BigTV English

BJP politics on Nehru | నెహ్రూపై బిజేపీ నిందలు.. కశ్మీర్‌పై మరోసారి కమలం పార్టీ రాజకీయాలు!

BJP politics on Nehru | రాజ్యసభ సాక్షిగా జాతీయ నాయకుడు దేశ తొలి ప్రధాన మంత్రి నెహ్రూపై బిజెపి మరోసారి నిందలు మోపింది. జమ్మూ కాశ్మీర్ బిల్లులుపై చర్చలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నోరు పారేసుకున్నారు. మొన్న లోక్‌సభలో… నిన్న రాజ్యసభలో… పండిట్ జవహర్‌లాల్ నెహ్రూపై అవే అనుచిత వ్యాఖ్యలు కొనసాగించారు. కాశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచింది… పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు కారణం నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే అంటూ కామెంట్ చేశారు. అయితే, ఇందులో నిజమెంత..? నాటి రాజకీయాలు, నేతల నిర్ణయాలకు కారణం ఏంటీ…?

BJP politics on Nehru | నెహ్రూపై బిజేపీ నిందలు.. కశ్మీర్‌పై మరోసారి కమలం పార్టీ రాజకీయాలు!
BJP politics on Nehru

BJP politics on Nehru(Latest political news in India):

రాజ్యసభ సాక్షిగా జాతీయ నాయకుడు.. దేశ తొలి ప్రధాన మంత్రి నెహ్రూపై బిజెపి మరోసారి నిందలు మోపింది. జమ్మూ కాశ్మీర్ బిల్లులుపై చర్చలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నోరు పారేసుకున్నారు. మొన్న లోక్‌సభలో… నిన్న రాజ్యసభలో… పండిట్ జవహర్‌లాల్ నెహ్రూపై అవే అనుచిత వ్యాఖ్యలు కొనసాగించారు. కాశ్మీర్ సమస్యను సజీవంగా ఉంచింది… పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు కారణం నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే అంటూ కామెంట్ చేశారు. అయితే, ఇందులో నిజమెంత..? నాటి రాజకీయాలు, నేతల నిర్ణయాలకు కారణం ఏంటీ…?


కాశ్మీర్ విషయంలో నెహ్రూ ఏదైనా తప్పు చేశారా…? బిజెపి నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నెహ్రూ‌పై చేస్తున్న ఆరోపణలకు అర్థం ఏంటీ..? కాశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్యసమితిలో ఎందుకు ప్రస్తావించారు ? అప్పటి కాశ్మీర్ రాచరిక రాజ్యం భారతదేశంలో పూర్తిగా కలిపేయడానికి అడ్డుగా ఉన్న ఆర్టికల్ 370కి నెహ్రూ ఎందుకు అంగీకరించారు? జమ్మూ కాశ్మీర్‌లో మూడింట ఒక వంతు ప్రాంతాన్ని పూర్తిగా సాధించుకునే అవకాశం ఉన్నప్పుడు నెహ్రూ కాశ్మీర్‌లో కొంత భాగాన్ని ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో… దేశ చరిత్రలో జరిగిన కొన్ని విషయాలను బిజెపి వినియోగించుకోడానికి సిద్ధపడింది. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ దేశ ప్రజల మనోభావాలను టచ్ చేస్తూ బిజెపి పెద్దలు మాట్లాడం పరిపాటే. అయితే, ఇప్పుడు బిజెపి అగ్ర నేతల్లో ఒకరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరో బోర్డర్ క్రాస్ చేశాడు. జాతీయ నాయకుడు, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను నిందించే పనిలో పడ్డాడు. కాశ్మీర్‌లో కొంత భాగం పాకిస్థాన్ చేతుల్లోకి వెళ్లిపోడానికి నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ కామెంట్ చేశాడు. నెహ్రూ కాల్పుల విరమణ, కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్లడం వల్లనే ఇప్పటికీ ఆ సమస్య సజీవంగా ఉందని గత వారం పార్లమెంట్‌లో అమిత్ షా వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.


అయితే, అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అమిత్ షా పూర్తి వాస్తవాలను దాచి, వారికి అనువైనట్లు మలుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్‌కు నాటి భారత్ బలగాలు కవాతు చేసి ఉండేవని అమిత్ షా అన్న మాటలకు వివరణ ఇస్తూ… అప్పుడు పూంచ్, రాజౌరీలను రక్షించడానికి, సైన్యాన్ని అక్కడికి మళ్లించవలసి వచ్చిందని… అందుకే ఈ ప్రాంతాలు ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయనీ… లేకపోతే ఇవి కూడా పాకిస్తాన్‌కు వెళ్లి ఉండేవని స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లడం తప్ప ఆ పరిస్థితుల్లో వేరే మార్గం లేదనీ… లార్డ్ మౌంట్ బాటన్, ఇతరులు తదనుగుణంగా సలహా ఇచ్చారనీ… సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఐక్యరాజ్యసమితికి వెళ్లవలసిన అవసరం ఉందని అంగీకరించినట్లు కాంగ్రెస్ నేతలు వివరణ ఇచ్చారు. ఇవేమీ చెప్పకుండా… ఇప్పుడు బిజెపి నేతలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు. జాతి కోసం పోరాటం చేసిన వారిని అవమానపరచడం దేశాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఉన్న పరిస్థితులను పక్కన పెడితే… పదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న మీరు PoKను వెనక్కు ఎందుకు తీసుకురాలేదని అమిత్ షాను ప్రశ్నించారు.

తాజాగా, మరోసారి రాజ్యసభ వేదికగా అమిత్ షా నెహ్రూను టార్గెట్ చేస్తూ ఆవేశంగా మాట్లాడారు. జమ్ము కాశ్మీర్‌కు సంబంధించి నెహ్రూ నిర్ణయాలపై చాలా సంకుచిత దృక్పథం ఉందని అంతా అంటున్నారనీ… భారత భూభాగం విషయానికి వస్తే నెహ్రూ లాంటి పెద్ద మనసు బిజెపి నేతలకు లేదని హేళనగా మాట్లాడారు. భారతదేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వ దృక్పథం చాలా సంకుచితంగా ఉందని… జవహర్‌లాల్ నెహ్రూ కాశ్మీర్‌ను ఇచ్చేసినట్లుగా దేశ భూభాగంలో ఒక్క అంగుళం పోయినా బిజెపి ఒప్పుకోదని అమిత్ షా అన్నారు.

అయితే, అమిత్ షా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను అత్యంత దారుణంగా విమర్శించడం ఇప్పుడు జరిగినట్లు ఇది వరకూ ఎప్పుడూ జరగలేదు. అలాగని, గత పదేళ్ల నుండి అధికారంలో ఉన్న బిజెపి, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి ఆక్రమించలేదు. దానికి సంబంధించిన ప్రయత్నం కూడా ఏదీ చేయలేదు. కానీ ఇటీవల, కాశ్మీర్ సమస్యపై నెహ్రూ తీవ్రమైన తప్పులు చేశారనే ప్రచారాన్ని మాత్రం బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ఈ అంశంపై ఒక ఆంగ్ల దినపత్రికలో కథనం రాశారు. అప్పటి నుండి, నెహ్రూను కాశ్మీర్‌కు విలన్‌గా చేస్తూ అనేక అభిప్రాయాలు, కథనాలు డిజిటల్, ప్రింట్ మీడియాలో వస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ బ్యాకప్‌తో బిజెపి చేసే ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అయితే, ఇప్పుడవి హద్దులు దాటి వెళుతున్నాయి. అందులో ఎక్కువ భాగం ముస్లింలను ఖండించడం, వారి చరిత్ర, వారి సంస్కృతి, సమకాలీన భారతదేశంలో వారి పాత్రలపై విమర్శలు చేస్తున్నారు. సహజంగా, భిన్నత్వంలో ఏకత్వమనే అతిగొప్ప మిశ్రమ సంస్కృతిని విశ్వసించే వారు ఎప్పుడూ విమర్శలకు గురవుతూనే ఉంటారు. వారిలో నెహ్రూ అగ్రగణ్యుడు కావడం ప్రధాన లక్ష్యం. శాంతికి నిదర్శనంగా ఉండే నెహ్రూనే కాశ్మీర్ సమస్య సంక్లిష్టంగా మారడానికి కారణమా? కాశ్మీర్ సమస్యకు అసలు కారణం ఏంటి? ఆ సమయంలో ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ, దాని నాయకుడు విడి సావర్కర్ ఏమి చేస్తున్నారు? కాశ్మీర్ మహారాజు చేరిక ఎందుకు ఆలస్యం అయ్యింది? బ్రిటిష్ తటస్థ పరిశీలకులా లేక అసలు దోషులా? వీటన్నింటికీ సమాధానం దొరికినప్పుడు కాశ్మీర్‌లో నెహ్రూ పాత్ర తేటతెల్లం అవుతుంది.

తరువాయి భాగం క్లిక్ చేయండి

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×