WAR 2 teaser:యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు ఆయన బాలీవుడ్లో కూడా అరంగేట్రం చేశారు. అలా అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ‘వార్ -2’ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేశారు ఎన్టీఆర్. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే బాలీవుడ్ లో ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ ఉంది. ఆ కారణంగానే ఆయనను సినిమాలో చాలా అద్భుతంగా చూపిస్తారని ఇటు తెలుగు ఆడియన్స్ కూడా వేయికళ్లతో ఎదురు చూశారు. అందులో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే కావడంతో ఆయన లుక్ కి సంబంధించిన అఫీషియల్ టీజర్ కూడా విడుదల చేశారు మేకర్స్.
ఆశగా చూసిన ఫ్యాన్స్ కి నిరాశ..
ఈ టీజర్ లో హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ మధ్య వార్ చూపించారు ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన ఈ టీజర్ కూడా ప్రేక్షకులను ఒక రకంగా ఆకట్టుకుంది. దీంతో ఎప్పటిలాగే హిందీ వాళ్ళు మోసం చేశారని ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ బర్త్డే రోజున ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశ మిగిలింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీఆర్ లుక్ ఏమాత్రం బాగాలేదు. ఆయన లుక్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నా.. ఈ విషయంలో మాత్రం అభిమానులకు తీరని నిరాశ మిగిలింది. టీజర్ లో ఎన్టీఆర్ కనిపించలేదు. వాయిస్ ఓవర్ ఓకే కానీ మరీ మెప్పించేలా అయితే ఏం లేదు. ఇక పూర్తి డామినేషన్ ఎప్పటిలాగే హృతిక్ దే అనిపించింది. ఆ బాడీకి అందరూ ఫిదా అయిపోతున్నారు. ప్రత్యేకంగా ఆయన బాడీని ఎలివేట్ చేస్తూ షాట్ క్రియేట్ చేశారు. కానీ ఎన్టీఆర్ ని చూపించలేదు. పైగా ఎన్టీఆర్, హృతిక్ ముందు తేలిపోయారనే చెప్పాలి. అయితే ఇక్కడ బర్తడే ఎన్టీఆర్ ది కానీ స్పెషల్ టీజర్ లో మాత్రం హృతిక్ రోషన్ హవా డామినేషన్ కనిపిస్తోంది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా టీజర్ చూసిన తర్వాత అభిమానులు కూడా డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మళ్లీ ఈ బాలీవుడ్ వాళ్లు మనల్ని మోసం చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఎన్టీఆర్ సినిమాలు..
ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో వార్ -2 సినిమాతో పాటు తెలుగులో ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా షూటింగ్లో కూడా ఎన్టీఆర్ వేగంగా పాల్గొంటున్నారు. ఇక ప్రస్తుతం వరకు సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈయన మరొకవైపు ఈ సినిమాలకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
ALSO READ:Tollywood:హీరోయిన్ రాశీ ఖన్నాకు యాక్సిడెంట్.. ముక్కులో నుంచి బ్లడ్.. ఇప్పుడెలా ఉందంటే..?
Double the fire. Double the fury. Pick your side. 🔥 #War2Teaser out NOW #War2 only in theatres from 14th August. Releasing in Hindi, Telugu and Tamil. #YRFSpyUniverse
Hindi: https://t.co/HjQ0NdekHg
Telugu https://t.co/Z1reunIXyC
Tamil https://t.co/y1qj8jj7j6… pic.twitter.com/CcDwzkVYmT— BIG TV Cinema (@BigtvCinema) May 20, 2025