BigTV English

Kalyan Ram Devil Trailer | విధేయతగా ఉండడానికి కుక్కను అనుకున్నావా..? లయన్.. అదిరిపోతున్న డెవిల్ ట్రైలర్..

Kalyan Ram Devil Trailer | నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ కాంబోలో రాబోతున్న పీరియాడికల్ యాక్షన్ స్పై థ్రిల్లర్ డెవిల్. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించబోతున్నాడు .అన్న విషయం తెలిసిందే. ఈ మూవీతో కళ్యాణ్రామ్ మొదటిసారిగా ఫ్యాన్ ఇండియన్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడు.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ నామ దర్శకత్వం వహిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరులో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు విడుదలైన డెవిల్ ట్రైలర్ బాగా వైరల్ అవుతుంది.

ట్రైలర్ బాగా ఆకట్టుకునే విధంగా ఉండడంతో చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.’ఏజెంట్ డెవిల్ కి కనెక్ట్ చేయండి’ .. అంటూ ఓ బ్రిటిష్ ఆఫీసర్ ఫోన్ లో చెప్పే మాటలతో మొదలయ్యే ట్రైలర్ లో .. పోటు మీద ఉన్న సముద్రంలో ఓ షిప్ పై సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ ఎంట్రీ సీన్ అద్భుతంగా ఉంది. ఏంటి సినీ ఫైట్ సీన్ పెట్టారు.. అంటే మూవీలో మరింత ఫైట్ సీన్స్ ఉన్నాయి అని చెప్పకనే చెబుతున్నట్లు.. అభిమానులు భావిస్తున్నారు. ఆ తర్వాత.. మర్డర్ కేస్ ని పరిశీలించడానికి మద్రాస్ నుంచి స్పెషల్గా వస్తున్నాడు.. అనే డైలాగ్ తో కళ్యాణ్ రామ్ ని ఎలివేట్ చేశారు.

ఇక అక్కడ నుంచి కళ్యాణ్ రామ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే విధానం.. అదే సమయంలో హీరోయిన్ ని చూపించడం.. వెంటనే కొన్ని మిస్టీరియర్ షార్ట్ పై ఫోకస్ పెట్టడం.. ఇలా ట్రైలర్ అత్యంత మాసక్తిగా సాగడంతో అంచనాలను బాగా పెంచుతోంది. ఇక ఇందులో కళ్యాణ్ రామ్ చేయబోయే ఆపరేషన్ టైగర్ హంట్ అనే క్లూ ని కూడా బ్రిటిష్ అధికారి కళ్యాణ్ రామ్ కు ఆపరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఇచ్చేశారు మేకర్స్. అంతేకాకుండా ట్రైలర్ లో ఫ్లాష్ బ్యాక్ షాట్స్ ని కూడా అక్కడక్కడ చూపించారు. ఇందులో కళ్యాణ్ రామ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది.

దీన్ని బట్టి చూస్తే సీక్రెట్ ఏజెంట్ పాత్రతో పాటు కళ్యాణ్ రామ్ మరొక పాత్రలో కూడా నటిస్తున్నాడు అని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ట్రైలర్ మొత్తం మీద శవాలు సాక్షాలు చెప్పడం ఎక్కడైనా చూశారా..? విశ్వాసంగా ఉండడానికి విధేయతతో బతకడానికి నేను కుక్కని అనుకున్నావా.. రా.. లయన్.. ఇలాంటి భారీ మాస్ డైలాగ్ చెబుతూ కళ్యాణ్ మీసం మేలు పెట్టే సన్నివేశం హైలెట్ గా ఉంది. ట్రైలర్లో విజువల్స్ చాలా కొత్తగా.. బ్రిటిష్ కాలం నాటి మర్డర్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్ ని బాగా ఆడియన్స్ కు రీచ్ చేసే విధంగా ఉన్నాయి. మొత్తంగా డెవిల్ ట్రైలర్ సక్సెస్ఫుల్ అని సోషల్ మీడియాలో వస్తున్న హైప్ చూస్తే అర్థమవుతుంది. డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×