BigTV English

BJP MLA Padi: అజ్ఞాతంలోకి పైడి రాకేష్ రెడ్డి!

BJP MLA Padi: అజ్ఞాతంలోకి పైడి రాకేష్ రెడ్డి!

BJP MLA Padi: అసెంబ్లీలో అయినా.. అసెంబ్లీ బయటైనా.. హాట్ కామెంట్స్‌కు కేరాఫ్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి. అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసి.. అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకోవడం ఆయనకు అలవాటు. అట్లాంటి ఫైర్ బ్రాండ్.. ఒంటరిగా మారారనే చర్చ.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటు జిల్లా నేతలు, అటు రాష్ట్రస్థాయి నేతలు.. ఆయనతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. ఫైర్ బ్రాండ్ రాకేశ్ రెడ్డికి.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయనలో ఫైర్ తగ్గించేందుకే ఇలా చేస్తున్నారా?


పార్టీలో అంతర్గత మద్దతు దక్కడం లేదేనే చర్చ

పైడి రాకేశ్ రెడ్డి.. రాష్ట్ర బీజేపీలో పరిచయం అక్కర్లేని పేరు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పైడి రాకేష్ రెడ్డి.. తక్కువ కాలంలోనే బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరు సంపాదించుకున్నారు. సంచలన కామెంట్స్‌కి మారుపేరుగా మారారు. ఇష్యూ ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పటం ఆయన స్టైల్. పైడి రాకేష్ రెడ్డి.. పొలిటికల్ ఎంట్రీ నుంచి.. ఎమ్మెల్యేగా గెలిచే వరకు అన్నీ సంచలనాలే. అలాంటి నేతకు.. ఇప్పుడు పార్టీలో అంతర్గత మద్దతు దక్కడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. అటు ప్రభుత్వం నుంచి కూడా సహకారం లేక సతమతం అవుతున్నారట. అందుకోసమే.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలో.. అభివృద్ధి పనులు ముందుకు సాగట్లేదు. ఆయన ఇచ్చిన హామీలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటంతో.. ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారట.


నిరుపేదలందరికీ రూపాయికే కార్పొరేట్ స్థాయి వైద్యం

పైడి రాకేశ్ రెడ్డి ఇచ్చిన ప్రధాన హామీల్లో.. నిరుపేదలందరికీ రూపాయికే కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం, అర్హులందరికీ సొంత ఇళ్లు ఇవ్వడం లాంటివి ఉన్నాయి. ఈ హామీలతో పాటు ఆయన దూకుడు స్వభావానికి.. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు జై కొట్టారు. దాంతో.. ఆయన పొలిటికల్ ఎంట్రీ.. ఎమ్మెల్యేగా విజయంతోనే మొదలైంది. అయితే.. ఇప్పుడిప్పుడే ఆర్మూర్‌లో సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది.

సొంత ఇండ్ల నిర్మాణం ఊసే లేదని పెదవి విరుస్తున్న ప్రజలు

పైడి రాకేశ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటనే చర్చ మొదలైందట. రూపాయి వైద్యంతో పాటు సొంత ఇండ్ల నిర్మాణం ఊసే లేదని పెదవి విరుస్తున్నారట. ప్రతిపక్ష పార్టీలో ఉండటం, ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేకపోవడంతో.. అభివృద్ధి విషయంలో పైడి రాకేశ్ రెడ్డి కూడా ఏమీ చేయలేకపోతున్నారనే చర్చ సాగుతోంది.

పైడి రాకేశ్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనే చర్చ

మరోవైపు.. పైడి రాకేశ్ రెడ్డికి సొంత పార్టీలోనూ ప్రాధాన్యత తగ్గిందనే చర్చ జరుగుతోంది. ఆయన అప్పుడప్పుడు చేసే సంచలన వ్యాఖ్యలతో.. పార్టీకి జరిగే మేలు కంటే నష్టమే ఎక్కువ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. పైడి రాకేశ్ రెడ్డి దూకుడు స్వభావమే ఆయనకు మైనస్‌గా మారిందట. ఇప్పుడు.. సొంత పార్టీ నేతలు కూడా ఆయనతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట.

Also Read: ఒక్కటైన కేటీఆర్, హరీష్ రావు.. కేసిఆర్ ప్లాన్ అదేనా?

రాష్ట్ర స్థాయిలోనూ పెద్దగా ప్రాధాన్యం దక్కట్లేదనే చర్చ

రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ వినిపిస్తోంది. ఈ పరిస్థితులతో.. ఆయనలో ఫైర్ కూడా తగ్గిందంటున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకెళ్లడం.. పైడి రాకేశ్ రెడ్డికి ప్రధానమైన సవాల్‌గా మారిందంటున్నారు. ఓ వైపు పార్టీలో మద్దతు తగ్గడం, మరోవైపు.. ప్రభుత్వం నుంచి సహకారం అంతంతమాత్రంగానే ఉండటంతో.. రానున్న రోజుల్లో ఆయనెలా వ్యవహహించబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×