Intinti Ramayanam Today Episode April 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతిని మంచిగా చూసుకోవాలని అవనికి డబ్బులు ఇవ్వబోతాడు. ఈ డబ్బులు ఎందుకు అని అవని అడుగుతుంది. మా చెల్లెలు ప్రెగ్నెంట్ నీ దగ్గర ఇప్పుడు ఉంటుంది కాబట్టి తనకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి అందుకే నేను ఈ డబ్బులు ఇస్తున్నానని అక్షయ్ అంటాడు. నేను ఇవ్వడం ఎందుకు మీరే వచ్చి మీ చెల్లెలుకు డబ్బులు ఇవ్వచ్చు కదా అనేసి ఆవని అంటుంది. ఇక ఆ విషయం ప్రణతితో అవని చెప్తుంది. మీ అన్నయ్య నీకోసం చూడ్డానికి వస్తాడు నువ్వు మంచిగా మాట్లాడు అనేసి అంటుంది. నేను చేసిన పాయసం అంటే మీ అన్నయ్యకు చాలా ఇష్టం ఇది నేను చేశాను అని కాకుండా అసలు నేను ఇంట్లో ఉన్నాను అని కూడా కాకుండా నువ్వు చూసుకోవాలని ప్రణతితో అంటుంది. ప్రణతి తన అన్నని ఇంట్లోకి తీసుకెళ్తుంది అవని చేసిన పాయసాన్ని ప్రణతి అక్షయ్కిస్తుంది. ఆ పాయసం తిని ఇది అవని చేసింది కదా నేను నా చెల్లెలు కోసం వచ్చాను మళ్లీ నీ ప్రేమలు నటించాలని అనుకుంటున్నావా అని అంటుంది. నువ్వంటే ఎప్పటికీ నా మనసులో ప్రేమ లేదు అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..అవని నీ మళ్లి ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నామని అక్షయ్ తో అంటాడు. ఆ మాట వినగానే అందరూ సంతోషిస్తారు ఇక పల్లవి ఆ మాట చెప్పగానే కమల్ చాలా సంతోష పడతాడు. పల్లవి దగ్గరికి వెళ్లి నువ్వేనా ఇలా మాట్లాడుతుందని షాక్ అవుతారు. అక్షయ దగ్గరికి ఆరాధ్య వచ్చి నిజంగానే అమ్మ ఇంటికి వస్తుందని అడుగుతుంది దానికి అక్షయ్ అనగానే ఆరాధ్య సంతోషపడుతుంది. కమల్ దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్లి అవి నేను తీసుకురావాలని అనుకుంటాడు. నువ్వు అర్జెంటుగా రావాలి వదిన అని కమల్ అక్కడికెళ్ళి అవనిని తీసుకొని వస్తాడు.
ఇంటికి అవని రాగానే అందరూ సంతోషంగా పలకరిస్తారు. ముఖ్యంగా కమల్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. ఇంట్లోకి రాగానే వదిన వచ్చిందని హడావిడి చేస్తాడు. పల్లవి ఇప్పుడు జరిగిన గొడవలన్నీ మర్చిపోదాం అక్క ఇకనుంచి హ్యాపీగా ఉందామని మేము అనుకుంటున్నాము అంటూ అంటుంది. ఈ విషయాన్ని నేను చెప్తే నువ్వు నమ్మలేవేమో ఇంటికి పెద్ద అయినా అత్తయ్య గారు చెప్తేనే నువ్వు నమ్ముతావని అంటుంది. పార్వతి ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగింది ఇకమీదట అందరం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం అంటుంది.
అటు రాజేంద్రప్రసాద్ కూడా ఇప్పటివరకు జరిగినవన్నీ మర్చిపోదాం ఇక మీదట సంతోషంగా ఉందామని పల్లవి అనగానే నాకు మంచిగా అనిపించింది అందుకే నేను ఒప్పుకున్నాను అని అంటాడు. పార్వతి మీ తమ్ముడు ప్రణతి ప్రేమించుకున్నారు అన్న విషయం పక్కన పెడితే వాళ్ళిద్దరు పెళ్లిని మళ్లీ గ్రాండ్గా జరిపించాలని అనుకుంటున్నాం వెళ్లి వాళ్ళిద్దర్నీ తీసుకురావాలి అని చెప్పేసి అంటుంది. దానికి అవని ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
మాట్లాడవేంటి అవని నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళిద్దర్నీ దగ్గర చేద్దాం గ్రాండ్ గా పెళ్లి చేద్దామని అంటే మౌనంగా ఉన్నావేంటి అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు. ఈ పెళ్లి జరగదు మామయ్య అని అవని అంటుంది. నువ్వు చేసినప్పుడు తప్పులుంది నేను చేస్తే తప్పేంటి అని పార్వతి అంటుంది.
ఇప్పుడు నేనేమీ చెప్పలేను నన్నేం అడగద్దు అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటకొచ్చిన రాజేంద్రప్రసాద్ అవనీని పిలిచి ఏమైందమ్మా? ఎందుకు నువ్వు వెళ్లిపోవాలనుకుంటున్నావ్ ఏం జరిగిందో కారణం చెప్పకూడదా అని అడుగుతాడు. ఇప్పుడు నేనేం చెప్పలేను మామయ్య నన్నేమీ అడగద్దు అని అవని అంటుంది. వెనకాలే వచ్చిన పార్వతి కూడా మనము కలుసుకోవాలని అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఎవని మాత్రం ఏదో చెప్పాలని చెప్పలేక దాచి పెట్టేస్తుంది దాని మూర్ఖత్వం దానికి వదిలేద్దామని అంటుంది. పల్లవి కూడా అందరం మంచి జరగాలని కలిసుందాం అని అంటుంటే నువ్వు అసలు నిజం చెప్పట్లేదు ఏంటక్కా కనీసం పెద్ద వాళ్ళ కన్నా నిజం చెప్పాలి కదా అని అడుగుతుంది. అవని మాత్రం మౌనంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రణతి రాజేంద్రప్రసాద్ వాళ్లకి నిజం చెప్పేస్తుందా చూడాలి..