Netflix Movies : థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకున్నా పర్వాలేదు.. కానీ ఓటీటీలోకి రిలీజ్ అయితే మాత్రం భారీ వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ మధ్య రిలీజ్ అవుతున్న సినిమాలు అన్ని కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీలో సంస్థల్లో ఒకటి నెట్ ఫ్లిక్స్.. ఇందులో బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఇందులో కొన్ని బెస్ట్ సినిమాలు గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
జాక్ ఓటీటీ..
ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కానీ.. డిజిటల్ ప్లాట్ఫామ్ లలో రిలీజ్ అయిన సినిమాలు బాగానే వ్యూస్ ని కాబట్టి మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన జాక్ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేదు కానీ ఇక్కడ మాత్రం మంచి టాక్ ను అందుకుంది. నెట్ ఫ్లిక్స్ లో టాప్ వ్యూస్ తో దూసుకుపోతుంది..
ది డిప్లొమాట్..
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో టాప్ వ్యూస్ తో దూసుకుపోతున్న సినిమాల్లో ది డిప్లొమాట్.. ఈ మూవీలో జాన్ అబ్రహం, సదియా, ప్రాప్తి శుక్లా, షరీబ్ హష్మీ నటించిన ది డిప్లొమాట్ 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించుకుంది. శివం నాయర్ దర్శకత్వం హించిన ది డిప్లొమాట్ కేవలం హిందీ భాషలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.. మీకు నచ్చితే మీరు ఒకసారి చూసేయ్యండి..
కోర్ట్ ఓటీటీ..
కోర్ట్ రూమ్ డ్రామాగా వచ్చిన కోర్ట్ స్టేట్ వర్సెస్ నో బడీ ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ లోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఈ మూవీ థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకుంది. అదే విధంగా రీసెంట్ గా ఇక్కడకు వచ్చిన ఈ మూవీ దూసుకుపోతుంది.. టాప్ 10 లో ఆరో స్థానంలో ఉంది.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ..
క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి ఈ మూవీలో నటించింది. థ్రిల్లింగ్ సీన్స్, ఇన్వెస్టిగేషన్‌తో సాగే ఈ మూవీ తెలుగులో చూసేందుకు బెస్ట్ ఆప్షన్. ఇక్కడ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో ఇది టాప్ 7 లో దూసుకుపోతుంది..
ఛావా మూవీ..
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ చావా.. ఏడాది థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. మూవీ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్స్ కూడా ఎక్కువగా రావడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 10వ స్థానంలో నిలిచింది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా చూసేందుకు బెస్ట్ ఆప్షన్..
దేవా..
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, పూజా హెగ్దే నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవా. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పుడో ఓటీటీ రిలీజ్ అయిన ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.. టాప్ వ్యూస్ తో దూసుకుపోతున్న సినిమాల్లో ఇది ఒక్కటి.. ఈ మూవీని కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి..
ఇవే కాదు వీటితోపాటు మరికొన్ని సినిమాలు కూడా ఇక్కడ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. మీకు నచ్చిన సినిమాని మీరు ఇక్కడ చూసి ఎంజాయ్ చెయ్యండి… ఇక వచ్చే నెలలో బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం..