BigTV English

Botsa Satyanarayana: చక్రం తిప్పిన బొత్స.. పరేషాన్‌లో కూటమి..

Botsa Satyanarayana: చక్రం తిప్పిన బొత్స.. పరేషాన్‌లో కూటమి..

Botsa Satyanarayana: రాజకీయాల్లో అనుభవం చాలా పాఠాలు నేర్పించి రాటు తేలుస్తుంది.. పోల్ మేనేజ్‌మెంట్ సమర్ధంగా చేయగల వారే సక్సెస్ అవుతారు.. విశాఖ జీవీఎంసీ మేయర్ ఫై అవిశ్వాస తీర్మానంకు పోల్ మేనేజ్‌మెంట్ అవసరమైంది.. ఓ పక్క కూటమి మరోపక్క వైసిపి తమ కార్పొరేటర్‌లను కాపాడుకోవడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు.. అక్కడే రాజకీయ అనుభవం తెరమీదకు వచ్చింది.. బొత్స సత్యనారాయణ విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానం విషయంలో చక్రం తిప్పారు.. కూటమి నాయకులకు తన అనుభవంతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.. తమ పార్టీ కార్పొరేటర్‌లను అధికార పార్టీ కంటికి కనిపించకుండా రింగు తిప్పి రింగు మాస్టర్ అనిపించుకున్నారు .. అసలింతకీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఏం జరుగుతోంది?


విశాఖ రాజకీయాలతో సంబంధం లేని బొత్స సత్యనారాయణ

నిన్న మొన్నటి వరకు విశాఖ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. 2024 ఆగస్టు 16న విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికై నేరుగా విశాఖ జిల్లా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. అప్పటివరకు విజయనగరం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ రాష్ట్ర పాలనతో పాటు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ కార్యకలాపాల్లో కూడా అనుభవం ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.. ఎంతలా అంటే రాష్ట్ర విభజనకు ముందు ఒకానొక సమయంలో బొత్స సత్యనారాయణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా జాతీయ కాంగ్రెస్ పరిగణలోకి తీసుకునేంత..


అనవసరమైన విమర్శలకు దూరంగా ఉండే బొత్స

బొత్స సత్యనారాయణ మాట్లాడేటప్పుడు చాలా ఆచి తూచి మాట్లాడతారు.. అనవసరమైన విమర్శలు చేయరు, ఆధారాలు లేకుండా ఎవరిపైనా మాట్లాడరు.. ఇదంతా బొత్స గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే రాజకీయాల్లో డబ్బు, పరపతి మాత్రమే ఉంటే సరిపోదు అనుభవం కూడా ఉంటేనే ఉనికిని చాటుకోగలం అని చెప్పడానికి బొత్స ఒక నిదర్శనం.. బొత్స దగ్గర ఉన్న ఆ రాజకీయ అనుభవమే ఇప్పుడు విశాఖ జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టాలనుకున్న కూటమి ప్లాన్‌ను చిత్తు చేసింది ..

విజయనగరం జిల్లా రాజకీయాలకే పరిమితమవుతూ వచ్చిన బొత్స

1999లో బొబ్బిలి ఎంపీగా, 2004, 2009, 2019ల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేకి గెలిచి కాంగ్రెస్, వైసీపీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసినా.. ఇప్పటివరకు విజయనగరం జిల్లా రాజకీయాలకే బొత్స పరిమితం అవుతూ వచ్చారు.. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బొత్స సత్యనారాయణ విశాఖ మీద ప్రత్యేకమైన దృష్టి సారించారు.. ప్రజా ప్రతినిధిగా విశాఖ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో బొత్స సత్యనారాయణ ఇప్పుడు జీవీఎంసీ ఎన్నికల్లో కీలకమైన వ్యక్తిగా మారారు..

విభజిత విశాఖ జిల్లాలో వైసీపీకి అనుభవం ఉన్న నాయకుడు కరువు

ఇప్పటికే జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్ యాక్టివ్ పొలిటిషన్‌గా పనిచేస్తున్నా .. ప్రస్తుత విభజిత విశాఖ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కనిపించడం లేదు.. ఆ క్రమంలో ఎమ్మెల్సీగా విశాఖ జిల్లా నుంచి ఎన్నికయి విశాఖ రాజకీయాలకు కీలకంగా మారిన బొత్స మాత్రమే ఇప్పుడు వైసీపీకి దిక్కయ్యారు.. బొత్సకు ఉన్న ఆ అనుభవమే విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టినా వైసీపీని గట్టెక్కిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతుంది

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 9 మంది కార్బొరేటర్లు

విశాఖ జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయానికి వచ్చిన కూటమిలోని పార్టీలు వైసీపీకి చెందిన కార్పొరేటర్‌లను తమ పార్టీలో జాయిన్ చేసుకుని బలం పెంచుకునే ప్రయత్నం చేశాయి.. ముఖ్యంగా జీవీఎంసీ మేయర్ మార్పు చేయాలంటే మార్చి 18 వరకు ఉన్న ఆర్డినెన్స్ ప్రకారం నాలుగు సంవత్సరాలు పూర్తి కావాలి.. మార్చి 18న నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో వైసీపీలో నుండి టిడిపిలోకి 9 మంది కార్పొరేటర్ లను జాయిన్ చేసుకుని సంఖ్యా బలాన్ని పెంచుకున్న కూటమి మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకుంది..

36 మంది కార్పొరేటర్లను వైసీపీలోనే కొనసాగేలా చేసిన బొత్స

నాలుగు సంవత్సరాలు దాటడంతో కచ్చితంగా కూటమి మేయర్‌ను మార్చి తీరుతుందని గ్రహించిన వైసిపిలో బొత్స సత్యనారాయణ పెద్దన్న పాత్ర పోషించాడు.. జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ సమన్వయకర్త కూరసాల కన్నబాబులతో కలసి బొత్స సత్యనారాయణ క్షణాల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న 36 మంది కార్పొరేటర్‌లను జిల్లా వైసీపీ కార్యాలయంలో సమావేశ పరిచి దాదాపుగా ఎనిమిది గంటలపాటు ఒక్కొక్క కార్పొరేటర్‌తో ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ మారాలని ఆలోచన ఉన్న వాళ్ళని సైతం వైసీపీలోనే కొనసాగేలా చేయగలిగారు

కార్పొరేటర్ల కుటుంబాలతో సహా క్యాంపు రాజకీయం

ఆ ప్లేస్‌లో బొత్స సత్యనారాయణ కనక లేకపోతే కచ్చితంగా వైసీపీ కార్పొరేటర్‌లను టిడిపి, జనసేనలు తమ పార్టీలో జాయిన్ చేసుకుని అవిశ్వాస తీర్మానం నెగ్గేవంటున్నారు .. కూటమి చేస్తున్న ప్లాన్ ముందుగానే గ్రహించిన బొత్స సత్యనారాయణ కార్పొరేటర్లతో సమావేశం అయిన మరుసటి రోజు మధ్యాహ్నం నుంచే కార్పొరేటర్లతో సహా వారి కుటుంబ సభ్యులను కలిపి బెంగళూరులో క్యాంపు పంపించేశారు.. ఇప్పుడు టిడిపిలోను కూటమికి అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఇంకా నాలుగు ఓట్లు కావాలి.. వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఎవరూ కూడా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనాల్సిన అవసరం లేకపోవడంతో టిడిపి, జనసేన, బిజెపి, ఇండిపెండెంట్‌లు కలిపి పెట్టే అవిశ్వాస తీర్మానం వీగిపోయే పరిస్థితి ..

నెల రోజులు విశాఖ రాకుండా పక్క రాష్ట్రానికి తరలింపు

అవిశ్వాస తీర్మానం పెడితే వైసీపీ కార్పొరేటర్లు ఉండాల్సిన అవసరం లేదని ముందే తెలిసిన బొత్స సత్యనారాయణ పక్కా ప్రణాళికతో కార్పొరేటర్ లను దాదాపుగా నెల రోజులు విశాఖ రాకుండా క్యాంపు పేరుతో పక్క రాష్ట్రానికి తరలించేశారు.. అవిశ్వాస తీర్మానం కచ్చితంగా గెలిచి మేయర్‌ను మారుస్తాం మేయర్ పీఠాన్ని టిడిపి చేజిక్కించుకుంటుందని ధీమాగా చెప్తూ వచ్చిన కూటమిలోని నాయకులు , వైసిపి కార్పొరేటర్లు ఎవరూ ఓటింగ్‌కు రారు అని తెలిసేసరికి నాలుక కరుచుకున్నారంట..

బొత్స అనుభవం ముందు తేలిపోయిన విశాఖ కూటమి నేతలు

విశాఖ జేవీఎంసీ మేయర్‌ను మార్చాలని ఆలోచన చేసిన కూటమిలోని నాయకులు బొత్స సత్యనారాయణ అనుభవం ముందు తేలిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.. రాజకీయాల్లో డబ్బు, పరపతి మాత్రమే కాదు అనుభవం, ఆలోచన కూడా ఉండాలని జీవీఎంసీ కార్పొరేటర్‌లను కూటమి నాయకులు కలవకుండా ప్లాన్ చేసిన బొత్సాని చూస్తే అర్థమవుతుందంటున్నారు..

Also Read: ప్రాణం తీసే చెట్టు.. వీటిని నాటితే పోతారు, మొత్తం పోతారు!

బొత్స సత్యనారాయణ కార్పొరేటర్‌లను క్యాంపుకు పంపించకపోతే కచ్చితంగా 10 నుంచి 15 మంది కార్పొరేటర్లు వైసీపీ నుండి టిడిపి, జనసేనలో జాయిన్ అయి మేయర్‌ను మార్చే అవకాశం ఉండేది.. అందుకే అంటారు అదృష్టం, డబ్బులతో పాటు అనుభవం ఉంటే క్షణాల్లో రాజకీయం చేసి రాజకీయాన్ని మార్చేయ వచ్చని.. ఇది బొత్స విషయంలో నిజమని అర్థం అవుతుంది.. అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిగా బొత్స సత్యనారాయణ వేసిన ప్లాన్ కూటమి నాయకులు ఏ విధంగా చేధించి అవిశ్వాస తీర్మానంలో నెగ్గుతారో చూడాలి

 

 

Related News

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

Big Stories

×