారాలు, రోజులు, గడియలు, రాహూ కాలాలు చెప్పే జ్యోతిష్యులు అందించిన స్క్రిప్ట్‌తో బీజేపీ నేతలు చిట్ చాట్ అంటూ రచ్చ చేస్తున్నారా? లేక బీజేపీలో నేతలు చిట్ చాట్ స్టేట్‌మెంట్లతో ఇమేజ్ కోసం పాకులాడుతున్నారా? అసలు కమలం పార్టీలో ఏం జరుగుతోంది?


అక్కడ పార్టీలు, నేతల జ్యోతిష్యం చెప్పబడును..?

అవును అక్కడ పార్టీలు, నేతల జ్యోతిష్యం చెప్పబడును..? మీరు విన్నది నిజమే.. తెలంగాణ కాషాయ పార్టీలో నేతలు మీడియా సమావేశాలు, చిట్ చాట్‌లు పెడితే అచ్చం జ్యోతిష్యం చెప్పినట్టుగానే ఉంటుందనే టాక్ పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతోంది. టార్గెట్ చేసేది బీఆర్ఎస్‌ను కావొచ్చు, కాంగ్రెస్‌ను కావొచ్చు.. వారి లక్ష్యం విపక్షానికి ప్రత్యామ్నాయంగా నిలబడాలనే లక్ష్యం కావొచ్చు.. లేక అధికారంలోకి రావాలనే తపన కావొచ్చు.. ఇలా వారి లక్ష్యం ఏదైనా కానీ.. ఏది పడితే అది మాట్లాడి జ్యోతిష్యం తరహాలో లెక్చర్లు ఇస్తే ప్రజలు నమ్ముతారా? ప్రజలు నమ్ముతారో లేదో అనేది అటుంచితే కమలం పార్టీ కీలక నేతలు చేస్తున్న హడావుడి సొంత పార్టీ కేడరే నమ్మలేని పరిస్థితుల్లో ఉందనే టాక్ సైతం నడుస్తోంది.


బీజేఎల్పీ నేతగా కొనసాగుతున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పడిపోతుందని, ముఖ్యమంత్రిని తప్పిస్తారని, బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని, రేవంత్ రెడ్డి ప్లేస్‌లో కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్‌ను సీఎంగా ప్రకటిస్తుందని.. ఇలా ఎవరికి నోటికొచ్చింది వారు చెప్పుకుంటూ పోతున్నారు నేతలు. కేవలం మాటలే కాదు.. ఈ విషయాలన్ని కూడా ఎప్పుడు జరుగుతాయో చెప్పేస్తున్నారు నేతలు. జూన్ లేదా అక్టోబర్ నెలలో రేవంత్ పాలనకు ఎండ్ కార్డ్ పడుతుందని బీజేఎల్పీ నేతగా కొనసాగుతున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్‌ చెబుతున్నారు.

గ్రెస్ నేతలు నేరుగా బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ జ్యోతిష్యం

ఇలా చెప్పేవారి లిస్ట్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధాన కార్యదర్శులు సైతం ఉన్నారు. ఇప్పుడు వీరి మాటలు జ్యోతిష్యం చెప్పినట్టే కనిపిస్తోంది. అంతేకాదు ప్రభుత్వంపై, ప్రభుత్వ పాలనపై, అడ్మినిస్ట్రేషన్‌పై జ్యోతిష్య డైలాగులతో బీజేపీ నేతల వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో విమర్శలకు కారణమవుతోంది. కాంగ్రెస్ నేతలు నేరుగా బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ జ్యోతిష్యం చెప్పుకోవాలంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం

బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఢీకొట్టాలంటే ముందు బీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకోవాలనే చర్చ జరుగుతోంది. లేదా తెగదెంపులు చేసుకున్నారనే విషయాన్ని ప్రజలు నమ్మాలి. ప్రస్తుతం బీజేపీ వ్యవహార శైలిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా..? తిరంగ యాత్రలు, ఏక్తా యాత్రలు అంటే సెంటిమెంట్ కాబట్టి నమ్మొచ్చు. బీజేపీ, బీఆర్ఎస్‌ మధ్య లోపాయికారి ఒప్పందం లేకపోతే.. కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో ఈ బంధం గురించి చెప్పకనే ఎందుకు చెప్పారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు వెళుతున్నాయంటూ సొంత పార్టీ తీరుపైన కవిత అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ బంధానికి ఈ చర్యే నిదర్శనంగా నిలుస్తుందనే చర్చ జోరుగా సాగుతుంది. బీజేపీకి కేసీఆర్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? బీజేపీకి దగ్గరవుతున్న కేసీఆర్‌ తీరును కవిత వ్యతిరేకిస్తున్నారా? అందులో భాగంగానే నేరుగా చెప్పడానికి ధైర్యం లేక లేఖ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేశారా? అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

బీజేపీ రావాలంటే జ్యోతిష్యం స్క్రిప్ట్ చదవాలా?

ఓ వైపు పరిస్థితులు ఇలా ఉంటే.. బీజేపీ నేతల తీరుమాత్రం మరోలా ఉంది. బయట ఉన్న పరిస్థితులకు భిన్నంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పదవి నుంచి దిగిపోతారు.. కేసీఆర్‌ను కాంగ్రెస్ సీఎం చేయబోతుంది.. ఇలా సాగిపోతున్నాయి వారి వ్యాఖ్యలు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కొట్టాలంటే, ఆ పార్టీ స్థానంలోకి బీజేపీ రావాలంటే జ్యోతిష్యం స్క్రిప్ట్ చదవాలా? ఎందుకు ఆ పార్టీ నేతలు జ్యోతిష్యపు కహానీలకు అలవాటు పడ్డారనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై నినదించకుండా కేవలం ప్రెస్ మీట్లకు, చిట్ చాట్లకు, ఏక్త యాత్రలకు, తిరంగా యాత్రలకు పరిమితం అవుతున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తానికైతే తెలంగాణ బీజేపీలో వింత తీరు కొనసాగుతోంది. అధికార పార్టీ కాంగ్రెస్‌ను ఢీకొట్టేందుకు, బీఆర్ఎస్ ప్లేస్‌ను కైవసం చేసుకునేందుకు బీజేపీ నానా తంటాలు పడుతోంది. అందులో భాగంగానే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై నోటికొచ్చింది వాగేస్తున్నారనే టాక్ ఉంది.

పంచాంగపు లెక్కలు తెలంగాణ ప్రజలు నమ్ముతారా..?

నిజానికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడం మర్చిపోయి పొలిటికల్ గేమ్ లో భాగంగా కొంత మంది బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతల ట్రాప్‌లో పడి, వారి ఎత్తుగడలకు బలవుతున్నారా..? అందులో భాగంగానే వారందిస్తున్న స్క్రిప్ట్ తోనే జ్యోతిష్యం తరహాలో చిట్ చాట్లు, ప్రెస్‌మీట్‌లు అంటూ రచ్చ చేస్తున్నారా..? అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మరి రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్న పంచాంగపు లెక్కలు తెలంగాణ ప్రజలు నమ్ముతారా..? కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయo అటుంచితే కనీసం బీఆర్ఎస్ కైనా ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

–Story By  Anup Vamshi, Big Tv Live

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×