Hetero Pharma: బతుకు తెర్లయి ఒళ్లంతా గాయాల జల్లెడై విలవిల్లాడుతోన్న వీళ్లు పదేళ్ల కిందటి వరకు భూముల్ని నమ్ముకొని బాగా బతికినోళ్లే ఇప్పటికీ ఆసాములే కానీ ఇప్పుడు నోటి కాడికి బుక్కెడు బువ్వలేక, తిన్నీకీ రెక్కలాడక జీవచ్ఛవల్లా తల్లడిల్లుతున్నారిలా..
హెజీలో అరాచకాలు..
యాదాద్రి భువనగిరి జిల్లా అంతమ్మగూడెంలో ఈ దైన్యానికి, విధ్వంసానికి కారణం, కారకులెవరు? అదిగో హెజిలో ఫార్మా అనబడే ఆ ఆషాడభూతమేనని వేలెత్తి, ఎలుగెత్తి చాటుతోంది పల్లె గొంతుక అవ్వల్ రైట్ ఆగ్రహం అది. టెస్టుల్లో హెజీలో ఫార్మా దగా బయటపడింది. అడగడుగునా నిబంధనల పాతరకు సంబంధించి లెక్కతో సహా పక్కాఆధారాలు తెరపైకి వచ్చాయి. ఫ్యాక్ట్ చెక్ కోసం వెళ్లిన బిగ్ టీవీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్..హెజీలో అరాచకాలను క్యాప్చర్ చేసింది. రూల్స్‌గీల్స్ జాన్తా నహీం అత్యంత ప్రమాదకరమైన విషవాయువుల్ని ఇలా గాల్లోకి వదిలేస్తున్నారు. ZLD.. ETP అన్నీ ఒట్టి మాటలే. డేంజర్ కెమికల్స్‌ను ఇలా డైరెక్ట్‌గా వదిలేస్తున్నారు.
భయంకర రసాయనాలు..
రీసెంట్‌గా గత జులైలో హెజీలో ఫార్మాలో వరుసగా రెండు సార్లు రియాక్టర్లు బ్లాస్టయ్యాయి. ముగ్గురు ఉద్యోగులు చనిపోయారు. మరి కంపెనీపై చర్యలు తీసకున్నారా? నిబంధనల ఉల్లంఘన క్రమంలో సీజ్ ద హెజీలో అంటూ సర్కార్ వారి ఆర్డర్స్ కూడా ఇష్యూ అయ్యాయి. మరి క్లోజింగ్ ఆర్డర్స్ ఎందుకు అమలు కాలేదు. ఏం మాయజరిగింది. ఎవరే మంత్రాంగం చేశారు? హెజీలో ఫార్మా విధ్వంసం ఏ స్థాయిలో వుందో నిజాలు కళ్ల ముందున్నాయి. నివేదికలు అవే చెప్తున్నాయి. ఐనా కానీ హెజీలో ఫార్మాపై కఠిన చర్యలు ఎందుకు చేపట్టడంలేదు? PHARMA..PCB..POLITCAL LEADERS ట్రిపుల్ P మాఫియా విషవలయం ఏస్థాయిలో వేళ్లూనుకుపోయిందో బిగ్ ఎవిడెన్స్‌తో మీ ముందుకు తెస్తోంది బిగ్ టీవీ సిట్..
Tags

Share