OTT Movie : ఓటీటీ లో తమిళ్ నుంచి వచ్చిన, ఒక సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతోంది. ఈ మూవీకి ఐ.ఎం.డి.బి లో 9.2 రేటింగ్ కూడా ఉంది. స్టోరీ చాలా డిఫరెంట్ గా సాగుతుంది. యుక్త వయసులో ఉన్న అమ్మాయి చనిపోవడంతో స్టోరీ మొదలవుతుంది. ఆమె శవాన్ని ఎవరూ కదిలించలేక పోతారు. ఎందుకు ఇలా జరుగుతుందనేది చివరివరకు సస్పెన్స్ గా ఉంటుంది. ఈ మూవీ మిమ్మల్ని కుర్చీలకు కట్టిపడేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
సింప్లి సౌత్ (Simply South) లో
ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘యమకాథాగి ‘ (Yamakaathaghi). 2025 లో విడుదలైన ఈ తమిళ సినిమాకు, పెప్పిన్ జార్జ్ జయశీలన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రూప కొడువాయూర్, నరేంద్ర ప్రసాత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ఒక అతీంద్రియ థ్రిల్లర్ మూవీ. ఇది గ్రామీణ నేపథ్యంలో, భావోద్వేగాలతో సాగుతుంది. ఈ సినిమా మార్చి 7, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సింప్లి సౌత్ (Simply South) లో స్ట్రీమింగ్ అవుతోంది. .
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ తంజావూరు సమీపంలోని ఒక గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామంలో స్థానిక ఆలయంలో ‘కాప్పు కట్టు’ అనే సాంప్రదాయ రక్షణ ఆచారం జరుగుతుంది. ఈ ఆచారాన్ని గ్రామ నాయకుడు సెల్వరాజ్ నిర్వహిస్తాడు. అతను సంప్రదాయాలను కఠినంగా పాటించే వ్యక్తి. అతని కుమార్తె లీలా చిన్నతనం నుండి ఆస్తమాతో బాధపడుతూ ఉంటుంది. తన తండ్రి కఠినమైన నమ్మకాలను తరచూ వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఒక రోజు లీలా సెల్వరాజ్ మధ్య వాగ్వాదం తీవ్రమవుతుంది. ఈ సందర్భంలో సెల్వరాజ్ కోపంతో లీలాను చెంపదెబ్బ కొడతాడు. అవమాన బాధతో లీలా తన గదికి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. కొన్ని గంటల తర్వాత ఆమె ఉరివేసుకుని చనిపోయినట్లు తెలుసుకుంటారు. ఈ దుర్ఘటన ఆమె కుటుంబాన్ని, గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అయితే, ఆమె అంత్యక్రియల సన్నాహాలు ప్రారంభమైనప్పుడు, ఒక వింత సంఘటన జరుగుతుంది. లీలా శవం స్థలం నుండి కదలడానికి నిరాకరిస్తుంది.
ఆమెను ఎంతమంది వచ్చి కదిలించినా, ఒక్క ఇంచ్ కూడా అక్కడినుంచి కదిలించలేకపోతారు. ఈ అతీంద్రియ సంఘటన ఆమె కుటుంబాన్ని, ఆమె మరణం వెనుక దాగి ఉన్న రహస్యాలను బయటపెట్టేలా చేస్తుంది. లీలా మరణం ఆస్తమా దాడి కారణంగా జరిగిందని ఆమె కుటుంబం కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె ఆత్మ న్యాయం కోసం ఆగ్రహిస్తూ, ఆమెపై అన్యాయం చేసిన వారి నుండి నిజాలు రాబడుతుంది. ఒక్కొక్కరూ ఆమె ముందుకు వచ్చి, ఆమె పట్ల ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు అడుగుతారు. అక్కడికి పోలీసులు కూడా వస్తారు. వాళ్ళు ఆమె తక్కువ కులానికి చెందిన ప్రియుడు అన్బు పై అనుమానం పడతారు. అతను కూడా ఆ శవం దగ్గరికి వస్తాడు. చివరికి లీలా శవం అంత్యక్రియలకోసం కదులుతుందా ? ఎందుకు ఆ శవాన్ని ఎవ్వరూ కదిలించలేకపోతారు ? ఈ విశయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.