Nara Rohit: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ విభిన్నమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి వారిలో నారా రోహిత్(Nara Rohit) ఒకరు. ఈయన విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే నారా రోహిత్ నటించిన భైరవం (Bhairavam)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ కనకమెడల(Vijay Kanakamedal)దర్శకత్వంలో నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటించిన ఈ సినిమా మే 30వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురు హీరోలు కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నారా రోహిత్ పాల్గొనడంతో ఆయనకు ఊహించని ప్రశ్న ఎదురయింది. ఇటీవల సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప (Pushpa)సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.
భన్వర్ సింగ్ షెకావత్….
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ (Bhanwar Singh Shekhawat)పాత్ర కూడా హైలెట్ గా నిలిచింది. ఈ పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఎంతో అద్భుతంగా నటించారు.ఈ సినిమా ద్వారా ఈయనకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈ పాత్రలో నటించడం కోసం సుకుమార్ ముందుగా హీరో నారా రోహిత్ ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు నారా రోహిత్ సమాధానం చెబుతూ ముందుగా నన్ను మైత్రి మూవీ మేకర్స్ రవి సంప్రదించారు కొన్ని ఫోటోలు పంపించి నన్ను అడిగారు. ఆ తరువాత సుకుమార్ గారు కూడా నన్ను ఈ పాత్ర కోసం సంప్రదించారనీ తెలిపారు.
ఫహద్ ఫాజిల్ నటన అద్భుతం…
ఇలా ఈ పాత్ర గురించి చెప్పడంతో తాను ఈ పాత్రకు సెట్ కానని రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత ఫహద్ ఫాజిల్ ఎంపిక అయ్యారు. ఒకవేళ సినిమాకు కమిట్ అయి ఉంటే షూటింగ్ లొకేషన్లో అందరితోపాటు నటించే వాడినేమో కానీ సినిమా విడుదలైన తర్వాత ఫహద్ నటన చూసి ఆయనలాగా నేను నటించలేనని భావించాను. నిజంగా ఆ పాత్రలో ఫహద్ పెర్ఫార్మెన్స్ అద్భుతం అంటూ నారా రోహిత్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో మంచి అవకాశాన్ని వదులుకున్నావు అన్నా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం భన్వర్ సింగ్ పాత్రలో పహద్ పజిల్ కరెక్ట్ గా సూట్ అయ్యారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.నారా రోహిత్ చివరిగా ప్రతినిధి 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నికల ముందు విడుదలైన ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. మరి భైరవం సినిమా ద్వారా రోహిత్ ఎలాంటి హిట్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.
https://x.com/whynotcinemass_/status/1927292499132924238